వాంటా (ఫిన్‌లాండ్): ఈ ఏడాది తొలి టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరీక్షణ కొనసాగుతోంది. ఆర్క్‌టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోరీ్నలో సింధు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 63 నిమిషాల్లో 12–21, 21–11, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా) చేతిలో ఓడిపోయింది.
గతంలో వాంగ్ జి యితో ఆడిన రెండుసార్లూ గెలిచిన సింధు మూడోసారి మాత్రం పరాజయం చవిచూసింది. సెమీఫైనల్లో ఓడిన పీవీ సింధుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాదిలో సింధు ఇప్పటి వరకు 18 టోర్నమెంట్‌లు ఆడగా... స్పెయిన్ మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి, మరో మూడు టోరీ్నల్లో సెమీఫైనల్ చేరింది.
చదవండి: World Cup 2023: ఫ్యాన్ బాయ్.. బాబర్ ఆజంకు గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment