
ఎమ్మెల్యే కోనప్పను అభినందించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సొంత ఖర్చుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ముఖ్యమంత్రి కేసీఆర్ గురు వారం ప్రత్యేకంగా అభినందించారు.
గురువారం ప్రగతిభవన్ లో కోనప్ప సీఎంను కలసిన సందర్భంగా ‘నియోజక వర్గం పరిధిలోని దాదాపు 2,200 మంది విద్యార్థులకు సొంత ఖర్చుతో భోజనంతో పాటు ఆయా విద్యార్థులకు రగ్గులు, పుస్తకాలు కూడా అందిస్తూ ఆదర్శంగా నిలిచారం’టూ కోనప్పను అభినందిం చారు. ఈ సందర్భంగా కోనప్ప మాట్లాడు తూ.. పెంచికలపేటలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.30కోట్లు, నియోజకవర్గంలో అంతర్గత రహదారుల కోసం రూ. 4.10కోట్లు సీఎం మంజూరు చేసినట్లు తెలిపారు.