congratulated
-
మానవాళికి మహ్మద్ ప్రవక్త మహోన్నత సందేశాలు
సాక్షి, అమరావతి: ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉండి, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు’ అంటూ గురువారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
ఏపీ వ్యవసాయశాఖకు మరో అవార్డు.. అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: Agriculture Leadership Conclave Award: ఏపీ వ్యవసాయ శాఖ మరో అవార్డు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రఖ్యాత అగ్రికల్చర్ టుడే గ్రూప్ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2022లో పాలసీ లీడర్షిప్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్. శేఖర్ బాబు గెడ్డం బుధవారం కలిశారు. సీఎం జగన్ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఏపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది. చదవండి: అందుకే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం: సీఎం జగన్ -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్ అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కాగా పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. చదవండి: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
పీవీ సింధుకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున మహిళల వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించి కొత్త అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళ అంటూ ట్విట్టర్లో సీఎం వైఎస్ జగన్ కొనియాడారు. భవిష్యత్ ఈవెంట్స్‌లోనూ సింధు విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. విశ్వక్రీడల్లో సింధు మరోసారి సత్తా చాటి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించగా, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసింది. 2016లో సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డును పీవీ సింధు అందుకుంది. All good wishes and much Congratulations to our Telugu girl @Pvsindhu1 for winning Bronze for India at #TokyoOlympics2020 She is the 1st Indian woman to have won two individual medals at #Olympics. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2021 -
ప్రజలకు చేరువైన ‘షీ–టీమ్స్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రజలకు చేరువైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హైదరా బాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణలో షీ–టీమ్స్ సాధించిన విజయాలు వారి పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సైతం షీ టీమ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేరాలను తగ్గిస్తూ.. నిందితుల్లో పరివర్తన కోసం కౌన్సెలింగ్ చేస్తోన్న షీ–టీ మ్స్ విధానాన్ని ప్రశంసించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలోని పలు మెట్రో నగరాల్లో షీటీమ్స్‌ను స్ఫూర్తిగా ప్రత్యేకదళాలను ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.షీ–టీమ్స్ అధిపతి, ఐజీ స్వాతి లక్రామాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలన్న నినాదంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు. -
సివిల్ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గన్నవరం : అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం సివిల్స్- 2017 ఫైనల్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాడం ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ గర్వకారణం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సివిల్ టాపర్స్ కూడా వైఎస్ జగన్ అభినందించారు. వారి కృషికి ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి యూపీఎస్సీ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో సర్వీసెస్ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది. టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) ర్యాంకు దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి) 1 శీలం సాయితేజ 43 నారపురెడ్డి శౌర్య 100 మాధురి 144 వివేక్ జాన్సన్ 195 కృష్ణకాంత్ పటేల్ 607 వై అక్షయ్ కుమార్ 624 భార్గవ శేఖర్ 816 -
ఎమ్మెల్యే కోనప్పను అభినందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కేసీఆర్ గురు వారం ప్రత్యేకంగా అభినందించారు. గురువారం ప్రగతిభవన్ లో కోనప్ప సీఎంను కలసిన సందర్భంగా ‘నియోజక వర్గం పరిధిలోని దాదాపు 2,200 మంది విద్యార్థులకు సొంత ఖర్చుతో భోజనంతో పాటు ఆయా విద్యార్థులకు రగ్గులు, పుస్తకాలు కూడా అందిస్తూ ఆదర్శంగా నిలిచారం’టూ కోనప్పను అభినందిం చారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడు తూ.. పెంచికలపేటలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.30కోట్లు, నియోజకవర్గంలో అంతర్గత రహదారుల కోసం రూ. 4.10కోట్లు సీఎం మంజూరు చేసినట్లు తెలిపారు.