సాక్షి, అమరావతి: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అంటూ ట్విట్టర్‌లో సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డును పీవీ సింధు అందుకుంది.
All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2021
She is the 1st Indian woman to have won two individual medals at #Olympics.
Comments
Please login to add a commentAdd a comment