
హైదరాబాద్‌లో షీటీమ్స్ ఐదో వార్షికోత్సవంలో మాట్లాడుతున్న ఐజీ స్వాతి లక్రా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్ల కిందట ఏర్పాటు చేసిన షీటీమ్స్ అద్భుత ఫలితాలు సాధిస్తూ ప్రజలకు చేరువైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం హైదరా బాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన షీటీమ్స్ ఐదో వార్షికోత్సవం వేడు కలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాల నివారణలో షీ–టీమ్స్ సాధించిన విజయాలు వారి పనితీరుకు నిదర్శనమన్నారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సైతం షీ టీమ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నేరాలను తగ్గిస్తూ.. నిందితుల్లో పరివర్తన కోసం కౌన్సెలింగ్ చేస్తోన్న షీ–టీ మ్స్ విధానాన్ని ప్రశంసించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలోని పలు మెట్రో నగరాల్లో షీటీమ్స్‌ను స్ఫూర్తిగా ప్రత్యేకదళాలను ఏర్పాటు చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు.షీ–టీమ్స్ అధిపతి, ఐజీ స్వాతి లక్రామాట్లాడుతూ.. చికిత్స కంటే నివారణ మేలన్న నినాదంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. యువతను సన్మార్గంలో నడిపించడమే తమ ధ్యేయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment