సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ఇవాళ (జులై 14) మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తొలి రౌండ్‌లో వరల్డ్ నెం.11 ర్యాంకర్ కిదాంబి శ్రీకాంత్‌కు భారత్‌కే చెందిన మరో షట్లర్ మిథున్ మంజునాథ్ షాకివ్వగా, హెచ్‌ఎస్ ప్రణయ్.. ప్రపంచ నెం.4 ఆటగాడు చో టెన్ చెన్‌పై సంచలన విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్ గండాన్ని అధిగమించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించగా.. మరో మ్యాచ్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ భారత్‌కే చెందిన మాళవిక బాన్సోద్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మిథున్ మంజునాథ్ చేతిలో కిదాంబి శ్రీకాంత్ పోరాడి (17-21, 21-15, 18-21) ఓడగా.. మరో మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, చైనీస్ తైపీకి చెందిన చో టెన్ చెన్‌పై 14-21, 22-20, 21-18తేడాతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్ విషయానికొస్తే.. స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌లో వియత్నాంకి చెందిన వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌పై 19-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించగా.. వెటరన్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో అశ్మిత చాలిహా వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్ చేతిలో పరాజయం పాలైంది.
చదవండి: World Cup 2022: అసలైన మ్యాచ్‌లలో చేతులెత్తేశారు! జపాన్‌తో పోరులో..
Comments
Please login to add a commentAdd a comment