
సెమీఫైనల్లో విజయం కోసం వంద శాతం కష్టపడ్డాను. కానీ తుది ఫలితం నిరాశపరిచింది. క్రీడాకారుల కెరీర్‌లో గెలుపోటములు సహజమే. మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. మూడు గేమ్‌లు ఆడటం సులువేమీ కాదు. ఇలాంటి మ్యాచ్‌ల్లో రెండు, మూడు పాయింట్లే ఫలితాన్ని శాసిస్తాయి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీతో నేనెంతో నేర్చుకున్నాను. ఈ సీజన్‌లోని తదుపరి టోర్నమెంట్‌లలో మరింత మెరుగ్గా రాణించేందుకు శ్రమిస్తాను.
– ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీస్‌లో ఓటమిపై సింధు