నిరాశపర్చిన భారత స్విమ్మర్‌లు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్విమ్మర్‌లు నిరాశపరిచారు.స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీ ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయాడు. శ్రీహరి నటరాజ్ 54.07 సెకన్లలో రేసును పూర్తి చేసి 27వ స్ధానంలో నిలిచాడు. అయితే మెదటి 16 మందికి మాత్రమే సెమిఫైనల్‌కు చేరే ఆర్హత ఉంటుంది. దీంతో శ్రీహరి నటరాజ్ ఆర్హత సాధించ లేకపోయాడు. మరో వైపు స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ భారత మహిళ స్విమ్మర్ మానా పటేల్ కూడా సెమీ ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయింది.
ఆస్ట్రేలియా చేతిలో భారత హాకీ జట్టు ఓటమి
టోక్యో ఒలింపిక్స్‌లో మెదటి మ్యాచ్‌లో శుభారంభం చేసిన భారత పురుషుల హాకీ జట్టు రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియాపై అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. పూల్ ఎ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు 1-7 తేడాతో చిత్తుగా ఓటమి పాలైంది. మెదటి క్వార్టర్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఆస్ట్రేలియా తన ఆధిపత్యం చెలాయించింది. మెదటి క్వార్టర్ 10వ నిమిషంలో మొదటి గోల్ చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత 21వ, 23వ, 26వ నిమిషాల్లో గోల్స్ చేసి రెండో క్వార్టర్ ముగిసేసరికి 4-0 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లో భారత జట్టు తరుపున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే ఏకైక గోల్ చేయగలిగాడు. అయితే ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసిన ఆస్ట్రేలియా, నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేసి 7-1 తేడాతో ఘనవిజయం సాధించింది
బాక్సింగ్‌లో మేరీ కోమ్ విజయం
ఒలింపిక్స్‌లో భాగంగా బాక్సింగ్‌లో మేరీ కోమ్ శుభారంభం చేసింది. మహిళల ఫ్లై వెయిట్ రౌండ్ 32లో డొమెనికన్ రిపబ్లిక్‌కు చెందిన మిగులినాను ఓడించిన మేరీ కోమ్ రౌండ్ 16కు అర్హత సాధించింది. ఇక జూలై 29న మేరీ కోమ్ కొలంబియాకు చెందిన మూడో సీడ్ వాలెన్సియా విక్టోరియాతో రౌండ్ 16లో తలపడనుంది. కాగా మేరీకోమ్ 2012 లండన్ ఒలింపిక్స్ విభాగంలో క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
India's Legendary Women Boxer MARY KOM Start her Tokyo Olympic Campaign right now. Sixth time world champion Mary's ambition to win gold in Olympic. Hope she fulfill his dream. #MaryKom #boxing #Tokyo2020 pic.twitter.com/qrJacilTVc
— Gautam™ #IND (@SpeaksGautam) July 25, 2021
మూడో రౌండ్‌కు మనికా బత్రా
►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా టేబుల్ టెన్నిస్ మహిళల విభాగంలో మనికా బత్రా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గారిటా పెసోట్స్కాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా ఏడు గేములు కలిపి మనికా 11-4, 11-4, 7-11, 10-12, 11-8, 5-11, 7-11తో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరింది.
టేబుల్ టెన్నిస్ సింగిల్స్ నుంచి జ్ఞానేశ్వరన్ ఔట్
►ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ కాంపిటిషన్ మెన్స్ సింగిల్స్‌లో ఇండియాకు చెందిన జ్ఞానేశ్వరన్ సత్యన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో తన కంటే తక్కువ ర్యాంక్ ఆటగాడు, హాంకాంగ్‌కు చెందిన లామ్ సియు హాంగ్ చేతిలో 7-11, 11-7, 11-4, 11-5, 10-12, 9-11, 6-11 తేడాతో ఓడిపోయాడు. తొలి గేమ్ కోల్పోయినా.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ గెలిచి మ్యాచ్‌పై ఆశలు రేపిన జ్ఞానేశ్వరన్.. తర్వాత వరుసగా మూడు గేమ్స్ కోల్పోయి మ్యాచ్ చేజార్చుకున్నాడు.
