సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి | Anudeep Durishetty Tops In Civil Services Results 2017 | Sakshi
Sakshi News home page

సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి

Published Fri, Apr 27 2018 8:22 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Anudeep Durishetty Tops In Civil Services Results 2017 - Sakshi

దురిశెట్టి అనుదీప్

సాక్షి, న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్‌వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్‌-2017 మెయిన్స్‌ తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది.   

గతేడాది జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ యూపీఎస్సీ నిర్వహించింది. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.  

ర్యాంకు      టాపర్లు (తెలుగు రాష్ట్రాలు)
1       దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి)
43     శీలం సాయితేజ
100    నారపురెడ్డి శౌర్య
144    మాధురి
195    వివేక్ జాన్సన్
607    కృష్ణకాంత్‌ పటేల్‌
624    వై అక్షయ్ కుమార్
816    భార్గవ శేఖర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement