వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సాక్షి, గన్నవరం : అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం సివిల్స్- 2017 ఫైనల్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాడం ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ గర్వకారణం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సివిల్ టాపర్స్ కూడా వైఎస్ జగన్ అభినందించారు. వారి కృషికి ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
గత సంవత్సరం జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి యూపీఎస్సీ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో సర్వీసెస్ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.
టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) ర్యాంకు
దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి) 1
శీలం సాయితేజ 43
నారపురెడ్డి శౌర్య 100
మాధురి 144
వివేక్ జాన్సన్ 195
కృష్ణకాంత్ పటేల్ 607
వై అక్షయ్ కుమార్ 624
భార్గవ శేఖర్ 816
Comments
Please login to add a commentAdd a comment