షూటింగ్‌లో మరోసారి నిరాశ
►టోక్యో ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మరోసారి నిరాశే ఎదురైంది. పురుషుల 10 మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో దీపక్ కుమార్, దివ్యాన్ష్‌సింగ్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. కాగా 624.7 పాయింట్లతో దీపక్ సింగ్ 26వ స్థానంలో ఉండగా.. 622.8 పాయింట్లతో దివ్యాన్ష్ సింగ్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన యాష్లే బార్టీ
► మహిళల టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్ యాష్లే బార్టీకి గట్టి షాక్ తగిలింది. సారా సోరిబ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బార్టీ 6-4, 6-3తో వరుస సెట్లలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఇక ఒలింపిక్స్‌లో సింగిల్ విభాగం నుంచి ఇంగ్లండ్ స్టార్ ఆండీ ముర్రే వైదొలిగాడు. గాయం కారణంగా సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ముర్రే తెలిపాడు. కాగా డబుల్స్‌కు మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపాడు. ఇక ముర్రే 2012,2016 ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
►టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డబుల్స్ టెన్సిస్‌లో భారత్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన సానియా- అంకితా రైనా జోడి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఉక్రెయిన్ జంటతో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో 6-0, 6-7(0). 8-10తో ఓడిపోయింది.
►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రోయింగ్‌లో భారత్ శుభారంభం చేసింది. లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ రెపికేజ్‌లో భారత్‌కు చెందిన అర్జున్‌లాల్, అరవింద్ సింగ్ జోడీ సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు క్యాంస్యం ఖరారు అవుతుంది.
పీవీ సింధు శుభారంభం
►టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా షట్లర్ పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాతో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ను సింధు 27-7, 21-10తో వరుస రెండు గేముల్లో గెలిచి మ్యాచ్‌ను వశం చేసుకుంది. 29 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం.
షూటింగ్ విభాగంలో మళ్లీ నిరాశే
►మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మనుబాకర్, యశస్వినిలు చతికిలపడ్డారు. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో మను బాకర్ 12వ స్థానంలో, 13వ స్థానంలో యశస్విని నిలిచారు.
టోక్యో: తొలి రోజైతే శుభవార్త విన్నాం. వచ్చింది రజతమే అయినా బంగారమంత ఆత్మవిశ్వాసాన్ని భారత క్రీడాకారుల్లో నింపింది. కొండంత ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు ఊతమిచి్చంది. ఆదివారం షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లలో భారత క్రీడాకారులు తలపడనున్నారు. ఈ ఎనిమిది ఈవెంట్లలోనూ పతకం గెలిచే క్రీడాంశం షూటింగ్ ఒక్కటే ఉంది. మిగతావన్నీ కూడా క్వాలిఫికేషన్, లీగ్, తొలి రౌండ్, హీట్స్ పోటీలు. తెలుగమ్మాయి, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి రౌండ్ ఆట, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ మొదటి బౌట్ కూడా నేడే మొదలవుతోంది. టెన్నిస్‌లో సానియా మీర్జా– అంకిత రైనా జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.
ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్
ఉ.6:30కి జిమ్నాస్టిక్స్ మహిళల ఆల్‌రౌండ్ క్వాలిఫికేషన్
ఉ.6:30కి రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్స్ స్కల్స్ రెపిచేజ్
ఉ.6:30కి షూటింగ్ పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ (బజ్వా, మీరజ్)
ఉ.7:10కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ (పీవీ సింధు)
ఉ.9:30కి షూటింగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్
ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్
ఉ.10:30కి టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్
మ.1:30కి బాక్సింగ్ మహిళల ఫ్లైవెయిట్ (మేరీకోమ్ రౌండ్‌ఆఫ్ 32)
మ.3 గంటలకు భారత్ Vs ఆస్ట్రేలియా హాకీ మ్యాచ్
మ.3:30కి స్విమ్మింగ్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (మానా పటేల్)
మ.3:30కి స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్స్ (సాజన్ ప్రకాశ్)
సా.4:20కి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ (శ్రీహరి నటరాజ్)
Comments
Please login to add a commentAdd a comment