టోక్యో: తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. లింగ భేదం లేకుండా పురుషుల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.
2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలిచింది. వాస్తవానికి ముందు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారు భారత పతాకాధారిగా ఉండేవారు. గత రియో ఒలింపిక్ క్రీడల్లో భారత తరుపున బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ పతకాలు సాధించారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కు సాక్షి మాలిక్ ఆర్హత సాధించలేదు. దీంతో పీవీ సింధు అవకాశం దక్కనుంది.
పురుషుల్లో ఎవరనేది మాత్రం తేలలేదు. ముఖ్యంగా కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. వీటిలో బాక్సర్ అమిత్ పంఘాల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, టీటీ ప్లేయర్ ఆచంట వరత్ కమల్, అథ్లెట్ నీరజ్ చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, వీరిలో రియోలో ఏ పతకాన్ని సాధించలేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే ఈ నెలాఖరవరకు ఆగాల్సిందే.
చదవండి: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్‌కు గాయం
Comments
Please login to add a commentAdd a comment