పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. | Tokyo Paralympics 2021: Shuttler Suhas Yathiraj settles for silver medal | Sakshi
Sakshi News home page

పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్..

Published Sun, Sep 5 2021 7:54 AM | Last Updated on Sun, Sep 5 2021 10:40 AM

Tokyo Paralympics 2021: Shuttler Suhas Yathiraj settles for silver medal - Sakshi

టోక్యో: టోక్యో వేదికగా జరగుతున్న పారాలింపిక్స్‌లో  భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. తాజాగా  ఆదివారం భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్  ఎస్‌ఎల్4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్‌ ఖాతాలో 18 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత ఐఏఎస్ అధికారిగా సుహాస్ యతిరాజ్  సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

సుహాస్ పూర్తిపేరు సుహాస్ లలినకెరె యతిరాజ్... కర్ణాటకలో జన్మించిన సుహాస్, ఎన్‌ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.సుహాస్ యతిరాజ్ ప్రస్తుతం నోయిడాలోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లాకి మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సుహాస్ యతిరాజ్‌ను ప్రధాని నరేం‍ద్ర మోదీ అభినందించారు

చదవండి: మొగ్గు మనవైపు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement