కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ పివి సింధు ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16 తేడాతో బింగ్‌జియావో(చైనా)పై గెలిచి ఫైనల్ కు చేరారు. తద్వారా కొరియో ఓపెన్ సూపర్ సిరీస్ లోకి తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి గేమ్ లో 9-3 తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించిన సింధు.. వరుస పాయింట్లతో దూసుకుపోయింది. తొలి గేమ్ లో 13-6, 19-9 తేడాతో పైచేయి సాధించిన సింధు ఆ గేమ్ ను సునాయాసంగా గెలుచుకున్నారు. కాగా, రెండో గేమ్ లో బింగ్జియావో నుంచి సింధుకు ఊహించని ప్రతి ఘటన ఎదురైంది.
Published Sat, Sep 16 2017 1:14 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement