ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు | YS Jagan Mohan Reddy Congratulated ISRO Scientists Successful Launch Of PSLV C 52 | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు

Published Mon, Feb 14 2022 8:16 AM | Last Updated on Mon, Feb 14 2022 2:39 PM

YS Jagan Mohan Reddy Congratulated ISRO Scientists Successful Launch Of PSLV C 52 - Sakshi

సాక్షి, అమరావతి: పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లిందని సీఎం జగన్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కాగా పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్‌–04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లోని ఫస్ట్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు.

చదవండి: పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement