pv sindu
-
భర్త ఒడిలో క్యూట్ కిడ్స్.. ఐ లవ్ యూ సో మచ్ అంటున్న పీవీ సింధు (ఫొటోలు)
-
మావారి తరఫున మీకు హ్యాపీ న్యూ ఇయర్.. (ఫొటోలు)
-
కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు డ్యాన్స్ ప్రాక్టీస్(ఫొటోలు)
-
Malaysia Open 2022: సింధుకు మళ్లీ నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్‌లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీఫైనల్లో అడుగు పెట్టిన పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధూ.. పాన్‌కు చెందిన అకానె యమగుచిపై 21-15, 20-22, 21-13 స్కోర్‌తో విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీ జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించింది. కాగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక శనివారం జరగనున్న సెమీఫైనల్లో చెందిన ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యు ఫీతో సింధు తలపడనుంది. చదవండి: India Tour of Ireland: టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం -
క్వార్టర్ ఫైనల్లో సింధు .. శ్రీకాంత్ వాకోవర్
బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత టాప్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ మ్యాచ్ ఆడకుండానే ‘వాకోవర్’ ఇవ్వడంతో అతని ప్రత్యర్థి ఎన్‌హట్ గుహెన్ (ఐర్లాండ్) ముందంజ వేశాడు. శ్రీకాంత్ పొత్తి కండరాలు పట్టేయడంతో కోర్టులోకి దిగక ముందే తప్పుకున్నాడు. లెవెర్డెజ్తో జరిగిన తొలి రౌండ్లోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నా...ఎలాగోలా మ్యాచ్‌ను ముగించగలిగాడు. ఇతర మ్యాచ్‌లలో భారత షట్లర్ల ఆట ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్, మహిళల డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడి, మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రస్టో జంట ఓడారు. -
ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు
ఆసియా చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో పెనాల్టీ పాయింట్ వివాదం కూడా తన ఓటమికి ఒక కారణమని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయపడింది. ఇక తన దృష్టంతా ఈనెల 8 నుంచి జరిగే ఉబెర్ కప్ టోర్నీపై ఉందని తెలిపింది. సమయానికి విమానం అందుకోవాలనే కారణంతో సింధు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని.. అంతే తప్ప సెమీఫైనల్ ఉదంతంపై నిరసన వ్యక్తం చేయడానికి కాదని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులకు సింధు సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బుధవారం భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎ దురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లే యర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించి ముందంజ వేయగా, కిడాంబి శ్రీకాంత్ సునాయాస విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ‘డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్’ పీవీ సింధు తొలి రౌండ్లో 18–21, 27–25, 21–9 స్కోరుతో పై యు పొ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఈ పోరు ఏకంగా 77 నిమిషాల పాటు సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న పై యు పొ భారత టాప్ ప్లేయర్‌కు గట్టి పోటీనిస్తూ తొలి గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా 52 పాయింట్ల పాటు సాగింది. చివరకు తన అనుభవాన్నంతా ఉపయోగించి గేమ్‌ను గెలుచుకున్న సింధు, మూడో గేమ్‌లో చెలరేగి ప్రత్యర్థిపై విరుచుకుపడింది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21–15, 17–21, 21–13 తేడాతో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–15తో జె యంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ఐదో సీడ్ సేన్ 21–12, 10–21, 19–21 స్కోరుతో లి షి ఫెంగ్ (చైనా) చేతి లో పరాజయంపాలు కాగా...సాయిప్రణీత్ 17–21, 13–21తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. ఇతర భారత ప్లేయర్లు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్, సిమన్ర్ సింఘి–రితిక థాకర్ జోడి తొలి రౌండ్ దాటలేకపోయారు. -
Swiss Open: ఫైనల్లో సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 79 నిమిషాల్లో 21–18, 15–21, 21–19తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. గత ఏడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి సింధు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ (భారత్) ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెమీఫైనల్లో ప్రణయ్ 21–19, 19–21, 21–18తో ఐదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచాడు. రెండో సెమీఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–18, 7–21, 13–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. -
సెమీస్‌లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు. -
పద్మభూషణ్ అందుకున్న పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు ప్రముఖులకు 2020 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం 141 పద్మ అవార్డులను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు. అవార్డులను అందుకున్న వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఏపీలోని మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాప కుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరొందిన భాష్యం విజయసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తోలు బొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పద్మశ్రీ పురస్కారగ్రహీత చింతల వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు పద్మభూషణ్
-
పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..
PV Sindhu conferred with Padma Bhushan: భారత్ దేశంలో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2020లో మొత్తంలో 119మందికి ఈ అవార్డలును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో తెలుగుతేజం బ్యాడ్మంటిన్ స్టార్ షట్లర్ పీవి సింధు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గోన్నారు. చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్‌కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తాడు -
క్వార్టర్ ఫైనల్లో సింధు
ఒడెన్స్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 12–21, 21–15తో బుసానన్ ఒంగ్‌బమృంగ్‌ఫాన్ (థాయ్‌లాండ్)పై పోరాడి గెలిచింది. 67 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను సింధు సులభంగా చేజిక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న బుసానన్ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధుపై ఆధిపత్యం ప్రదర్శించింది. దాంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారి తీసింది. ఇక్కడ లయను అందుకున్న సింధు గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 21–23, 9–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో, లక్ష్యసేన్ 15–21, 7–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–14, 15–21, 15–21తో గో జె ఫీ–నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జంట చేతిలో ఓడగా... మరో భారత జంట ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 15–21, 21–17, 12–21తో ఫజార్ అల్ఫియాన్– మొహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ద్వయం ధ్రువ కపిల–సిక్కి రెడ్డి 17–21, 21–19, 11–21తో తాంగ్ చున్మన్– త్సెయింగ్ సుయెట్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. -
హల్చల్ :మెహ్రీన్ కవిత్వం..ప్రేమలో ఉన్నానంటున్న రకుల్
► ఏక్ బార్ అంటున్న దీప్తి సునయన ► చీర్స్ అంటున్న బుల్లితెర నటి అష్మిత ► అవి మాత్రం ఎవరికి కనిపించవుంటున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత ► పచ్చని పొదళ్ల మధ్యలో హీరోయిన్ సదా ► దీంతో ప్రేమలో ఉన్నానంటున్న రకుల్ ► క్యాజువల్ లుక్‌లో రాహుల్ సిప్లిగంజ్ ► కవిత్వం చెబుతున్న మెహ్రీన్ ► త్రోబ్యాక్ ఫోటో షేర్ చేసిన రాహుల్ ► మండే మోటివేషన్ అంటున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Satya Yamini (@satya.yamini) View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
మెగాస్టార్ ఇంట్లో పీవీ సింధు, ఘనంగా సత్కారం ఫొటోలు
-
చిరు ఇంట్లో పీవీ సింధుకు సత్కారం, టాలీవుడ్ ప్రముఖుల హాజరు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, రానా, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ పలువురు హీరోలతో పాటు హీరోయిన్లు సుహాసిని, రాధిక శరత్ కుమార్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. సినీ ప్రముఖుల మధ్య మెగాస్టార్, అల్లు అరవింద్ తదితరులు సింధును సత్కరించి అనంతరం ఆమె సాధించిన మెడల్‌తో వారంతా ఫొటోలు దిగారు. చదవండి: ప్రభాస్ అస్సలు అలాంటి వాడు కాదు: కృతి సనన్ ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేస్తూ.. ‘దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే పీవీ సింధును కలవడం చాలా సంతోషంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్‌లో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. చదవండి: ‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్‌బాస్ సభ్యులకు నైట్ పార్టీ! View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన పీవీ సింధు, రజనీ
-
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం
-
పీవీ సింధుకు విజయవాడలో గ్రాండ్ వెల్ కమ్
సాక్షి, విజయవాడ: పీవీ సింధుకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఏపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఇతర అధికారులు, క్రీడాకారులు సింధుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్ వెళ్లేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపింది. ఒలింపిక్స్‌లో పతకం తేవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సింధు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. చిన్న వయసులోనే రెండు మెడల్స్ తీసుకురావటం దేశానికి గర్వకారణమని కొనియాడారు. యువతకి సింధు రోల్ మెడల్‌గా నిలుస్తుందన్నారు. సింధును ఆదర్శంగా తీసుకొని యువత భవిష్యత్తులో రాణించాలని సూచించారు. ఇక విశాఖలో అకాడమీ కోసం సింధుకి సీఎం జగన్ రెండు ఎకరాలు భూమి ఇచ్చారని గుర్తుచేశారు. -
PV Sindhu: పీవీ సింధుకు కేంద్రం ఘన సత్కారం
-
పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అంటూ ట్విట్టర్లో సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డును పీవీ సింధు అందుకుంది. All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020 She is the 1st Indian woman to have won two individual medals at #Olympics. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2021 -
Tokyo Olympics: పీవీ సింధు కొత్త చరిత్ర
-
PV Sindhu: స్వర్ణ, రజతాలకు సింధు దూరం
రియో ఒలింపిక్స్‌లో రజతం నుంచి టోక్యోలో స్వర్ణానికి... ఇదే లక్ష్యంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు దురదృష్టవశాత్తూ ఆ అవకాశం దూరమైంది. తొలి నాలుగు మ్యాచ్‌లలో తిరుగులేని ఆటతో ఆశలు రేపిన సింధు జోరును వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ అడ్డుకుంది. మొదటి గేమ్ హోరాహోరీగా జరిగినా, రెండో గేమ్‌లో పూర్తిగా చైనీస్ తైపీ అమ్మాయి దూకుడు సాగింది. ఆమె ముందు నిలవలేకపోయిన భారత షట్లర్‌కు నిరాశ తప్పలేదు. అయితే మరో ఘనతను అందుకునేందుకు కాంస్యం రూపంలో సింధుకు అవకాశం ఉంది. నేడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో గెలిస్తే రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు నిలుస్తుంది. టోక్యో: ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్రీడాకారిణులు (బాంగ్ సూ హ్యూన్–కొరియా, జాంగ్ నింగ్–చైనా)లకు మాత్రమే రెండుసార్లు ఫైనల్ చేరిన ఘనత ఉంది. శనివారం తర్వాత పీవీ సింధు పేరు కూడా ఆ జాబితాలో చేరేది. కానీ ఆమె చిరకాల ప్రత్యర్థి తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమితో అది సాధ్యం కాలేదు. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది. 40 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తెలుగమ్మాయి ప్రయత్నం గెలిచేందుకు సరిపోలేదు. ఓవరాల్‌గా వీరిద్దరు తలపడిన 19 మ్యాచ్‌లలో తై జు చేతిలో సింధుకు ఇది 14వ పరాజయం. ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం సాధించే అవకాశం కానీ, 2016 ‘రియో’లో సాధించిన రజత పతకాన్ని నిలబెట్టుకునే అవకాశం గానీ సింధుకు లేకపోయింది. అయితే మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకునేందుకు ఆమె ప్రయత్నించనుంది. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో హి బింగ్ జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) 21–16, 13–21, 21–12తో తన దేశానికే చెందిన హి బింగ్ జియావోపై గెలుపొందింది. సింధు, బింగ్ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా... సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గారు. హోరాహోరీ నుంచి ఏకపక్షంగా... ఈ మ్యాచ్‌కు ముందు ఒక్క గేమ్ కూడా కోల్పోని సింధు సెమీస్‌లోనూ అదే ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టింది. సుదీర్ఘ ర్యాలీలతో గేమ్ మొదలైనా... కొన్ని చక్కటి స్మాష్‌లు కొట్టడంతో పాటు ప్రత్యర్థి సొంత తప్పిదాలను అవకాశంగా మలచుకున్న సింధు 7–3తో ఆపై 8–4తో ముందంజ వేసింది. విరామ సమయానికి 11–8తో ఆమె ఆధిక్యంలో నిలిచింది. అయితే ఒక్కసారిగా కోలుకున్న తై జు మూడు పాయింట్లు సాధించి 11–11తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ నువ్వా, నేనా అంటూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో స్కోరు 18–18కి చేరింది. క్వార్టర్స్‌లో యామగూచితో జరిగిన మ్యాచ్ రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడి ఉన్న దశలో సింధు వరుసగా నాలుగు అద్భుత పాయింట్లు సాధించి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. దాదాపు ఇదే స్థితిలో ఒక్కసారిగా చెలరేగిన తై వరుస పాయింట్లతో గేమ్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌ను తై జు శాసించింది. ఉత్సాహం పెరిగిన ఆమె సింధు డిఫెన్స్ లోపాలను సమర్థంగా వాడుకుంది. భారత ప్లేయర్ క్రాస్ కోర్ట్ స్మాష్‌లు గానీ రిటర్న్‌లు గానీ పని చేయలేదు. సగం గేమ్ ముగిసేసరికి 11–7తో ముందంజలో ఉన్న తై జు... ఆ తర్వాత మరింత వేగంగా దూసుకుపోయింది. తైపీ ప్లేయర్ జోరుకు సింధు వద్ద సమాధానం లేకపోయింది. మహిళల సింగిల్స్‌లో సుదీర్ఘ కాలం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న రికార్డుతో పాటు అత్యధికంగా 11 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్స్ తన పేరిటే ఉన్నా... తై జు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో గానీ, వరల్డ్ చాంపియన్‌షిప్‌లోగానీ విజేతగా నిలవలేదు. తొలి ఒలింపిక్ పతకాన్ని అందుకునే అరుదైన అవకాశం ఇప్పుడు ఆమె ముందు నిలిచింది. చాలా బాధగా ఉంది. ఇది సెమీఫైనల్ మ్యాచ్ కాబట్టి ఫలితం ఇంకా ఎక్కువ బాధిస్తోంది. అయితే నేను చివరి వరకు పోరాడుతూ శాయశక్తులా ప్రయత్నించాను. ఈ రోజు నాది కాదు. రెండో గేమ్‌లో నేను చాలా వెనుకబడ్డా పోరాడాను. ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఆట మనకు అనుకూలంగా మారిపోవచ్చు. ఒలింపిక్స్ అంటే ఆఖరి పాయింట్ వరకు పోరాడాల్సిందే. నేను అదే పని చేశాను. ఆమె బలాలు ఏమిటో నాకు తెలుసు కాబట్టి సన్నద్ధమయ్యే వచ్చాను. అయితే సెమీఫైనల్ హోరాహోరీగా సాగడం సహజం. సులువైన పాయింట్లనేవి లభించవు. ఏం చేసినా నాకు గెలుపు దక్కలేదు. ఈ ఓటమి కొంత సమయం బాధిస్తూనే ఉంటుంది. కాస్త ప్రశాంతంగా కూర్చొని కాంస్య పతక మ్యాచ్ కోసం వ్యూహం రూపొందించుకుంటా. అంతా ముగిసిపోలేదు. నాకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా. –పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో సింధు ఆట కొంత లయ తప్పినా ఆ వెంటనే కోలుకొని మళ్లీ బాగా ఆడగలిగింది. కానీ ఈ మ్యాచ్‌లో అది సాధ్యం కాలేదు. ఒక్కసారి వెనుకబడిన తర్వాత మళ్లీ లయ అందిపుచ్చుకోకపోతే ఇలాంటి కీలక మ్యాచ్‌లలో గెలవడం కష్టం. సింధుకు తై జు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ప్రతీ డ్రాప్ షాట్ తైపీ అమ్మాయికి పాయింట్లు అందించింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడితే అలాంటి ప్రత్యర్థిని సమర్థంగా ఎదుర్కోవచ్చు కానీ అదీ జరగలేదు. మూడో స్థానం కోసం మ్యాచ్ ఆడాల్సి రావడం ఏ ప్లేయర్‌కైనా బాధ కలిగిస్తుంది. అయితే సింధు సెమీస్ ఫలితం గురించి ఆలోచించకుండా తాజాగా బరిలోకి దిగితే మంచిది. –పీవీ రమణ, సింధు తండ్రి -
సింధు వేట మొదలైంది
టోక్యో: ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుభారంభం చేసింది రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, వరల్డ్ చాంపియన్ సింధు తన ‘జె’ గ్రూప్ తొలి మ్యాచ్‌లో 21–7, 21–10 స్కోరుతో సెనియా పొలికర్పొవా (ఇజ్రాయెల్)ను చిత్తుగా ఓడించింది. 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. భారత స్టార్ షట్లర్ ముందు ప్రత్యర్థి తేలిపోయింది. తొలి గేమ్‌ను నెమ్మదిగా ప్రారంభించి 3–4తో వెనుకబడినా... ఆ వెంటనే కోలుకున్న సింధు దూసుకుపోయి 11–5తో నిలిచింది. ఒకదశలో సింధు వరుసగా 13 పాయింట్లు సాధించడం విశేషం. రెండో గేమ్‌లో కూడా సింధు 9–3తో ముందంజ వేసి బ్రేక్ సమయానికి 11–4తో నిలిచింది. ఈ స్థితిలో పొలికర్పొవా మొదటి గేమ్కంటే కాస్త మెరుగ్గా ఆడుతూ పోటీనిచ్చే ప్రయత్నం చేసింది. అయితే సింధు పదునైన క్రాస్‌కోర్ట్ స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో విజయం దిశగా పయనించింది. ‘జె’ గ్రూప్‌లో తన తర్వాతి మ్యాచ్‌లో చెంగ్ గాన్ యి (హాంకాంగ్)తో సింధు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సింధు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచా. అయితే నేనేమీ ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోలేదు. బలహీన ప్రత్యర్థే అయినా పూర్తి సామర్థ్యంతోనే ఆడాలి. ఎందుకంటే ఒక్కసారిగా బలమైన ప్రత్యర్థి ఎదురైతే స్ట్రోక్స్ కొత్తగా అనిపించవచ్చు. రియో రజతం తర్వాత కూడా గత ఐదేళ్లలో ఎంతో కష్టపడ్డాను. దాని ఫలితం రాబట్టేందుకు ఇదే సరైన సమయం. రియో ఘనత ముగిసిపోయిది. ఈ ఒలింపిక్స్ మరో కొత్త ఆరంభం. స్టేడియంలో అభిమానులు లేకపోవడం నిరాశ కలిగించినా మన దేశంలో ఎందరో నాకు మద్దతు తెలుపుతూ నా విజయాన్ని ఆకాంక్షిస్తుండటం సంతోషకరం. –పీవీ సింధు -
టోక్యో ఒలింపిక్స్ Day 3: చిత్తుగా ఓడిన భారత పురుషుల హాకీ జట్టు
నిరాశపర్చిన భారత స్విమ్మర్లు టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్లు నిరాశపరిచారు.స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీ ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయాడు. శ్రీహరి నటరాజ్ 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి 27వ స్ధానంలో నిలిచాడు. అయితే మెదటి 16 మందికి మాత్రమే సెమిఫైనల్‌కు చేరే ఆర్హత ఉంటుంది. దీంతో శ్రీహరి నటరాజ్ ఆర్హత సాధించ లేకపోయాడు. మరో వైపు స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ భారత మహిళ స్విమ్మర్ మానా పటేల్ కూడా సెమీ ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయింది. ఆస్ట్రేలియా చేతిలో భారత హాకీ జట్టు ఓటమి టోక్యో ఒలింపిక్స్‌లో మెదటి మ్యాచ్‌లో శుభారంభం చేసిన భారత పురుషుల హాకీ జట్టు రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియాపై అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. పూల్ ఎ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు 1-7 తేడాతో చిత్తుగా ఓటమి పాలైంది. మెదటి క్వార్టర్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఆస్ట్రేలియా తన ఆధిపత్యం చెలాయించింది. మెదటి క్వార్టర్ 10వ నిమిషంలో మొదటి గోల్ చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత 21వ, 23వ, 26వ నిమిషాల్లో గోల్స్ చేసి రెండో క్వార్టర్ ముగిసేసరికి 4-0 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో భారత జట్టు తరుపున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే ఏకైక గోల్ చేయగలిగాడు. అయితే ఆ తర్వాత మూడో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసిన ఆస్ట్రేలియా, నాలుగో క్వార్టర్లో మరో గోల్ చేసి 7-1 తేడాతో ఘనవిజయం సాధించింది బాక్సింగ్‌లో మేరీ కోమ్ విజయం ఒలింపిక్స్‌లో భాగంగా బాక్సింగ్‌లో మేరీ కోమ్ శుభారంభం చేసింది. మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32లో డొమెనికన్ రిపబ్లిక్కు చెందిన మిగులినాను ఓడించిన మేరీ కోమ్ రౌండ్ 16కు అర్హత సాధించింది. ఇక జూలై 29న మేరీ కోమ్ కొలంబియాకు చెందిన మూడో సీడ్ వాలెన్సియా విక్టోరియాతో రౌండ్ 16లో తలపడనుంది. కాగా మేరీకోమ్ 2012 లండన్ ఒలింపిక్స్ విభాగంలో క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. India's Legendary Women Boxer MARY KOM Start her Tokyo Olympic Campaign right now. Sixth time world champion Mary's ambition to win gold in Olympic. Hope she fulfill his dream. #MaryKom #boxing #Tokyo2020 pic.twitter.com/qrJacilTVc — Gautam™ #IND (@SpeaksGautam) July 25, 2021 మూడో రౌండ్‌కు మనికా బత్రా ►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బత్రా మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గారిటా పెసోట్స్కాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా ఏడు గేములు కలిపి మనికా 11-4, 11-4, 7-11, 10-12, 11-8, 5-11, 7-11తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ నుంచి జ్ఞానేశ్వరన్ ఔట్ ►ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ కాంపిటిషన్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియాకు చెందిన జ్ఞానేశ్వరన్ సత్యన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాడు, హాంకాంగ్‌కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్‌పై ఆశలు రేపిన జ్ఞానేశ్వరన్.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్నాడు. షూటింగ్లో మరోసారి నిరాశ ►టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మరోసారి నిరాశే ఎదురైంది. పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్ సింగ్ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్ సింగ్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టిన యాష్లే బార్టీ ► మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ యాష్లే బార్టీకి గట్టి షాక్ తగిలింది. సారా సోరిబ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బార్టీ 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక ఒలింపిక్స్‌లో సింగిల్ విభాగం నుంచి ఇంగ్లండ్ స్టార్ ఆండీ ముర్రే వైదొలిగాడు. గాయం కారణంగా సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే తెలిపాడు. కాగా డబుల్స్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు. ఇక ముర్రే 2012,2016 ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్ టెన్సిస్‌లో భారత్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన సానియా- అంకితా రైనా జోడి తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఉక్రెయిన్ జంటతో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో 6-0, 6-7(0). 8-10తో ఓడిపోయింది. ►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రోయింగ్‌లో భారత్ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపికేజ్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌లాల్, అరవింద్ సింగ్ జోడీ సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు క్యాంస్యం ఖరారు అవుతుంది. పీవీ సింధు శుభారంభం ►టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా షట్లర్ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాతో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ను సింధు 27-7, 21-10తో వరుస రెండు గేముల్లో గెలిచి మ్యాచ్‌ను వశం చేసుకుంది. 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం. షూటింగ్ విభాగంలో మళ్లీ నిరాశే ►మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుబాకర్, యశస్వినిలు చతికిలపడ్డారు. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో మను బాకర్ 12వ స్థానంలో, 13వ స్థానంలో యశస్విని నిలిచారు. టోక్యో: తొలి రోజైతే శుభవార్త విన్నాం. వచ్చింది రజతమే అయినా బంగారమంత ఆత్మవిశ్వాసాన్ని భారత క్రీడాకారుల్లో నింపింది. కొండంత ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ఊతమిచి్చంది. ఆదివారం షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో భారత క్రీడాకారులు తలపడనున్నారు. ఈ ఎనిమిది ఈవెంట్లలోనూ పతకం గెలిచే క్రీడాంశం షూటింగ్ ఒక్కటే ఉంది. మిగతావన్నీ కూడా క్వాలిఫికేషన్, లీగ్, తొలి రౌండ్, హీట్స్ పోటీలు. తెలుగమ్మాయి, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి రౌండ్ ఆట, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ మొదటి బౌట్ కూడా నేడే మొదలవుతోంది. టెన్నిస్‌లో సానియా మీర్జా– అంకిత రైనా జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఉ.6:30కి జిమ్నాస్టిక్స్ మహిళల ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్ ఉ.6:30కి రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ రెపిచేజ్ ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్) ఉ.7:10కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (పీవీ సింధు) ఉ.9:30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ.1:30కి బాక్సింగ్ మహిళల ఫ్లైవెయిట్ (మేరీకోమ్ రౌండ్ఆఫ్ 32) మ.3 గంటలకు భారత్ Vs ఆస్ట్రేలియా హాకీ మ్యాచ్ మ.3:30కి స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (మానా పటేల్) మ.3:30కి స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్ (సాజన్ ప్రకాశ్) సా.4:20కి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్) -
ప్రేక్షకులు లేకపోవడం లోటే: సింధు
హైదరాబాద్: కోవిడ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే... బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట సింధు మాత్రం తనకు మహమ్మారితో కీడు కంటే మేలే జరిగిందని చెప్పుకొచ్చింది. గురువారం ఇక్కడ వర్చువల్ మీడియా కార్యక్రమంలో పా ల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కరోనా వల్ల వచ్చిన విరామం నాకైతే బాగా దోహద పడింది. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు విరామం అక్కరకొచ్చింది. దీని వల్ల ఎక్కువ సమ యం ఆటపైనే దృష్టి పెట్టేలా చేసింది. ఇవన్నీ నా ఆటకు, టోక్యోలో ముం దంజ వేసేందుకు తప్పకుండా ఉపయోగపడతాయనే గట్టి నమ్మకంతో ఉన్నాను. సాధారణంగా అయి తే విదేశాల్లో జరిగే టోర్నీలు ఆడేందుకు వెళ్లడం, తిరిగొచ్చి శిక్షణలో గడపటం పరిపాటి అయ్యేది. ప్రయాణ బడలిక, బిజీ షెడ్యూల్ వల్ల సమయం పూర్తి స్థాయి శిక్షణకు అంతగా సహకరించేది కాదు. ఇప్పుడైతే విరామంతో వీలైనంత ప్రాక్టీస్ చేసేందుకు మరెంతో సమయం లభిం చింది’ అ ని వివరించింది. ప్రేక్షకుల్లేకపోవడాన్ని మాత్రం లోటుగా భావిస్తున్నట్లు సింధు చెప్పింది. 1000 మంది వీఐపీలతోనే... టోక్యో: విశ్వక్రీడలు ఎక్కడ జరిగినా... ఏ దేశం ఆతిథ్యమిచ్చినా... ప్రారంభోత్సవ వేడుకలైతే అంబరాన్ని అంటుతాయి. అయితే కరోనా కార ణంగా ఈ నెల 23న నేషనల్ స్టేడియంలో జరిగే ప్రతిష్టాత్మక వేడుకకు కేవలం వందల సంఖ్యలోనే అది కూడా వీఐపీ ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. 68 వేల సామర్థ్యమున్న స్టేడియంలో కేవలం 1000 లోపు ప్రముఖులే ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకిస్తారు. టోక్యో గవర్నర్‌తో ఐఓసీ చీఫ్ భేటీ ఇంకో వారంలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా జపాన్ అధ్యక్షుడు సీకో హషిమొటో, ప్రధాని యోషిహిదే సుగాలతో సమావేశమైన ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ గురువారం కూడా టోక్యో గవర్నర్ యూయికొ కొయికేతో మీటింగ్‌లో పాల్గొన్నారు. తుది ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితి (టోక్యోలో ఎమర్జెన్సీ)లో అ నుసరిస్తున్న వ్యూహాలపై చర్చించారు. కేసుల హైరానా కోవిడ్ కేసులు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా టోక్యోలో అత్యవసర పరిస్థి తి విధించారు. అయినా సరే టోక్యో నగరంలో కరోనా బాధితులు పెరిగిపోతున్నా రు. బుధవారం 1485 మంది, గురువారం మరో 1308 మందికి వైరస్ సోకింది. ఈ రెండు రోజులు కూడా గడిచిన ఆరు నెలల్లో ఒక రోజు నమోదైన కేసుల సంఖ్యను (జనవరి 21న 1149 కేసులు) అధిగమించాయి. ఏర్పాట్లన్నీ బాగున్నాయి: ఐఓఏ న్యూఢిల్లీ: టోక్యోలో ఆటగాళ్లకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులు, ఇతరత్రా సదుపాయాలన్నీ బాగున్నాయని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా చెప్పారు. భారత చెఫ్ డి మిషన్ బి.పి.బైశ్యా నేతృత్వంలోని బృందం ఈ నెల 14నే టోక్యో చేరుకొని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిందని బాత్రా తెలిపారు. కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరిస్తామని నిర్వాహకులు చెప్పినట్లు ఆయన వివరించారు. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న పలువురు భారత అథ్లెట్లు నేరుగా జపాన్ వెళ్లనుండగా... భారత్ నుంచి మాత్రం 90 మందితో కూడిన తొలి బృందం రేపు అక్కడికి పయనమవుతుంది. -
ప్రతీ మ్యాచ్ కీలకమే
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో ‘డ్రా’ను బట్టి చూస్తే తనకు కొంత సులువుగానే అనిపిస్తున్నా... ప్రతీ దశలో పాయింట్ల కోసం పోరాడక తప్పదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. గత రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు, ఈసారి స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ‘డ్రా’లో గ్రూప్ ‘జె’లో ఉన్న సింధు... చెంగ్ గాన్ యి (హాంకాంగ్), సెనియా పొలికరపోవా (ఇజ్రాయెల్)లతో తలపడాల్సి ఉంది. గ్రూప్ టాపర్‌గా నిలిచి ముందంజ వేస్తే ఆపై నాకౌట్ మ్యాచ్‌లు ఎదురవుతాయి. ‘గ్రూప్ దశలో నాకు మెరుగైన ‘డ్రా’ ఎదురైంది. హాంకాంగ్ అమ్మాయి బాగానే ఆడుతుంది. అయితే ప్రతీ ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. నేనూ బాగా ఆడగలనని నమ్ముతున్నా. ప్రతీ మ్యాచ్ కీలకమే కాబట్టి తర్వాతి దశ ప్రత్యర్థుల గురించి కాకుండా ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడతా. ఒలింపిక్స్ అంటేనే ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించక తప్పదు’ అని సింధు అభిప్రాయపడింది. పురుషుల సింగిల్స్‌లో పోటీ పడుతున్న సాయిప్రణీత్ తన ‘డ్రా’ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. మరీ కఠినంగా గానీ మరీ సులువుగా గానీ ఏమీ లేదని... విజయం కోసం 100 శాతం ప్రయత్నిస్తానని అతను చెప్పాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు కఠిన ‘డ్రా’ ఎదురైనా... గెలవగల సత్తా తమకుందని డబుల్స్ కోచ్ మథియాస్ బో అన్నాడు. ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 24 నుంచి జరుగుతాయి. ఒలింపిక్స్ సన్నాహాలపై ప్రధాని సమీ„ý టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం సన్నాహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టోక్యో విశ్వ క్రీడల్లో పాల్గొనే భారత ఆటగాళ్లకు అందిస్తున్న సౌకర్యాలు, వివిధ క్రీడాంశాలకు ఇస్తున్న సహకారంలతో పాటు ప్రయాణ ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ స్థితి తదితర అంశాలపై మోదీ సుదీర్ఘంగా సమీక్షించారు. టోక్యో వెళ్లే ఆటగాళ్లతో ప్రధాని ‘వర్చువల్’ పద్ధతిలో ఈ నెల 13న భేటీ కూడా కానున్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లతో తాను సంభాషించబోతున్నానని మోదీ వెల్లడించారు. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ జరగనుండగా... భారత తొలి బృందం ఈ నెల 17న ప్రత్యేక విమానంలో టోక్యో వెళుతుంది. -
సింధుకు సులువు
టోక్యో: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తాజా ఒలింపిక్స్‌లో సులువైన ‘డ్రా’ ఎదురైంది. ఆరో సీడ్‌గా ఉన్న సింధు మహిళల సింగిల్స్ గ్రూప్ ‘జె’లో తన పోరును ప్రారంభించనుంది. ఇందులో సింధుతో పాటు హాంకాంగ్‌కు చెందిన చెంగ్ గాన్ యి (ప్రపంచ 34వ ర్యాంకర్), ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పొలికర్పొవా (58) ఉన్నారు. సింధు స్థాయితో పోలిస్తే వీరిద్దరు బలహీన ప్రత్యర్థులే. వీరిద్దరిపై సింధు రికార్డు 5–0, 2–0గా ఉంది. మొత్తం 16 గ్రూప్‌లు ఉండగా ఒక్కో గ్రూప్‌నుంచి ఒక్కో ప్లేయర్ ముందంజ వేస్తారు. ఆపై నాకౌట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. సంచలనాలు లేకపోతే సింధు క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యామగూచితో తలపడే అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ ముందంజ వేయాలంటే తన గ్రూప్‌లో ఉన్న మార్క్ కాల్జో (29; నెదర్లాండ్స్), జిల్బర్మన్ (47; ఇజ్రాయెల్)లను అధిగమించాల్సి ఉంటుంది. ప్రిక్వార్టర్స్‌లో అతను లాంగ్ ఆంజస్ (హాంకాంగ్)ను ఓడించగలిగితే జపాన్ స్టార్, ఫేవరెట్ మొమొటాను క్వార్టర్స్‌లో ఎదుర్కోవాల్సి రావచ్చు. -
సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీవీ సింధు
సాక్షి, అమరావతి: జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరఫున పాల్గొననున్న ఒలింపియన్స్ పీవీ సింధు, ఆర్ సాత్విక్‌సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో పీవీ సింధు తదితరులు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కులను సీఎం అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం కేటాయించిన రెండెకరాల భూమికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం జగన్ పీవీ సింధుకు అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీవీ సింధు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్న సీఎం జగన్‌కు ఇవే నా ధన్యవాదాలు అని పేర్కొంది. ‘మా మూలాలను గుర్తించి, మమ్మల్ని గౌరవిస్తూ.. మీరిచ్చే ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. చదవండి: Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు I am honoured and proud of my roots and I would like to thank Hon’ble CM @ysjagan for constantly supporting and encouraging the growth and development of sports 🙏🏽 https://t.co/CI4haGw7iM — Pvsindhu (@Pvsindhu1) June 30, 2021 -
టోక్యో ఒలింపిక్స్: ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్ సాత్విక్ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్ అందజేశారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను సీఎం జగన్ పీవీ సింధుకి అందించారు. అదే విధంగా రజనీ(ఉమెన్స్ హకీ) బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్ ఉద్యోగులు వెంకట రమణ, జూన్ గ్యాలియో, రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన -
Tokyo Olympics:: పీవీ సింధుకి అరుదైన గౌరవం..
టోక్యో: తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. లింగ భేదం లేకుండా పురుషుల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలిచింది. వాస్తవానికి ముందు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారు భారత పతాకాధారిగా ఉండేవారు. గత రియో ఒలింపిక్ క్రీడల్లో భారత తరుపున బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ పతకాలు సాధించారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కు సాక్షి మాలిక్ ఆర్హత సాధించలేదు. దీంతో పీవీ సింధు అవకాశం దక్కనుంది. పురుషుల్లో ఎవరనేది మాత్రం తేలలేదు. ముఖ్యంగా కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. వీటిలో బాక్సర్ అమిత్ పంఘాల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, టీటీ ప్లేయర్ ఆచంట వరత్ కమల్, అథ్లెట్ నీరజ్ చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, వీరిలో రియోలో ఏ పతకాన్ని సాధించలేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే ఈ నెలాఖరవరకు ఆగాల్సిందే. చదవండి: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్‌కు గాయం -
క్వార్టర్స్‌లో సింధు, సైనా నిష్క్రమణ
బర్మింగ్‌హామ్: 20 ఏళ్లుగా భారత షట్లర్లను అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–8, 21–8తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై సునాయస విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు... ప్రత్యర్థిని ఏ దశలోనూ పుంజుకోనివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్‌ను ముగించేసింది. అయితే మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో సైనా గాయంతో మధ్యలోనే వైదొలిగింది. మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన ఈ పోరులో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న తరుణంలో తప్పుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–18, 21–17తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఇతర భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో... ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–17, 21–10తో గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా (బల్గేరియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరుల్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో (జపాన్) ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–11, 17–21తో కిమ్ అస్త్రుప్–ఆండ్రెస్ స్కరుప్ రస్ముస్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. మరో వైపు టోర్నీ నుంచి ఇండోనేసియా జట్టు తప్పుకుంది. ఆ జట్టు ప్రయాణించిన విమానంలోనే ఉన్న ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... టీమ్‌ను 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు. -
సింధు ముందంజ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–16, 21–19తో నెస్లిహాన్ యిజిట్ (టర్కీ)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–18, 21–11తో సమీర్ వర్మ (భారత్)పై, సౌరభ్ వర్మ 21–19, 21–18తో కిర్చ్మెర్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ 21–12, 21–13తో థమాసిన్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–18, 19–21, 21–16తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్)లపై... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–5, 21–19తో అనాబెల్లా –స్టిన్ కుస్పెర్ట్ (జర్మనీ)లపై గెలిచారు. -
కోచ్ గోపీచంద్‌తో విభేదాల్లేవు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగానే గచ్చిబౌలిలోని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో సాధన చేస్తున్నానని వరల్డ్ చాంపియన్ పీవీ సింధు స్పష్టం చేసింది. గోపీచంద్ కోరిన మీదటే ‘శాట్స్’ తమ శిక్షణకు స్టేడియాన్ని సిద్ధం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఒలింపిక్స్‌లో తాము పోటీ పడే తరహా వాతావరణం గచ్చిబౌలి స్టేడియంలో అందుబాటులో ఉండటమే తాను అక్కడికి వెళ్లేందుకు కారణమని ఆమె వెల్లడించింది. ‘నాకూ, చీఫ్ కోచ్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య అంతా బాగుంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. ఇదే తరహా వేదికపైనే ఒలింపిక్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా ఏసీ బ్లోయర్లు మ్యాచ్‌లో షటిల్ దిశను ప్రభావితం చేస్తాయి. దానికి అలవాటు పడాలంటే అలాంటి సౌకర్యం ఉన్న స్టేడియంలోనే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ సాధన చేసేందుకు నాకు ‘సాయ్’ కూడా అనుమతి ఇచ్చింది’ అని సింధు పేర్కొంది. కొన్నాళ్ల క్రితం తాను లండన్ వెళ్లినప్పుడు తన కుటుంబంతో విభేదాల గురించి వచ్చిన వార్తలపై చాలా బాధపడ్డానని, అయితే అందరికీ తాను వివరణ ఇస్తూ ఉండలేనని సింధు వ్యాఖ్యానించింది. -
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు శ్రీకాంత్, సింధు అర్హత
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. బ్యాంకాక్ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ అర్హత పొందారు. థాయ్‌లాండ్ ఓపెన్ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగారు. దాంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–8లో ముగ్గురు థాయ్‌లాండ్ క్రీడాకారిణులు ఉండటం, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా కూడా గైర్హాజరు కావడం పీవీ సింధుకు కలిసొచ్చింది. దాంతో ఎనిమిదో ర్యాంకర్‌గా సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ‘డ్రా’ వివరాలు వెల్లడిస్తారు. అర్హత పొందిన క్రీడాకారులు... మహిళల సింగిల్స్: కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), రచనోక్, పోర్న్‌పవీ (థాయ్‌లాండ్), యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), మిచెల్లి లీ (కెనడా), ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా), సింధు (భారత్). పురుషుల సింగిల్స్: అక్సెల్సన్, ఆంటోన్సెన్ (డెన్మార్క్), చౌ తియెన్ చెన్, వాంగ్ జు వె (చైనీస్ తైపీ), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్), శ్రీకాంత్ (భారత్), లీ జి జియా (మలేసియా), ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) -
నేటి నుంచి థాయ్‌లాండ్ ఓపెన్
బ్యాంకాక్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తమ రాకెట్ సత్తా చాటేందుకు భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలోకి దిగుతున్నారు. కరోనా వైరస్‌తో దాదాపు 10 నెలల తర్వాత వీళ్లిద్దరు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడనున్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లంతా మంగళవారం నుంచి జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఇందులో జపాన్, చైనా ప్లేయర్లు గైర్హాజరీ కావడంతో భారత స్టార్లు టైటిల్ గెలిచేందుకు ఇది సరైన అవకాశం. లండన్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన 25 ఏళ్ల సింధు ఆరో సీడ్‌గా ఆట మొదలు పెట్టనుంది. తొలిరౌండ్లో ఆమె డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడనుంది. ప్రపంచ 20వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో కిసొనా సెల్వడురే (మలేసియా)తో పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో 14 ర్యాంకర్ శ్రీకాంత్ భారత్‌కే చెందిన సౌరభ్ వర్మతో, వంగ్చరొన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్, లీ జి జియా (మలేసియా)తో ప్రణయ్, జాసన్ అంథోని (కెనడా)తో కశ్యప్ ఆడతారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన పీవీ సింధు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంటక సింధు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించానంటూ వ్యంగ్య పోస్టు చేసి అభిమానులను ఒకింత షాక్‌కు గురి చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా.. ‘నేను రిటైర్ అయ్యాను. డెన్మార్క్ ఓపెన్ నా చివరి ఆట’ అని పేర్కొన్నారు. అనంతరం చేసిన ఓ సుదీర్ఘ ప్రకటనలో ‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను. ( నా తల్లిదండ్రుల అనుమతితోనే: పీవీ సింధు ) కానీ, కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాము. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాను. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్ అవ్వబోతున్నాను. ప్రతీరోజు సోషల్ మీడియాలో చదువుతున్న కథనాలను నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి’.. ‘‘డెన్మార్క్ ఓపెన్ జరగలేదు. కానీ, నేను ప్రాక్టీస్ చేయటం మానలేదు. ఏషియా ఓపెన్‌కు ప్రిపేర్ అవుతున్నాను. దేన్ని కూడా సులభంగా వదిలి పెట్టడం నాకు ఇష్టం లేదు. ప్రపంచం మొత్తం మీద పరిస్థితులు చక్కబడేవరకు పోరాడుతూనే ఉంటాను’’ అంటూ తన వ్యంగ్య ప్రకటనను ముగించింది. అయితే దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. వ్యంగ్యంగా పోస్టు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 🙏 pic.twitter.com/W7uw2IvF4S — Pvsindhu (@Pvsindhu1) November 2, 2020 -
‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే..
సాక్షి, హిమాయత్ నగర్: మన ఒంటి శుభ్రమే కాదు. చేతుల శుభ్రం కూడా చాలా ముఖ్యం. రోజూ మనం ఎంతోమందిని కలుస్తుంటాం, ఎన్నో వస్తువుల్ని తాకుతుంటాం. దీంతో చేతుల్లోకి అనేక క్రిములు చేరుతాయి. శుభ్రం చేసుకోకపోతే అవి శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది. ‘కరోనా’ నేర్పిన పాఠం ఇదే. ఈ క్రమంలో తాము నిత్యం హ్యాండ్‌వాష్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నామంటూ పలువురు సినీ, స్పోర్ట్స్ స్టార్స్ ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రతి గంటకూ శుభ్రంచేసుకుంటా షూటింగ్స్ కారణంగా నా చేతుల్ని ప్రతి గంటకూ శుభ్రం చేసుకుంటుంటా. ఇంట్లో నుంచి షూటింగ్‌కి బయలుదేరే సమయంలో హ్యాండ్ వాష్ స్టార్ట్ చేస్తా. మరలా తిరిగి ఇంటికి వచ్చే వరకూ హ్యాండ్స్‌ని అవకాశాన్ని బట్టి ప్రతి గంటకూ సబ్బు, డెట్టాల్ లాంటి వాటితో శుభ్రం చేసుకుంటుంటా. – రాశీఖన్నా, సినీ నటి. ఇతరుల్ని నష్టపరచొద్దు ఇంటిలో ఉన్నప్పుడు హ్యాండ్‌వాష్, సోప్స్‌ని ఉపయోగిస్తా. లాక్డౌన్ సమయంలో ఎవ్వరినీ పెద్దగా కలిసేది లేదు కాబట్టి శానిటైజర్ రాసుకుంటూ ప్రతి రెండు గంటలకు హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నా. మనవల్ల ఇతరులకు నష్టం కలగరాదు. – సిమ్రన్ చౌదరి, సినీ నటి. పాటతో అవగాహన కల్పించిన చిరు, నాగ్ ‘కరోనా’ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ‘కరోనా’పై పోరాటం చేయాలంటూ సంగీత దర్శకులు కోఠి సారధ్యంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘లెట్స్ ఫైట్ దిస్ వైరస్, లెట్స్ కిల్ దిస్ వైరస్’ అంటూ ఓ పాటను రూపొందించారు. ఆ పాటలో చేతులను శుభ్రం చేసుకోవాలంటూ, ఈ సమయంలో షేక్‌హ్యాండ్స్‌కు దూరంగా ఉండాలంటూ చిరంజీవి, నాగార్జున, వరుణ్‌సందేశ్, సాయిధరమ్ తేజ, సంగీత దర్శకులు కోఠిలు డ్యాన్స్ రూపంలో చేసి చూపించారు. 20 సెకండ్లపాటు శుభ్రం చేసుకుందాం స్పోర్ట్స్ పర్సన్‌గా చేతుల్ని ప్రతి సందర్భంలోనూ శుభ్రం చేసుకుంటుంటా. ఎన్నిసార్లు చేసుకుంటా అనేది లెక్కపెట్టలేదు. ఎంతోమందికి షేక్ హ్యాండ్స్ ఇస్తుంటా, బాల్స్ అండ్ బ్యాట్స్ పట్టుకుంటా కాబట్టి.. చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటా. అందరూ 20 సెకండ్ల పాటు చేతుల్ని శుభ్రం చేసుకుందాం, శానిటైజర్ వాడదాం. – పీవీ సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ ఐదుసార్లు కంటే ఎక్కువనే ఆటకు ముందు ఆట తర్వాత ఇలా ప్రతిరోజూ ఐదుసార్లు కంటే ఎక్కువగానే నా చేతుల్ని శుభ్రం చేసుకుంటాం. హ్యాండ్‌బ్యాగ్‌లో చిన్నసైజ్ శానిటైజర్‌ని కూడా క్యారీ చేస్తా. మన చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటే పరిశుభ్రత మనవద్దనే ఉంటుంది. – సీ.ఏ.భవానిదేవి, ‘సబ్రే’(ఫెన్సర్) క్రీడాకారిణి కుదిరినప్పుడల్లా శుభ్రం చేయాలి చేతుల్లో ఉన్న క్రిములు అంతం అవ్వాలంటే వీలు కుదిరినప్పుడల్లా చేతుల్ని సబ్బు, డెటాల్‌తో శుభ్రం చేసుకోవాలి. నేను ప్రతిరోజూ గంట గంటకూ డెటాల్‌తో నా చేతుల్ని శుభ్రం చేసుకుంటుంటా. మనతో పాటే చిన్నపాటి హ్యాండ్‌వాష్, శానిటైజర్‌ని క్యారీ చేద్దాం. – హాసిని అన్వి, చైల్డ్ ఆర్టిస్ట్. -
విశ్వవిజేతలు కూడా ఆడి అర్హత సాధించాల్సిందే!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది. గతంలో ‘ప్రపంచ చాంపియన్స్’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ప్రకటించింది. ‘కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తాం. వరల్డ్ చాంపియన్లకు ఎలాంటి మినహాయింపు లేదు. వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పాయింట్లనే పరిగణలోకి తీసుకుంటాం’ అని బీడబ్ల్యూఎఫ్ ప్రకటన విడుదల చేసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు. ఇప్పటికే డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు... ‘ఆసియా’ టోర్నీల్లో సత్తా చాటి ‘ఫైనల్స్’కు అర్హత సాధించాల్సి ఉంటుంది. బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు సింధు ఆసియా లెగ్–1, 2 టోర్నీల్లో రాణించి ‘ఫైనల్స్’కు అర్హత సాధిస్తుందని ఆమె తండ్రి పీవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. ‘సింధు ప్రపంచ చాంపియన్, గతంలో ‘ఫైనల్స్’ టైటిల్ కూడా నెగ్గింది. ప్రస్తుతం మా లక్ష్యం ఒలింపిక్స్, ఆల్ ఇంగ్లండ్ టైటిల్’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా సవరించిన∙షెడ్యూల్ ప్రకారం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జనవరి 27–31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. జనవరి 12–17 మధ్య ఆసియా ఓపెన్–1, జనవరి 19–24 మధ్య ఆసియా ఓపెన్–2 ఈవెంట్లు జరుగుతాయి. -
పీవీ సింధూ బయోపిక్‌లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్‌తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
బాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డికి కరోనా పాజిటివ్
-
వైజాగ్ గ్యాస్ లీకేజీ: కోహ్లీ, సానియా సంతాపం
న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్జీ గ్యాస్ లీకేజీ ఘటనపై భారత క్రికెటు జట్టు సారథి విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విరాట్ స్పందిస్తూ.. ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిలు వెంటనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా స్పందిస్తూ.. ‘‘వైజాగ్‌లో గురువారం ఉదయంచోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమైనది. ఈ ఘటన బాధితుల పరిస్థితి ఎలా ఉందో తలచుకుంటే చాలా బాధగా ఉంది. వారు త్వరలోనే కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులలో ఆ దేవుడు ఆత్మస్థైర్యం నింపాలని పార్థిస్తున్నాను.. #prayforvizag’’ అంటూ ట్వీట్ చేశారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) ఇక మహిళ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ హర్మన్ ప్రీత్‌కౌర్ గురువారం ఉదయం వైజాగ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ ఘటనపై పలు భారత క్రికెట్ దిగ్గజాలలు హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఇక భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ‘‘వైజాగ్ గ్యాస్ ఘటన వీడియోలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. వారు త్వరలోనే ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని సంతాపం వ్యక్తం చేశారు. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?) కాగా గురువారం ఉదయం విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్ కర్మాగారం నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 11 మంది మృతి చెందగా... ఈ కర్మాగారం చూట్టుపక్కల సమీపంలో నివస్తిస్తున్న సుమారు 1000 మంది అస్వస్థతకు గురియ్యారు. ఇక 3 కిమీ వ్యాసార్థంలో ఉన్న సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
అబద్ధపు ప్రచారం క్రాస్ చెక్ ఇలా
సాక్షి, అమరావతి: కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని క్రాస్‌చెక్ చేసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ వాట్సాప్ నంబర్‌ను డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తదితరులు బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ వీడియో ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేషు, సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతిలు ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ► సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాట్సాప్ చేస్తే ...ఆయా వర్గాల వివరణ తీసుకొని వాస్తవ సమాచారం అందిస్తాం. ► నిజాలను ప్రచారం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తాం. సమాచారంలో నాణ్యత కావాల్సిన సమయం ఇది. ► చాలా మంది కావాలని తప్పుడు ప్రచారం చేసేవారు తప్పించుకోలేరు. ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుంది. ► లాక్డౌన్ సమయంలో మహిళా బాధితులకు అండగా ఉంటాం. ఎంతో మందికి ఉపయోగం కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేసేందుకు పోలీసు శాఖ వాట్సాప్ నంబర్ తీసుకరావడం ఎంతో మందికి ఉపయోగం. –పీవీ సింధు, బాడ్మింటన్ క్రీడాకారిణి వాస్తవాలు వెలుగులోకి వస్తాయి సెలబ్రిటీలు, మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో కుటుంబ పెద్దలు కూడా చాలా సార్లు తప్పుడు ప్రచారాన్ని నమ్ముతుంటారు. వీటిని అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. – అడవి శేష్, సినీ నటుడు -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్‌ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్‌కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్‌కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్‌కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
సెల్ఫీ దిగండి.. పోస్ట్ చేయండి..
భారతదేశాన్ని కర్మభూమిగా పిలుస్తాం. మాతృగడ్డను తల్లితో పోలుస్తాం.మహిళను ఆదిపరా శక్తిగా ఆరాధిస్తాం. దేవతగా పూజిస్తాం. ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటూ ఆనందిస్తాం. అలాంటి ఆడపిల్లను గౌరవించుకునే అరుదైన అవకాశం వచ్చింది. వివిధ వృత్తుల్లో భాగస్వాములైన అమ్మాయిలు దేశ నిర్మాణంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. మామూలు ఉద్యోగాల నుంచి ‘మంగళ్యాన్’ ప్రయోగాల వరకు వారి పాత్ర అనన్యం. అబల నుంచి సబలగా మారి జాతికి దశ దిశ నిర్దేశించడంలో భాగస్వాములవుతున్న మహిళలను ఈ దీపావళికి భారతలక్ష్మి పేరుతో గౌరవించుకుందామన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశమంతా కదులుతోంది. వివిధ రంగాల్లో అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న మన ఇంటి మహాలక్ష్మినిసత్కరించుకోవాల్ని బాధ్యత ఎంతో ఉంది. ఈ క్రమంలో మన భాగ్యనగరలక్ష్మిలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, క్రికెటర్ మిథాలీరాజ్, టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ సింగిల్స్ ప్లేయర్ సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల, జిమ్నాస్ట్ అరుణాబుద్ధారెడ్డి, టెన్నిస్ ప్లేయర్ ప్రాంజల, త్రోబాల్ క్రీడాకారిణి ఇందూజ గడ్డం... ఇలా పలువురు మహిళా క్రీడాకారులు తమ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ.. ప్రపంచ పటంలో భారత్ కీర్తిని నలు దిశలా చాటుతున్నారు. వీరి రికార్డ్స్, అచీవ్‌మెంట్స్‌ను గురిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో వారిని గౌరవించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. కేవలం క్రీడారంగమే కాదు.. విద్య, వైద్యం వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న వారిని ఈ దీపావళి సందర్భంగా గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనేది ప్రధాని మోదీ ఆలోచన. మిక్స్డ్.. ఉమన్కేటగిరీలో కెరటం గుత్తా జ్వాల. 1990లో బ్యాడ్మింటన్ ఆటలో అరంగ్రేటం చేసింది. మిక్స్డ్, ఉమెన్ కేటగిరీల బ్యాడ్మింటన్‌లో గుత్తా ఓ సరికొత్త కెరటం. 2009, 2011 సంవత్సరాల్లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ని సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒలింపిక్స్‌లో రెండు ఈవెంట్స్‌లో క్వాలిఫై అయిన మొదటి క్రీడాకారిణిగా రికార్డ్ నెలకొల్పింది. బ్యాడ్మింటన్‌లో మేటి.. పీవీ సింధు. బ్యాడ్మింటన్‌పై మక్కువతో అడుగుపెట్టిన ఈమె ఇంటర్నేషనల్ డెబ్యూ గేమ్‌ని 2009లో ఆడింది. నాటి నుంచి ఇప్పటికీ తన ఆటతో క్రీడాభిమానులను మెప్పిస్తోంది. ఇటీవల ప్రపంచ టోర్నమెంట్లో బంగారు పతకం సాధించి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుతం యావత్ప్రపంచమే సింధు జపం చేసేలా, తన ఆటకు ఫిదా అయ్యేలా మలుచుకోవడం ఆమెకు ఆమే సాటి. షీ ఈజ్ ఫస్ట్ వరల్డ్‌నంబర్‌వన్ సానియా మీర్జా.. పరిచయం అక్కర్లేని పేరు. టెన్నిస్ గేమ్‌లో ఈమె రారాణి. బ్యాట్ చేతపట్టి దిగితే యువత నుంచి వృద్ధుల వరకు కేరింతలు కొట్టాల్సిందే. ఎవరెన్ని కామెంట్స్ చేసినా.. తన ఆటతోనే సమాధానం చెప్పి ఫస్ట్ వరల్డ్‌నంబర్ వన్ ర్యాంకును సాధించింది ఈ హైదరాబాదీ. తన ఆటతో ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకొన్న ఘనత సానియా సొంతం. సింధుకు మోదీ పిలుపు ఇటీవల ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ‘భారత్‌కీ లక్ష్మి’ అంశంపై మాట్లాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు, బాలీవుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనేలను గౌరవించుకుందాం.. అంటూ ఆయన చెప్పారు. ఇదే విషయంపై వారిద్దరూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. దీనికి తాము సహకరిస్తున్నామని, మహిళకు గుర్తింపు ఉంటేనే దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మరింత ఎక్కువగా, బాధ్యతగా ఉంటుందనడం విశేషం. త్రోబాల్‌లో టాపర్.. త్రోబాల్ గేమ్ పెద్దగా ఆదరణ లేని గేమ్ ఇది. కానీ..సిటీకి చెందిన గడ్డం ఇందూజ ఇదే గేమ్‌ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపర్చింది. స్కూల్ గేమ్‌తో ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటి వరకు 8 అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆడిన ఇందూజ 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. కొన్నేళ్లుగా భారత్ జట్టు కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తోంది. టెన్నిస్ సింగిల్స్‌లో సూపర్.. ప్రాంజల యడ్లపల్లి. టెన్నిస్ ప్లేయర్. తన కెరీర్లో హైయెస్ట్ సింగిల్స్ ఆడిన సూపర్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్ ర్యాంకింగ్‌లో 280, డబుల్స్‌లో 232 ర్యాంకులను సొంతం చేసుకున్న క్రీడాకారిణిగా సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. మహిళా క్రికెట్లో సంచలనం.. మిథాలీరాజ్ దొరై. క్రికెట్ అనే ఆట కేవలం పురుష క్రికెటర్లకే పరిమితం అనే మాటలకు చెక్ పెట్టింది. తన సారథ్యంలో భారత జట్టును రెండు పర్యాయాలు ఫైనల్స్‌కి తీసికెళ్లిన ఘనత సొంతం చేసుకుంది. ఆమె ద్వారానే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం విశేషం. నేటితరం అమ్మాయిలు క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకోవడానికి ప్రధాన కారణం మిథాలీరాజ్ అంటే అతిశయోక్తి కాదేమో. 24 అంతర్జాతీయ టైటిల్స్ విజేత సైనా నెహ్వాల్. బ్యాండ్మింటన్ సింగిల్స్‌లో ఈమె ఓ ప్రభంజనం. 2006లో అండర్– 19 నేషనల్ చాంపియన్‌షిప్‌లో ఓ చరిత్రను సృష్టించింది. ఆ రంగంలో ఇప్పటి వరకు ఈమె 24 అంతర్జాతీయ టైటిల్స్‌ని సాధించి తిరుగులేని బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించడంవిశేషం. కన్నతండ్రి స్వప్నం సాకారం.. అరుణ బుద్ధారెడ్డి. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్‌లో ఈ హైదరాబాదీ పెను ప్రభంజనం సృష్టించింది. తన తండ్రి చూపిన బాటలో నడుస్తూ.. ఆయన ఇచ్చిన భరోసాతో ముందుకెళుతూ.. 2018 వరల్డ్‌కప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. అందరి మనసులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. సెల్ఫీ దిగండి.. పోస్ట్ చేయండి మీ ఇంట్లో కూడా ప్రతిభావంతమైన కూతురు, కోడలు ఉన్నారా? వారు ఏం రంగంలో రాణిస్తున్నారు, వారు సాధించిన ఘనతలు ఏంటి? వారికి తల్లిదండ్రులుగా మీరు ఇస్తున్న గౌరవం ఏంటి అనే విషయాలను పొందుపరుస్తూ.. సెల్ఫీ దిగండి. దాన్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుకు హ్యాష్‌ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఈ దీపావళి సందర్భంగా ఇటు నేరుగా.. అటు సోషల్ మీడియా ద్వారా మన ఇంటి లక్ష్మిలను మనం సత్కరించుకుందాం.. గౌరవించుకుందామంటున్నారు ప్రధాని మోదీ. -
సింధు జోరుకు బ్రేక్
చాంగ్జౌ (చైనా): ప్రపంచ చాంపియన్ హోదాలో... మరో ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టైటిల్ లక్ష్యంగా చైనా ఓపెన్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ర్యాంకింగ్స్‌లో తన కంటే కింది స్థానంలో ఉన్న పొర్న్‌పవీ చొచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడి నిరాశ పరిచింది. గురువారం జరిగిన వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–12, 13–21, 19–21తో ప్రపంచ 15వ ర్యాంక్ షట్లర్ చొచువోంగ్ చేతిలో కంగుతింది. ఆధిక్యం ప్రదర్శించినా... ప్రస్తుత ఫామ్ దృష్ట్యా చొచువోంగ్పై సింధు విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్లే చక్కటి స్మాష్‌లతో విరుచుకుపడ్డ సింధు... వరుసగా పాయింట్లు సాధించి 21–12తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్ నుంచి మాత్రం సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా గాడి తప్పిన సింధు ఆట ప్రత్యర్థికి వరంలా మారింది. వరుసగా 5 పాయింట్లు సాధించిన చొచువోంగ్ 5–1తో, ఆ తర్వాత మరోసారి వరుసగా ఆరు పాయింట్లు కొల్లగొట్టి 15–7తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ పట్టును నిలుపుకున్న థాయ్‌లాండ్ షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇది ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో తొలి 12 పాయింట్ల తర్వాత ఇద్దరూ సమంగా నిలిచారు. ఈ దశలో సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–15తో ఆధిక్యంలో నిలిచింది. విజయానికి కేవలం రెండు పాయింట్ల దూరంలో ఉన్న సమయంలో థాయ్ అమ్మాయి అనూహ్యంగా పుంజుకుంది. చొచువోంగ్ వరుసగా 6 పాయింట్లు సాధించి సింధు కళ్ల ముందే మ్యాచ్‌ను లాగేసుకుంది. క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్ 21–19, 21–19తో లూ గాంగ్ జూ (చైనా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. మరో భారత అటగాడు పారుపల్లి కశ్యప్ 21–23, 21–15, 12–21తో ఆంథోని సింసుక గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. డబుల్స్‌లోనూ నిరాశే.. డబుల్స్ విభాగాల్లో పోటీ పడుతున్న భారత జోడీలు రెండో రౌండ్లో ఓడి నిరాశ పరిచాయి. పరుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి (భారత్) 19–21, 8–21తో తకెషి కముర– కిగో సొనొడ (జపాన్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యారు. అనంతరం జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప ద్వయం 11–21, 21–16, 12–21తో ప్రపంచ నాలుగో ర్యాంక్ యూకి కనెకొ– మిసాకి మట్సుటొమొ (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి 12–21, 17–21తో మిసాకి మట్సుటొ మొ– అయక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. -
సింధును సత్కరించిన ఏపీ గవర్నర్
-
సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు
సాక్షి, అమరావతి: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌లో తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎం జగన్‌కు ఆమె చూపించింది. ఈ సందర్భంగా పీవీ సింధును గౌరవ ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సింధు వెంట ఆమె తల్లిదండ్రులతో పాటు మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐదు ఎకరాలు ఇస్తామన్నారు: సింధు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచినందుకు తనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారని పీవీ సింధు విలేకరులతో చెప్పింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడమికి ఐదు ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీయిచ్చినట్టు వెల్లడించింది. పద్మభూషణ్ అవార్డుకు తన పేరు సిపార్సు చేయడం సంతోషం వ్యక్తం చేసింది. కాగా, రాష్ట్ర ప్రాధికార క్రీడా సంస్థ ఆధ్వరంలో విజయవాడలోని తుమ్మల కళాక్షేత్రంలో ఈ రోజు మధ్యాహ్నం పీవీ సింధు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. (చదవండి: ఓ ఖాళీ ఉంచా అంటున్న సింధు) -
వరల్డ్ ఛాంపియన్
-
సింధు... ఈసారి వదలొద్దు
ఇంకొక్క విజయమే... నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తోన్న పసిడి కల నెరవేరడానికి... భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకోవడానికి! ఇంకొక్క విజయమే... ముచ్చటగా మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం రంగు మార్చడానికి... విశ్వవేదికపై మువ్వన్నెలు రెపరెపలాడటానికి! ఇంకొక్కవిజయమే... సింధు పేరు భారత క్రీడాచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు... గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం సింధు పసిడి కాంతులు మాత్రం విరజిమ్మలేకపోయింది. రెండుసార్లు కాంస్యాలతో సరిపెట్టుకోగా... మరో రెండుసార్లు ‘రజత’ హారం మెడలో వేసుకుంది. రెండు ఫైనల్స్‌లో ఓడిన అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకొని... మూడోసారి పతక వర్ణాన్ని పసిడిగా మార్చాలని ఆశిస్తూ... విజయీభవ సింధు...! బాసెల్ (స్విట్జర్లాండ్): జగజ్జేతగా అవతరించడానికి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గత ప్రదర్శన ఆధారంగా... ఈసారీ భారీ అంచనాలతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ వరుసగా మూడోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆఖరి సమరానికి అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 40 నిమిషాల్లో 21–7, 21–14తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ చెన్ యుఫె (చైనా)పై అద్వితీయ విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. ఒకుహారాతో ముఖాముఖి రికార్డులో సింధు 8–7తో ఆధిక్యంలో ఉంది. ఈ ఏడాది వీరిద్దరు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌లో గెలిచారు. 2017 ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఒకుహారా చేతిలో ఎదురైన పరాజయానికి సింధు ఈసారి ప్రతీకారం తీర్చుకొని పసిడి పతకం మెడలో వేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆరంభం నుంచే... రెండో ర్యాంకర్ తై జు యింగ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గొప్ప పోరాటపటిమ కనబరిచి అద్భుత విజయాన్ని అందుకున్న సింధు సెమీఫైనల్లో మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన చెన్ యుఫెను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో ఆడింది. క్లిష్టమైన కోణాల్లో షటిల్స్‌ను పంపిస్తూ చెన్ యుఫె సత్తాకు పరీక్ష పెట్టింది. అవకాశం వచ్చినపుడల్లా చెన్ యుఫె బలహీన రిటర్న్ షాట్లను అంతేవేగంగా రిటర్న్ చేస్తూ పాయింట్లు గెల్చుకుంది. చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో తొలి గేమ్‌లో విరామానికి 11–3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో చైనా ప్లేయర్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ సింధు ఆరంభంలోనే 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. సుదీర్ఘంగా సాగిన పలు ర్యాలీల్లో సింధు పైచేయి సాధిస్తూ తన ఆధిక్యాన్ని 17–9కి పెంచుకుంది. క్రాస్‌కోర్ట్ స్మాష్‌తో 20–12తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచిన సింధు ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పోయింది. అయితే చెన్ యుఫె కొట్టిన షాట్ బయటకు వెళ్లిపోవడంతో ఈసారి సింధు ఖాతాలో పాయింట్‌తోపాటు గేమ్, విజయం చేరాయి. ఫైనల్ చేరారిలా...సింధు తొలి రౌండ్: బై రెండో రౌండ్: పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై 42 నిమిషాల్లో 21–14, 21–15తో గెలుపు మూడో రౌండ్: బీవెన్ జాంగ్ (అమెరికా)పై 34 నిమిషాల్లో 21–14, 21–6తో గెలుపు క్వార్టర్ ఫైనల్: తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో గెలుపు సెమీఫైనల్: చెన్ యుఫె (చైనా)పై 40 నిమిషాల్లో 21–7, 21–14తో గెలుపు ఒకుహారా తొలి రౌండ్: బై రెండో రౌండ్: ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా)పై 34 నిమిషాల్లో 21–12, 21–14తో విజయం మూడో రౌండ్: సుంగ్ జీ హున్ (కొరియా)పై 47 నిమిషాల్లో 21–18, 21–13తో విజయం క్వార్టర్ ఫైనల్: హి బింగ్ జియావో (చైనా)పై 43 నిమిషాల్లో 21–7, 21–18తో విజయం సెమీఫైనల్: రచనోక్ (థాయ్‌లాండ్)పై 83 నిమిషాల్లో 21–17, 18–21, 21–15తో విజయం చెన్ యుఫెతో మ్యాచ్‌కు పక్కాగా సిద్ధమై వచ్చాను. తొలి క్షణం నుంచే అనుకున్న వ్యూహాలను ఆచరణలో పెట్టాను. ఆరంభం నుంచే ఆధిక్యంలోకి వెళ్లి అంతే వేగంతో తొలి గేమ్‌ను ముగించాను. రెండో గేమ్‌లో అనవసర తప్పిదాలు చేశాను. వరుస పాయింట్లు కోల్పోయాక మళ్లీ పుంజుకొని ఆధిక్యంలోకి వచ్చాను. దాంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను ముగించాను. నేడు జరిగే ఫైనల్లోనూ బాగా ఆడతానని ఆశిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో నా లక్ష్యం ఇంకా నెరవేరలేదు. సంతోషంగా ఉన్నా పూర్తి సంతృప్తిగా లేను. ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి స్వర్ణం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకుహారాతో తుది పోరు తేలికేం కాదు. ఒకరి ఆటతీరుపై ఒకరికి పూర్తి అవగాహన ఉంది. కీలకదశల్లో ఏకాగ్రతతో, నిగ్రహం కోల్పోకుండా సంయమనంతో ఆడాలి. నేనైతే నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. – పీవీ సింధు -
36 ఏళ్ల తర్వాత....ఇప్పుడు మళ్లీ
బ్యాడ్మింటన్ చరిత్రలో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. 36 ఏళ్ల తర్వాత ఆ కల నెరవేరింది. ఏంటా కల? కొత్త చరిత్ర లిఖించిన ఆ క్రీడాకారులు ఎవరు? వివరాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
క్వార్టర్స్‌లో ప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సాయి ప్రణీత్ (భారత్) నిలకడగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో 16వ సీడ్ సాయి ప్రణీత్ 21–19, 21–13తో ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణీత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలతో, స్మాష్ షాట్లతో హోరెత్తించాడు. ఆరంభంలో తడబడినా... జిన్‌టింగ్ మ్యాచ్‌ను ధాటిగా ఆరంభిం చాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న అతను 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వెంటనే తేరుకున్న ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 4–3తో ఆధిక్యంలోకొచ్చాడు. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15–15తో సమానంగా నిలి చారు. కీలక సమయం లో ఒత్తిడిని జయించిన ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 21–17తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్ చేరడం ప్రణీత్‌కిది రెండోసారి. 2018లో కూడా అతను క్వార్టర్స్ చేరాడు. నేడు జరిగే క్వార్టర్స్‌లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్ తలపడతాడు. సింధు అలవోకగా... మహిళల విభాగంలో ఐదో సీడ్ పీవీ సింధు పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన సింధు ప్రత్యర్థికి తన స్మాష్ షాట్లతో ముచ్చెమటలు పట్టించింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో జరిగిన మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21–15, 25–27, 12–21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీకాంత్, ప్రణయ్ ఔట్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం ముగిసింది. గురువారం 46 నిమిషాల పాటు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రణయ్ 19–21, 12–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్‌లో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రణయ్ మ్యాచ్ ఓడినా ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్‌లో ఇరువురు 18–18తో సమంగా ఉన్న సమయంలో... ఆ తర్వాతి పాయింట్ కోసం ఆటగాళ్ల మధ్య ఏకంగా 57 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోయిన ప్రణయ్ తర్వాత గేమ్నూ సమర్పించుకున్నాడు. రెండో గేమ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొమోటా సునాయాసంగా గెలిచేశాడు. మరో ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్ (థాయ్‌లాండ్) చేతిలో చిత్తయ్యాడు. -
'ఈ సారి ఎలాగైనా సాధిస్తా'
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చాంపియన్‌షిప్ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెట్టినట్లు చెప్పింది. ఈ మెగా ఈవెంట్లో గతంలో సింధు నాలుగు పతకాలు సాధించింది. రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు నెగ్గింది. కానీ స్వర్ణం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఫైనల్ చేరిన రెండుసార్లు పరాజయమే చవిచూసింది. అయితే ఈ సారి మాత్రం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని 24 ఏళ్ల సింధు చెప్పు కొచ్చింది. ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ జరుగనుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించా. ఈ సారి తప్పకుండా స్వర్ణం సాధిస్తానన్న నమ్మకముంది. అలాగని నాపై ఒత్తిడేమీ లేదు. మంచి ప్రదర్శన కనబరుస్తాను. డిఫెన్స్, ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. అలాగే ఆటతీరు కూడా మెరుగయ్యేందుకు కష్టపడ్డాను’ అని తెలిపింది. తెలుగుతేజంకు జపాన్ ప్రత్యర్థి యామగుచి కొరకరాని కొయ్య గా మారింది. ఇండోనేసియా, జపాన్ టోర్నీల్లో సింధుకు చుక్కలు చూపించింది. ఆమెను ఎదుర్కోవడంపై ఎలాంటి కసరత్తు చేశారని ప్రశ్నిం చగా.... ‘యామగుచితో పోరు కష్టమేమీ కాదు. ఇండోనేసియా టోర్నీలో ఆమెను దీటుగా నే ఎదుర్కొన్నా. కానీ ఆమె అటాకింగ్ బాగా చేసింది. ర్యాలీల్లోనూ దిట్టే! కాబట్టి ఆమె దూకుడు నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఆమెతో నేను తలపడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సింధు వివరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమెకు బై లభించింది. రెండో రౌండ్లో చైనీస్‌తైపీకి చెందిన పాయ్ యు పొ లేదంటే లిండా (బల్గేరియా)తో తలపడే అవకాశముంది. ఇందులో గెలిస్తే... తదుపరి రౌండ్లో బీవెన్ జంగ్ (అమెరికా)ను ఎదుర్కొంటుంది. ఈ అడ్డంకులన్నీ దాటితే క్వార్టర్స్‌లో తైపీ స్టార్ తై జు యింగ్ ఎదురయ్యే అవకాశాలున్నాయి. -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో హరియాణా స్టీలర్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఇలాంటి మరిన్ని క్రీడా విశేషాలు మీ కోసం.. -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్ అని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొట్టిపారేశాడు.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ యువరాజ్ సింగ్.. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో దూకుడు కొనసాగిస్తున్నాడు.ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల మీ కోసం -
ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు
-
వైదొలిగిన సింధు
బ్యాంకాక్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత నంబర్‌వన్ మహిళా షట్లర్ పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. రెండు వారాల క్రితం ఇండోనేసియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి... గతవారం జపాన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ఈ రెండు టోర్నీల్లోనూ జపాన్ క్రీడాకారిణి అకానె యామగుచి చేతిలో సింధు ఓడిపోయింది. సింధు గైర్హాజరీలో... మంగళవారం మొదలయ్యే థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత ఆశలన్నీ ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్‌పై ఆధారపడ్డాయి. ఈ ఏడాది ఆరంభంంలో ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో ఇండోనేసియా ఓపెన్, జపాన్ ఓపెన్లకు ఎంట్రీలు పంపించి... ఆ తర్వాత వైదొలిగింది. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ సాధించడంతో ఈ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో సైనా ఆడుతుంది. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు కెనడా ప్లేయర్ బ్రిట్నీ టామ్‌తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, శుభాంకర్ డే బరిలో ఉన్నారు. -
క్వార్టర్స్‌లో సింధు, సాయిప్రణీత్
టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)ను ఓడించాడు. హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్ కాయ్ జాంగ్– లియు చెంగ్ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్–సప్సిరి (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; తకెషి–కీగో సొనోడా (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు. -
సింధు ముందుకు... శ్రీకాంత్ ఇంటికి
టోక్యో: ఈ సీజన్లో తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ పదో ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 11–21, 20–22తో భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీకాంత్ చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ప్రణయ్ ఈసారి మాత్రం సంచలన ప్రదర్శన చేసి తన సహచరుడికి షాక్ ఇచ్చాడు. 2011లో ఏకైకసారి శ్రీకాంత్‌ను ఓడించిన ప్రణయ్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ అతడిపై గెలుపొందడం విశేషం. మరో సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ (భారత్) 17–21, 12–21తో ఆంటోన్సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 21–9, 21–17తో హాన్ యుయె (చైనా)పై గెలిచింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు రెండో గేమ్‌లో కాస్త పోటీ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 11–21, 14–21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడీ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 14–21తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–16, 21–17తో మార్కస్ ఇలిస్–క్రిస్ లాంగ్రిడ్జ్ (ఇంగ్లండ్) జంటపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అయా ఒహోరి (జపాన్)తో సింధు; కాంటా సునెయామ (జపాన్)తో సాయిప్రణీత్; రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. -
ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు
తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి. పీవీ సింధుకు నిరాశ. ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడును ఎంపిక చేయలేదని అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని తెలిపారు. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ మీ కోసం. మరిన్ని క్రీడా వార్తల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
రన్నరప్‌తో సరి
ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు నిరాశ ఎదురైంది. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ ఆడిన ఆమె ఇండోనేసియా ఓపెన్‌లో తుది మెట్టుపై బోల్తా పడింది. తన ఫైనల్ ప్రత్యర్థిపై పదిసార్లు నెగ్గిన రికార్డు ఉన్నప్పటికీ కీలక తరుణంలో తప్పిదాలతో సింధు మూల్యం చెల్లించుకొని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గతంలో సింధుపై పద్నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగుసార్లే నెగ్గిన అకానె యామగుచి ఈ సీజన్లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మూడో టైటిల్‌ను సాధించింది. జకార్తా: క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులపై అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైనల్లో మాత్రం తడబడింది. ఈ సీజన్లో తొలి టైటిల్‌ను గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 15–21, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత అకానె యామగుచికి 87,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 60 లక్షల 28 వేలు)తోపాటు 12,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 42,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 29 లక్షల 28 వేలు)తోపాటు 10,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత డిసెంబర్లో సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో చాంపియన్‌గా నిలిచిన అనంతరం సింధుకు ఇండోనేసియా ఓపెన్ రూపంలో ఈ ఏడాది తొలి టైటిల్ సాధించే అవకాశం వచ్చింది. కానీ 51 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సింధు కీలకదశలో తప్పిదాలు చేసి విజయానికి దూరమైంది. వివిధ టోర్నీల్లో యామగుచితో ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన సింధు ఈసారి మాత్రం అదే ఫలితం రాబట్టలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)పై, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)పై అలవోకగా నెగ్గిన సింధు తుది సమరంలో మాత్రం వరుస గేముల్లో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది జర్మన్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో విజేతగా నిలిచిన యామగుచి ఫైనల్లో ప్రణాళిక ప్రకారం ఆడింది. పలుమార్లు వెనుకపడ్డా ఒత్తిడికి లోనుకాకుండా ఆడి సింధు ఆట కట్టించింది. తొలి గేమ్‌లో సింధు 14–12తో రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో... యామగుచి అద్భుత ఆటతీరుతో వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 20–14తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత సింధు ఒక పాయింట్ సాధించగా... వెంటనే యామగుచి మరో పాయింట్ నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు యామగుచి రెండు పాయింట్లు గెలిచి 6–4తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ యామగుచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘అకానె యామగుచి అద్భుతంగా ఆడింది. సుదీర్ఘంగా సాగిన ర్యాలీల్లో ఆమెనే పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో నేను రెండు, మూడు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నదశలో తప్పిదాలు చేశాను. ఈ అవకాశాలను ఆమె అనుకూలంగా మల్చుకుంది. నేను తొలి గేమ్‌లో గెలిచిఉంటే తుది ఫలితం మరోలా ఉండేది. రెండో గేమ్‌లో యామగుచికి నేను ఆరేడు పాయింట్ల ఆధిక్యం ఇచ్చాను. దాంతో నేను కోలుకునే అవకాశం లేకుండా పోయింది. తుది ఫలితం నిరాశపరిచినా ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ఆటపట్ల సంతృప్తిగా ఉన్నాను. తదుపరి జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడనున్నాను. అక్కడ మరింత మెరుగైన ఫలితం సాధిస్తానన్న నమ్మకం ఉంది.’ –పీవీ సింధు -
క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం 62 నిమిషాల పాటు సాగిన మహిళల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచింది. మ్యాచ్‌ను డెన్మార్క్ షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధుపై మొదటి గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన సింధు సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించి మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌ను మియా గెలవడంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21–11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గతంలో ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో సింధు ఆమెను మట్టికరిపించింది. పురుషుల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి 15–21, 14–21తో టోర్నీ టాప్ సీడ్ మార్కస్ గిడియోన్ – కెవిన్ సంజయ(ఇండోనేషియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 11–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైయ్యారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు పోటీ పడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచి సమంగా ఉన్నారు. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: అంచనాలకు తగ్గ ప్రదర్శన చేస్తూ భారత అగ్రశ్రేణి సింగిల్స్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–13తో కెంటా నిషిమోటో (జపాన్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయా ఒహోరిపై సింధుకిది వరుసగా ఏడో విజయం కాగా... నిషిమోటోపై శ్రీకాంత్‌కిది ఐదో గెలుపు. మరోవైపు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌ల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 13–21, 11–21తో తొంతోవి అహ్మద్–విన్నీ కండౌ (ఇండోనేసియా) జంట చేతిలో... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) జోడీ 11–21, 17–21తో లియావో మిన్ చున్–సు చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో పరాజయం పాలయ్యాయి. గురువారం జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో సింధు; ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) శ్రీకాంత్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మార్కస్ గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జోడీతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట తలపడతాయి. ప్రతీసారి ఆటగాళ్లతో వెళ్లడం కుదరదు! అలా చేస్తే కొత్తవాళ్లను తయారు చేయలేం భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మేజర్ టోర్నీ బరిలోకి దిగినా దాదాపు ప్రతీసారి వారి వెంట చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కనిపించేవారు. కోర్టు పక్కన కోచ్ స్థానం లో కూర్చొని ఆయన ఇచ్చే అమూల్య సలహాలతో షట్లర్లు అద్భుత ఫలితాలు సాధించారు. అయితే ఇటీవల గోపీచంద్ వారితో తరచుగా ప్రయాణించడం లేదు. ఈ ఏడాది అయితే గోపీ ఎక్కువగా అకాడమీలో శిక్షణకే పరిమితమయ్యారు. దీనిపై స్పందిస్తూ ఆయన... ఆటగాళ్లతో ప్రతీ టోర్నీకి వెళ్లడం సాధ్యం కాదని, ప్రణాళిక ప్రకారమే తన ప్రయాణాలు తగ్గించానని స్పష్టం చేశారు. ‘నేను టాప్ క్రీడాకారులతో టోర్నీలకు వెళుతుంటే వారి తర్వాతి స్థాయిలో ఉన్న ఇతర షట్లర్ల పరిస్థితి ఏమవుతుంది? టోర్నీల కోసం ప్రయాణించడమే పనిగా పెట్టుకుంటే ఒక సింధు వెలుగులోకి వచ్చేదా? వాస్తవానికి మనకు ఎక్కువ కోచ్‌ల అవసరం ఉంది. నేను ఒక్కడినే అన్నీ చేయలేను. నాకు ఇతరత్రా సహాయం, మద్దతు అవసరం’ అని గోపీచంద్ స్పష్టం చేశారు. గత పదేళ్లుగా కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఉన్న ఏడాదిలోనే తాను ఆటగాళ్లతో కలిసి టోర్నీలకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు. ‘ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా సూచనలు తీసుకోవాలని, నేను వారికి ఎక్కువ సేపు కోచింగ్ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ అది ప్రతీసారి సాధ్యం కాదు. నేను అక్కడ లేను కాబట్టి తాము ఓడామని, ఉంటే గెలిచేవాళ్లమని కొందరు షట్లర్లు చెబుతూనే ఉంటారు’ అని గోపీచంద్ వివరించారు. 2019 చివరి వరకు ఆటగాళ్లతో ప్రయాణించే ఆలోచన లేదని... వచ్చే ఏడాది మాత్రం ఒలింపిక్స్ ఉండటంతో కొన్ని టోర్నీలకు వెళ్లి తన ప్రణాళికను రూపొందించుకుంటానని గోపీ వెల్లడించారు. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తూ భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారుడి చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏడు టోర్నీల్లో ఆడిన శ్రీకాంత్ ఇండియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, మిగతా ఆరు టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని కూడా దాటలేకపోయాడు. వుహాన్ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో రెండో రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఐదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే చేతులెత్తేయగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మహిళల సింగిల్స్ విభాగంలో బరిలోకి దిగిన భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ప్రపంచ 51వ ర్యాంకర్ షెసర్ హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 20–22తో ఓడిపోయాడు. 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వెనుకబడి కోలుకోలేకపోయాడు. రుస్తావిటో చేతిలో శ్రీకాంత్‌కిది రెండో పరాజయం కావడం విశేషం. వీరిద్దరూ ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో తలపడగా అప్పుడు కూడా రుస్తావిటో పైచేయి సాధించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–13, 17–21, 21–18తో కజుమసా సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సింధు 21–14, 21–7తో సయాక తకహాషి (జపాన్)పై కేవలం 28 నిమిషాల్లో నెగ్గగా... ఏడో సీడ్ సైనా 12–21, 21–11, 21–17తో హాన్ యువె (చైనా)పై శ్రమించి విజయం సాధించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్ (భారత్) 13–21, 16–21తో జాంగ్ కొల్ఫాన్–రవింద (థాయ్‌లాండ్) చేతిలో; దండు పూజ–సంజన సంతోష్ (భారత్) 13–21, 21–12, 12–21తో ప్రమోదిక–కవిది (శ్రీలంక) చేతిలో; అపర్ణ బాలన్–శ్రుతి (భారత్) 12–21, 10–21తో యుజియా జిన్–మింగ్ హుయ్ లిమ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ (భారత్) 18–21, 15–21తో హి జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
తేజన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పీవీ సింధు చక్కర్లు
-
తేజస్‌లో విహరించిన పీవీ సింధు
సాక్షి, బెంగళూరు: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమె తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. ఏరో ఇండియా షోలో వుమెన్స్ డే సందర్భంగా ఏవియేషన్ అధికారులు సింధుకు ఈ అవకాశం కల్పించారు. ఏవియేషన్ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు. Badminton player PV Sindhu waves as she is about to take off for a sortie in the indigenous Light Combat Aircraft - Tejas in Bengaluru. #AeroIndia2019 pic.twitter.com/KvYkPLiGT5 — ANI (@ANI) 23 February 2019 -
హంటర్స్‌కు తొలి ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం అవధ్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ 1–4తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 13–15, 8–15తో బీవెన్ జాంగ్ చేతిలో ఓడిపోవడం గమనార్హం. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–క్రిస్టియాన్సన్ (అవధ్) జోడీ 15–12, 9–15, 15–11తో కిమ్ సా రంగ్–ఎమ్ హై వన్ (హైదరాబాద్) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో మార్క్ కాల్జూ (హైదరాబాద్) 15–10, 7–15, 15–7తో లీ డాంగ్ కెయున్‌పై; సన్ వాన్ హో (అవధ్) 15–10, 15–11తో లీ హున్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో ఇసారా–కిమ్ సా రంగ్ (హైదరాబాద్) 15–9, 15–13తో యాంగ్ లీ–క్రిస్టియాన్సన్ జంటపై గెలిచింది. మరో మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3తో బెంగళూరు రాప్టర్స్పై నెగ్గింది. అహ్మదాబాద్ తరఫున మిక్స్డ్ డబుల్స్లోనేలకుర్తి సిక్కి రెడ్డి–సాత్విక్ సాయిరాజ్ ద్వయం... పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, మహిళల సింగిల్స్‌లో క్రిస్టీ గిల్మోర్ గెలుపొందారు. శనివారం పుణే వేదికగా జరిగే మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో పుణే సెవెన్ ఏసెస్; ఢిల్లీ డాషర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడతాయి. -
చరిత్రకు చేరువలో...
ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత పొందింది. తద్వారా ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (2017లో), సైనా నెహ్వాల్ (2011లో), మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు (2009లో) జంట ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో నేడు జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే సీజన్ ముగింపు టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. గ్వాంగ్జూ (చైనా): తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది ఆరో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆమె వరుసగా రెండో ఏడాది అంతిమ సమరానికి అర్హత సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–16, 25–23తో గెలుపొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 6–6తో సమంగా ఉన్నారు. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 21–17, 21–14తో జపాన్‌కే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గింది. రచనోక్‌తో జరిగిన సెమీఫైనల్లో సింధు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి సర్వీస్‌లకు పదునైన రిటర్న్ షాట్లతో జవాబు ఇచ్చింది. ఆరంభంలోనే 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. సింధు కొట్టిన షాట్ల గతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రచనోక్ పలుమార్లు షటిల్స్‌ను వదిలేసింది. రెండో గేమ్‌లో మాత్రం ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 27 షాట్లపాటు సాగిన ర్యాలీలో పైచేయి సాధించిన రచనోక్ స్కోరును 10–10తో సమం చేసింది. అనంతరం పలుమార్లు స్కోరు సమమయ్యాక 24–23 వద్ద సింధు కళ్లు చెదిరే స్మాష్ షాట్‌తో పాయింట్ గెల్చుకోవడంతోపాటు గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ‘గతంలో పాయింట్లు కోల్పోయాక వాటి గురించే ఆలోచించి మరిన్ని తప్పిదాలు చేసేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. మానసికంగా చాలా దృఢంగా తయారయ్యాను. ఆధిక్యం పోయినా, పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే తేరుకొని తర్వాతి పాయింట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకుహారాతో జరిగే ఫైనల్లో మానసిక స్థయిర్యం, సహనం, ఏకాగ్రత కీలకం కానున్నాయి. మేమిద్దరం ఆడే మ్యాచ్‌ల్లో సుదీర్ఘ ర్యాలీలు ఉంటాయి. ఈసారీ మ్యాచ్ సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నాను. ఆమెను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది. మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువతార సమీర్ వర్మ 21–12, 20–22, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి, రెండో గేమ్‌లో సమీర్ వర్మ 20–19తో విజయం అంచున నిలిచాడు. ఈ దశలో షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి పైచేయి సాధించి సమీర్ వర్మ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) 21–14, 21–12తో సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో షి యుకితో మొమోటా ఆడతాడు. -
తై జుకు సింధు చెక్
రియో ఒలింపిక్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తై జు యింగ్‌పై సింధు విజయం సాధించింది... అంతే ఆ తర్వాత ఆమెను ఈ చైనీస్ తైపీ ప్రత్యర్థి వెంటాడింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు సార్లు తై జు ముందు సింధు తలవంచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు మార్చినా తెలుగమ్మాయికి విజయం మాత్రం దక్కలేదు. ఎట్టకేలకు ఆమె ప్రత్యర్థి అడ్డుగోడను ఛేదించింది. అద్భుత ప్రదర్శనతో తై జును ఓడించి పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. తొలి గేమ్‌ను కోల్పోయినా ఆ తర్వాత సింధు కోలుకున్నతీరు అసమానం. గ్వాంగ్జౌ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్ సవాల్‌ను ఛేదించింది. తనకు పదేపదే పరాజయాన్ని చవిచూపిస్తున్న చైనీస్ తైపీ ప్రత్యర్థిని కసిదీరా ఓడించింది. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ ఈవెంటైన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఎ’ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో తెలుగుతేజం, ఒలింపిక్ రన్నరప్ సింధు 14–21, 21–16, 21–18తో తై జును కంగుతినిపించింది. తొలి గేమ్‌లో ప్రతికూల ఫలితం వచ్చినా... తర్వాత గేముల్లో పట్టుదలతో ఆడింది. చివరి దాకా పట్టుసడలించకుండా ఆడిన సింధు 2–1 గేమ్‌లతో ప్రత్యర్థిని ఓడించింది. మొదటి 16 నిమిషాల పాటు జరిగిన తొలి గేమ్‌లో తై జు జోరే కనబడింది. అనవసర తప్పిదాలతో పాటు విన్నర్స్ కొట్టడంలో విఫలమైన సింధు 2–6తో వెనుకబడింది. స్మాష్‌లు, రిటర్న్ షాట్లతో తై జు తన ఆధిక్యాన్ని 17–12కు పెంచుకుంది. కాసేపటికే మరో నాలుగు పాయింట్లు సాధించిన తైపీ నంబర్‌వన్ తొలి గేమ్‌ను 21–14తో ముగించింది. ఇక రెండో గేమ్‌లో మాత్రం సింధు జాగ్రత్తగా ఆడింది. గేమ్ మొదలైన కాసేపటికే 6–3తో తన ఆధిపత్యాన్ని చాటింది. సుదీర్ఘ ర్యాలిలో మరింత దూకుడు కనబర్చిన సింధు మెరుపు షాట్లతో విరుచుకుపడింది. చూస్తుండగానే 11–6కు చేరిన ఆమె... ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి గేమ్ ను చేజిక్కించుకునేదాకా చెమటోడ్చింది. 19–13 స్కోరుకు చేరాక సింధు ఈ గేమ్‌ను క్షణాల వ్యవధిలోనే తన వశం చేసు కుంది. చివరి గేమ్‌లో మొదట 0–3తో వెనుకబడిన భారత స్టార్ మ్యాచ్ సాగుతున్న కొద్ది టచ్‌లోకి వచ్చింది. 11–12 స్కోరుతో ప్రత్యర్థిని నిలువరించిన ఆమె క్రాస్ కోర్టు రిటర్న్ షాట్లతో తై జు యింగ్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరికి గేమ్ తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ పోరులో సమీర్ వర్మ 21–16, 21–7తో వరుస గేముల్లో టామి సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచాడు. -
స్త్రీలోక సంచారం
చట్ట విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉప్పల్‌లోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య దంపతులు డాక్టర్ సిగిరెడ్డి ఉమామహేశ్వరి, డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌లను వలపన్ని (డీకాయ్ ఆపరేషన్) పోలీసులు అరెస్టు చేసి, వారి దగ్గర్నుంచి ఒక ప్రింటర్, స్కానర్, రెండు సెల్ఫోన్లు, లింగ నిర్ధారణ పరీక్ష ఫీజుగా వారే ఇచ్చిన 7,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గర్భిణి అయిన ఒక లేడీ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని మఫ్టీలో వెళ్లి, ఫీజు కట్టి, లింగనిర్ధారణ పరీక్ష చేయించి, రిపోర్ట్స్ తమ చేతికి అందిన వెంటనే డాక్టర్ దంపతులైన గైనకాలజిస్టు, జనరల్ సర్జన్లను అరెస్టు చేసిన పోలీసులు.. 2000 సంవత్సరంలో ప్రారంభం అయిన ఈ ఆసుపత్రి ఏడాది నుంచీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరుగా ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యలు నిర్వహిస్తున్న వాకాటి కరుణ స్థానంలోకి బదిలీ అవగా, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి స్థానంలోకి కుమురంభీం అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ బదలీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 11 మంది జిల్లా కలెక్టర్ల బదిలీలో భాగంగా ఆమ్రపాలిని కూడా బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెకు ఎక్కడికి బదిలీ చేస్తున్నది మాత్రం వెంటనే వెల్లడించలేదు! క్టోబర్‌లో పంపిణీ కోసం ప్రభుత్వం సిద్ధం చేస్తున్న బతుకమ్మ చీరలను భద్రపరిచేందుకు గోదాములను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెల్లకార్డులలో ఉన్న వివరాలను బట్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 8 లక్షల మంది ఉండగా వారందరికీ 280 రూపాయల ఖరీదైన చీరను బతుకమ్మ కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని నెలలుగా భారీ ఎత్తున చీరలు నేయిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలను, బొలీవియా విప్లవాలను, 3,000 మంది మాత్రమే ఉండే తన సకాబా గ్రామ జనాభా 1,75,000 అవడాన్ని కళ్లారా చూసి, ఈ ఏడాది అక్టోబర్ 26వ తేదీకి 118 ఏళ్లను పూర్తి చేసుకోబోతున్న జూలియా ఫ్లోర్స్ కోల్కే తన దేశమైన బొలీవియాలోనే, బహుశా ప్రపంచంలోనే అతి వృద్ధురాలైన మహిళగా రికార్డు నెలకొల్పబోతున్నారు. అయితే ఆమె తరఫున రికార్డు కోసం తమకు దరఖాస్తు వంటిదేదీ అందలేదని గిని ్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటుండగా.. అలాంటి బుక్ ఒకటి ఉందా అని కోల్కే బోసినవ్వులు నవ్వుతున్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఇటీవల బాలల సంరక్షణాలయాలలో జరిగిన లైంగిక అకృత్యాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో, ఆ సంరక్షణాలయాల తీరుతెన్నులపై అధ్యయనం జరిపి ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్.సి.పి.సి.ఆర్) ఇచ్చిన తాత్కాలిక నివేదిక వెల్లడించిన విషయాలపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,874 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లను (సి.సి.ఐ.లు) తనిఖీ చేయగా వాటిలో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నట్లు ఎన్.సి.పి.సి.ఆర్. కోర్టుకు అందించిన తన నివేదికలో తెలిపింది! తాగి డ్రైవ్ చేస్తున్నాడని ఒక యువతి తన బాయ్‌ఫ్రెండ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం కోర్టు అతడికి జరిమానా విధించడంతో పాటు, 17 నెలలు డ్రైవింగ్ చెయ్యకుండా నిషేధించింది. బ్రిటన్‌లో ఉంటున్న కమల్జీత్ సాగూ అనే ఒక ప్రవాస భారతీయుడు తన 44వ పుట్టినరోజు సందర్భంగా గత జూన్ 18న గర్ల్ ఫ్రెండ్‌ను కారులో ఎక్కించుకుని తిప్పుతూ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా గొడవ మొదలై, అతడు కారు దిగి సిగరెట్ కోసం ఓ షాపు దగ్గరికి వెళ్లినప్పుడు ఆ గర్ల్‌ఫ్రెండ్ ఉత్తిపుణ్యానికి పోలీసులకు ఫోన్ చేసి ‘తన బాయ్‌ఫ్రెండ్ తాగి డ్రైవ్ చేస్తున్నాడని’ చెప్పడంతో ఇన్నాళ్లూ నడిచిన ఆ కేసులో ఇప్పుడు తీర్పు వచ్చింది. ఏషియన్ గేమ్స్‌తో దేశానికి తొలిసారి రజత పతకం సాధించుకు వచ్చిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధుపై ఒక వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా, మరోవైపు.. ఆమె ఏ ఫైనల్స్‌లోనూ స్వర్ణపతకం సాధించలేకపోతోందనీ, ఫైనల్స్‌లో ఆడేందుకు ఆమె భయపడుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి! దీనిపై సింధు తండ్రి రమణ స్పందిస్తూ, ‘‘ఇప్పటి వరకు ఎంతో మంది బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఇండియా తరఫున ఆడారు. వారిలో ఎంతమంది ఒలింపిక్స్ ఫైనల్‌కు వెళ్లారు? ఎంతమంది అంతర్జాతీయ పతకాలు గెలుచుకొచ్చారు?’’ అని ప్రశ్నించారు. 918లో సరిగ్గా ఇదే రోజున ఫ్యానీ కప్లాన్ అనే 28 ఏళ్ల రష్యన్ యువతి, ‘సోషలిస్ట్ రివల్యూషనరీ పార్టీ’ సభ్యురాలు.. ‘బోల్షెవిక్’ పార్టీ నేత వ్లాదిమిర్ లెనిన్పై హత్యాయత్నం చేశారు. రివల్యూషనరీ పార్టీని రద్దు చేసిన లెనిల్.. విప్లవ ద్రోహి అంటూ.. ఆగస్టు 30న మాస్కో ఫ్యాక్టరీ నుంచి బయటికి వస్తున్న లెనిన్పై కప్లాన్ అతి సమీపం నుంచి జరిపిన మూడు రౌండ్ల కాల్పులలో లెనిన్ చావు తప్పి, తీవ్రమైన గాయాలతో బయటపడగా.. ఆ తర్వాత మూడు రోజులకే పోలీసులు హడావుడిగా విచారణ జరిపించి సెప్టెంబర్ 3న ఆమె మెడ వెనుకభాగంలో తుపాకీ పెట్టి కాల్చి చంపేశారు. -
ఇంకోటి గెలిస్తే చరిత్ర
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి. పోరాడి ఓడిన సుమీత్ జంట... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
ఆసియా క్రీడల ప్రారంభ సంరంభం
జకార్త: ఇండోనేసియా వేదికగా 2018 ఆసియా క్రీడల సంరంభం మొదలైంది. నాలుగుసంవత్సరాలకొకసారి నిర్వహించుకునే పదహారు రోజుల సంగ్రామానికి తొలి వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకర్తాలో అంగరంగ వైభవంగా మొదలైంది. ఇండియా నుంచి ఇండోనేసియా చేరుకున్న టార్చ్‌తో క్రీడాజ్యోతిని వెలిగించి బాడ్మింటన్ లెజండరీ ప్లేయర్ సుశి సుశాంత్ వేడుకులకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు. క్రీడాకారులు, కళాకారులతో గెలోరా బుంగ్ కర్నో స్టేడియం కన్నుల పండువగా నిలిచింది. స్థానిక సంప్రదాయ కళారూపాలతోపాటు, లైట్ షో ఆహూతులను విపరీతంగా అలరించాయి. జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా భారతీయ క్రీడా, అధికార బృందానికి పరేడ్‌లో నాయకత్వం వహించాడు. 45 దేశాల నుంచి 10 వేలకు మందిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో ఉన్నారు. భారత్ నుంచి 572 మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. పోటీలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. Susi Susanti lights the cauldron, and with this the torch completes its journey! The torch that has been brought from India and across Indonesia, has finally been placed in the cauldron! What a spectacular welcome! #OpeningCeremonyAsianGames2018 #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/aPcXNEd7fj — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 Thank you for watching the #OpeningCeremonyAsianGames2018! Did you enjoy the show? See you at the games! #OpeningAG2018 #AsianGames2018 pic.twitter.com/lzlaZ0OVv6 — Asian Games 2018 (@asiangames2018) August 18, 2018 -
‘ఫైనల్’ లోటు తీరేనా!
నాడు ప్రకాశ్ పదుకొనె, సయ్యద్ మోదీ, పుల్లెల గోపీచంద్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నపుడుగానీ... నేడు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ జోరులో ఉన్న పుడుగానీ... భారత బ్యాడ్మింటన్‌కు మాత్రం ఆసియా క్రీడలు అంతగా కలిసి రాలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ను శాసించేది ఆసియా దేశాలే కావడం... చైనా, కొరియా, జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా జట్లు పటిష్టంగా ఉండటం... ఈ నేపథ్యంలో 1962 జకార్తా ఆసియా క్రీడల్లో తొలిసారి బ్యాడ్మింటన్‌ను చేర్చినప్పటి నుంచి ఇప్పటిదాకా భారత క్రీడాకారులెవరూ ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు మనోళ్ల అత్యుత్తమ ప్రదర్శన కాంస్యమే కావడం గమనార్హం. అయితే అన్నీ కలిసొస్తే... సింధు, సైనా, శ్రీకాంత్ చెలరే గితే... ఈసారి భారత్ ‘ఫైనల్’ లోటును తీర్చుకోవడంతోపాటు స్వర్ణ, రజత కాంతులు విరజిమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి క్రీడావిభాగం: ఒలింపిక్స్... ప్రపంచ చాంపియన్‌షిప్... ఆసియా చాంపియన్‌షిప్... కామన్వెల్త్ గేమ్స్... ఇలా అత్యున్నత వేదికలపై భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తమ సత్తాను చాటుకొని ఫైనల్‌కు చేరుకున్నారు. కాంస్యాలే కాకుండా రజత, స్వర్ణ పతకాలనూ సాధించారు. కానీ ఆసియా క్రీడల్లో మాత్రం రజత, స్వర్ణాలు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 జకార్తా ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ ఈవెంట్ పోటీలు ఆగస్టు 19 నుంచి 28 వరకు జరుగుతాయి. నిలకడైన ప్రదర్శన... గత ఆరేళ్ల కాలంలో భారత బ్యాడ్మింటన్ గణనీయమైన పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. సింగిల్స్‌లో సైనా, పీవీ సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్... డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి, సుమీత్ రెడ్డి–మనూ అత్రి, సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి–ప్రణవ్ జంటలు గొప్ప విజయాలు సాధించాయి. మహిళల సింగిల్స్‌లో సైనా... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ప్రపంచ నంబర్‌వన్‌గా కూడా నిలిచారు. గత ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఆరు పతకాలు భారత క్రీడాకారిణులు సింధు, సైనాలే గెలవడం మరో విశేషం. ఆ ఇద్దరిపైనే ఆశలు ఐదున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఒక్క పతకమూ రాలేదు. అయితే ఈసారి ఆ లోటు తీరేలా కనిపిస్తోంది. భారత స్టార్స్ సింధు, సైనా అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే దీనికి కారణం. ఇటీవలే ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు ఫైనల్‌కు... సైనా క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పీవీ సింధు రెండో రౌండ్లో నిష్క్రమించగా... సైనా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో సింధు, సైనా ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్ క్రీడాకారిణులకు దీటుగా వీరిద్దరు విజయాలు సాధించారు. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు లభించిన ఏకైక కాంస్యం 1982లో సయ్యద్ మోదీ సాధించాడు. ఆ తర్వాత మనం ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఈసారి మాత్రం కాస్త ‘డ్రా’ అనుకూలంగా ఉండి.. శ్రీకాంత్, ప్రణయ్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే కనీసం కాంస్యం వచ్చే అవకాశం ఉంది. భారత జట్లు పురుషుల విభాగం: శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, సౌరభ్ వర్మ, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, మనూ అత్రి, సుమీత్ రెడ్డి, ప్రణవ్ చోప్రా. మహిళల విభాగం: సింధు, సైనా, సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజిత, అష్మిత, రితూపర్ణ, ఆరతి, ఆకర్షి కశ్యప్, పుల్లెల గాయత్రి. ఆసియా క్రీడల్లో మన ప్రదర్శన టెహ్రాన్, 1974: ప్రకాశ్ పదుకొనె, దినేశ్ ఖన్నా, దవిందర్ అహూజా, పార్థో గంగూలీ, రామన్ ఘోష్‌లతో కూడిన భారత పురుషుల జట్టు టీమ్ ఈవెంట్లో కాంస్యం సాధించింది. న్యూఢిల్లీ, 1982: స్వదేశంలో జరిగిన ఈ క్రీడల్లో భారత్ ఐదు కాంస్యాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ... పురుషుల డబుల్స్‌లో లెరాయ్ డిసౌజా–ప్రదీప్ గాంధె ద్వయం... లెరాయ్–కన్వల్ ఠక్కర్ కౌర్ మిక్స్డ్ డబుల్స్‌లో... సయ్యద్ మోదీ, ఉదయ్ పవార్, విక్రమ్ సింగ్, లెరాయ్ డిసౌజా, ప్రదీప్ గాంధె, పార్థో గంగూలీలతో కూడిన పురుషుల జట్టు ... అమీ ఘియా, అమిత, మధుమిత, కన్వల్ ఠక్కర్ కౌర్, హఫ్రిష్ నారీమన్, వందనలతో కూడిన మహిళల జట్టు టీమ్ ఈవెంట్లో కాంస్యాలు గెలిచాయి. సియోల్, 1986: ప్రకాశ్ పదుకొనె, సయ్యద్ మోదీ, విమల్, సనత్ మిశ్రా, లెరాయ్ డిసౌజా, ఉదయ్, రవిలతో కూడిన పురుషుల జట్టు టీమ్ ఈవెంట్లో కాంస్యం దక్కించుకుంది. ఇంచియోన్, 2014: సింధు, సైనా, తులసీ, తన్వీ, అశ్విని, ప్రద్న్యా, సిక్కి రెడ్డిలతో కూడిన మహిళల జట్టు టీమ్ ఈవెంట్లో కాంస్యం సంపాదించింది. మేము పతకాలతో తిరిగొస్తామన్న నమ్మకం ఉంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇలా ప్రతి విభాగంలో భారత్‌కు పతకం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ తరహా ఆశావహ పరిస్థితులు ఎప్పుడూ లేవు. గత ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు కాంస్యం సాధించింది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు రజతం గెలిచింది. ఈ మెగా ఈవెంట్‌కు ఆటగాళ్లందరి సన్నా హాలు బాగున్నాయి. – గోపీచంద్, చీఫ్ కోచ్ -
తగని ప్రశ్న తగిన జవాబు
ప్రశ్న: ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ వంటి పెద్ద పెద్ద పోటీల ఫైనల్స్‌లో మీరు గెలవలేకపోతున్నారు! ఇకముందైనా ఓడిపోకుండా ఉండేందుకు మీరేం చేయబోతున్నారు? పి.వి.సింధు : నేను చాలా ఆకలిగా ఉన్నాను. బిగ్ టైటిల్స్ కొట్టాలని రగిలిపోతున్నాను. అలాగని బాధలో ఏం లేను. నాకు తెలుసు.. ఏదో ఒక రోజు నేను గెలిచి తీరుతాను. ఓడినా, గెలిచినా వంద శాతం గెలిచి తీరేందుకే నేను ఆడతాను. మిగతా ప్లేయర్లు తక్కువేం కాదు. అవతలి వైపుకు మనం కొట్టే స్ట్రోక్స్ బట్టి విజయావకాశాలు ఉంటాయి. అనూహ్యంగా జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మిస్సింగ్స్ కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. చైనాలోని నంజింగ్‌లో సోమవారం ప్రారంభం అవుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్న వరల్డ్ నం.3, గతేడాది రన్నరప్ అయిన పి.వి.సింధు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానం. ►స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో గత ఏడాది జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఉమెన్స్ సింగిల్స్ పోటీలలో పి.వి.సింధు రన్నరప్‌గా నిలిచారు. -
రన్నరప్ సింధు
బ్యాంకాక్: ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 15–21, 18–21తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది ఫైనల్ పోరులో ఓడిపోవడం సింధుకిది మూడోసారి. ఇండియా ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్‌లోనూ సింధు ఓటమి చవిచూసింది. విజేత ఒకుహారాకు 26,250 డాలర్ల (రూ. 17 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ, 9,200 పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 11 వేలు), 7800 పాయింట్లు లభించాయి. -
సింధు, శ్రీకాంత్‌లకు నిరాశ
కౌలాలంపూర్: గతేడాది అద్భుతమైన ఫలితాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు ఈ సీజన్లో మరోసారి నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్ వరల్డ్ టూర్–750 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం సెమీఫైనల్స్‌లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో పీవీ సింధు 15–21, 21–19, 11–21తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 13–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. సింధు, శ్రీకాంత్‌లకు 9,800 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షల 71 వేలు)తోపాటు 7,700 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తై జు యింగ్‌తో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధుకు ఈసారీ అలాంటి ఫలితమే వచ్చింది. ఈ ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా కీలకదశలో సింధు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మొమోటాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. -
వరల్డ్ టాప్-10లో మోదీ, అమితాబ్
ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల లిస్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ చోటు సంపాదించుకున్నారు. యూకేకు చెందిన ‘యూగవ్’ సంస్థ 2018 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో వీళ్లకు చోటు దక్కింది. సర్వేలో భాగంగా మొత్తం 35 దేశాలకు చెందిన 37,500 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా... వివిధ దేశాలకు మళ్లీ విడివిడిగా జాబితాలను రూపొందించారు. పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రథమ స్థానం దక్కించుకోగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, నటుడు జాకీ చాన్, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌లు తర్వాతి స్థానంలో నిలిచారు. భారత్ తరపున మోదీ, అమితాబ్‌లు వరుసగా 8వ, 9వ స్థానాల్లో నిలిచారు. మహిళ విభాగంలో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ప్రథమ స్థానం దక్కింది. ఈ విభాగంలో భారత్ నుంచి టాప్ టెన్‌లో ఎవరికి చోటు లభించలేదు. బాలీవుడ్ బ్యూటీస్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వరుసగా 11,12, 13 స్థానాల్లో నిలిచారు. ఒబామా భార్య మిషెల్లీ మహిళల విభాగంలో రెండో స్థానంలో నిలవటం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నారు. భారత లిస్ట్‌లో సింధుకు చోటు.. యూగవ్ భారత్‌లో ఎక్కువగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో పురుషుల జాబితాలో మోదీ, మహిళల విభాగంలో పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రథమ స్థానంలో నిలిచారు. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు 3వ స్థానం దక్కించుకున్నారు. విదేశీయులు బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, దలైలామా.. మలాలా యూసఫ్‌జాయ్, ఏంజెలినా జోలీ, మిషెల్లీ ఒబామా టాప్ టెన్‌లో నిలవడం గమనార్హం. -
మెరిసిన సింధు, సిక్కి, రుత్విక
అలోర్ సెటార్ (మలేసియా): స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ గైర్హాజరీ ప్రభావం చూపిన వేళ... తెలుగు తేజాలు పీవీ సింధు, సిక్కి రెడ్డి, గద్దె రుత్విక శివాని బాధ్యతాయుతంగా ఆడి భారత్‌ను గట్టెక్కించారు. ఫలితంగా మంగళవారం మొదలైన ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్ ‘డబ్ల్యూ’ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–2తో విజయం సాధించి దాదాపు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం సాయంత్రం న్యూఢిల్లీలో ఇండియా ఓపెన్ ఫైనల్ ఆడి సోమవారమే ఇక్కడకు చేరుకున్న సింధు ప్రయాణ బడలిక నుంచి తేరుకొని అద్భుత ప్రదర్శన చేసింది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21–12, 21–18తో 33 నిమిషాల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ యిప్ పుయ్ యిన్‌ను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యం అందించింది. డబుల్స్ మ్యాచ్‌లో అశ్విని పొన్నప్ప–ప్రజక్తా సావంత్ ద్వయం 22–20, 20–22, 12–21తో ఎన్జీ యింగ్ యుంగ్–యెయుంగ్ ఎన్గా టింగ్ జంట చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 19–21, 21–18, 20–22తో చెయుంగ్ యింగ్ మె చేతిలో ఓటమి చెందడంతో భారత్ 1–2తో వెనుకబడింది. విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో స్పెషలిస్ట్ సిక్కి రెడ్డికి జతగా సింధు బరిలోకి దిగింది. ఈ జంట 21–15, 15–21, 21–14తో ఎన్జీ సాజ్ యవు–యుయెన్ సిన్ యింగ్‌పై నెగ్గడంతో భారత్ స్కోరును 2–2తో సమం చేసింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో రుత్విక శివాని 16–21, 21–16, 21–13తో యెయుంగ్ సమ్ యీపై గెలుపొందడంతో భారత్‌కు 3–2తో విజయం ఖాయమైంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్‌తో జపాన్ తలపడుతుంది. పురుషుల జట్టు క్లీన్‌స్వీప్ ఇదే వేదికపై జరిగిన పురుషుల విభాగం గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిలిప్పీన్స్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో కిడాంబి శ్రీకాంత్ 21–11, 21–12తో పెడ్రోసాపై... సాయిప్రణీత్ 21–6, 21–10తో సాల్వాడోపై... సమీర్ వర్మ 21–15, 21–12తో జాఫ్రాపై గెలుపొందారు. డబుల్స్ మ్యాచ్‌ల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 21–15, 21–13తో కయానాన్–ఎస్కుయెటా జోడీపై.., శ్లోక్ రామచంద్రన్–అర్జున్ ద్వయం 21–18, 21–17తో మగ్నాయె–మొరాదా జంటపై గెలిచాయి. బుధవారం జరిగే మ్యాచ్లోమాల్దీవులుతో ఆడుతుంది. -
తుది మెట్టుపై బోల్తా
న్యూఢిల్లీ: స్వదేశంలో వరుసగా రెండో ఏడాది ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 18–21, 21–11, 20–22తో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు సాగిన ఈ తుది పోరులో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. తన కెరీర్లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. వీరిద్దరు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా... సింధు మూడుసార్లు, జాంగ్ రెండుసార్లు గెలిచారు. ఐదు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం విశేషం. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. క్వార్టర్ ఫైనల్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించిన సింధుకు ఫైనల్లో గట్టిపోటీనే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా నెహ్వాల్‌ను... సెమీస్‌లో ఆరో సీడ్ చెయుంగ్ ఎన్గాన్ (హాంకాంగ్)ను ఓడించిన బీవెన్ జాంగ్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. తొలి గేమ్‌లో కీలక దశలో పైచేయి సాధించిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం సింధు ధాటికి తడబడింది. రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు చొప్పున కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. చివర్లో సింధు 20–19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన జాంగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ షి యుకి (చైనా) 21–18, 21–14తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి విజేతగా నిలిచాడు.