భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్ను సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలి గేమ్ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది