
దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు
విజయవాడ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం సింధు తన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వెళ్లింది.
అధికారులు ఆలయ మర్యాదలతో సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సింధు కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఫొటోను బహూకరించారు. సింధు వెంట తల్లిదండ్రులు విజయ, రమణ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.