
కామన్‌వెల్త్ గేమ్స్-2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సిందూ గెలుపొందింది. తొలి సెట్‌లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్‌లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో 21-18తో ప్రత్యర్ధిని మట్టికరిపించి సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది.
ఇక సెమీ ఫైనల్లో సింధు గెలిపొందితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతోంది. ఇక కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా తొమ్మిదో రోజు భారత అథ్లెట్‌లు అదరగొడుతున్నారు. రెండు రజత పతకాలు భారత ఖాతాలో చేరాయి. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించగా, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ ఖాతాలో 28 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
చదవండి: CWG 2022 9th Day: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం