sun yu
-
డిఫెండింగ్ చాంపియన్ సైనాకు షాక్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మరో హైదరాబాద్ ప్లేయర్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో భాగంగా జరిగిన శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్(భారత్) పై 21-17, 10-21, 21-17 తేడాతో సున్ యు (చైనా) విజయం సాధించింది. ఈ విజయంతో భారత స్టార్ షట్లర్ ఇంటిదారి పట్టగా, నెగ్గిన చైనా క్రీడాకారణి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా రెండో గేమ్‌లో ప్రత్యర్ధి సున్ యుకు గట్టి పోటీనిచ్చింది. రెండో గేమ్ నెగ్గిన సైనా మూడో గేమ్‌లో కొన్ని అనవసరం తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుని ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సైనాతో పాటు మరో క్వార్టర్ ఫైనల్లో ఓడిన పీవీ సింధు ఇంటిదారి పట్టారు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
సింధు అద్భుతంగా ఆడింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన తెలుగమ్మాయి, స్టార్ షట్లర్ పివి సింధును ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. చైనా ఓపెన్ సిరీస్‌లో సింధు అద్భుతంగా ఆడిందంటూ ట్విట్టర్లో కితాబిచ్చారు. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు 21-11, 17-21, 21-11 తేడాతో సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో అద్భుతంగా ఆడి దేశానికి రజత పతకం అందించిన సింధు చైనా ఓపెన్ సిరీస్‌లోనూ దూకుడు ఆడి తన సత్తా చాటింది. కెరీర్లో తొలి ప్రదర్శించిన సింధు సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఆమెను అభినందించారు. Congratulations to @Pvsindhu1 for her first super series title. Well played! #ChinaOpen — Narendra Modi (@narendramodi) 20 November 2016 -
సింధుకే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్
-
సింధు సాధించెన్
ఫుజు (చైనా):భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పివి సింధు తన కెరీర్లో తొలిసారి సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌ను చేజార్చుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్ అనివార్యమైంది మూడో గేమ్ లో దాదాపు ఆరు పాయింట్ల వరకూ సింధు-సున్ యులు సమంగా నిలిచి మ్యాచ్ పై ఆసక్తిని రేపారు. ఆ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తరువాత అదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌ను సొంతం చేసుకుంది. అదే క్రమంలో సున్ యు పదే పదే తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. తాజా విజయంతో తన ముఖాముఖి రికార్డును సింధు 3-3 తో సమం చేసింది. ఈ మేరకు చైనా సూపర్ సిరీస్ టైటిల్ వేటలోఆద్యంతం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పివి సింధుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.