vijayawada kanakadurga temple
-
విజయవాడ లడ్డు ఇష్యూ.. మల్లాది విష్ణు స్ట్రాంగ్ రియాక్షన్
-
ఇంద్రకీలాద్రి.. సింధూర శోభితం (ఫోటోలు)
-
New year: సీఎం జగన్‌కు వేదపండితుల ఆశీర్వచనం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సీఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు.. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ వేదపండితులు, దుర్గ గుడి వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు అందించారు. ఇక, దుర్గ గుడి వేదపండితులు అమ్మవారి చిత్రపటం, క్యాలెండర్, ప్రసాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
కొండకు కొత్త శోభ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారంశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గానగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులకు సీఎం జగన్ తొలుత శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అమ్మవారి విశేషాలతో దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురించిన ‘శ్రీకనకదుర్గా వైభవం – ఉపాసనా విధానం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆవిష్కరించారు. వేద పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ వివరాలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గోశాల శంకుస్థాపన ప్రాంతం వరకు వివిధ కళాబృందాలు తమ ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికాయి. కేరళ సంప్రదాయ డ్రమ్స్ బృందం, తెలంగాణ కొత్తగూడెం గిరిజనుల కొమ్ము కోయ నృత్యం, భద్రాచలం ఒగ్గుడోలు, గిరిజన గుస్సాడి (నెమలి నృత్యం) కోలాటం, కూచిపూడి నృత్య బృందాల ప్రదర్శనలు అలరించాయి. పూర్ణకుంభంతో స్వాగతం కనక దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పెద రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మెన్ కర్నాటి రాంబాబు, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో కెఎస్.రామారావు, వేద పండితులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, రుహుల్లా, అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు, దేవదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలన్, దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ ఢిల్లీరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె రాణా, డీసీపీ విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ , ఆలయ ఈవో కె.ఎస్ రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్.డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన పనులు ఇవీ.. ► రూ.5.60 కోట్లతో పునః నిర్మించిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం ► రూ.4.25 కోట్లతో పూర్తైన ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు ► రూ.3.25 కోట్లతో ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, స్కాడా పనులు ► 2016 పుష్కరాల సమయంలో గత సర్కారు కూల్చిన ఎనిమిది ఆలయాలను రూ 3.87 కోట్లతో పునః నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్. ► పాతపాడు గ్రామంలో దేవస్థానం స్థలంలో రూ.5.66 కోట్లతో 1 మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం ► కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన బొడ్డు బొమ్మ, రూ.28 లక్షలతో అమ్మవారి పాత మెట్ల మార్గంలో నిర్మించిన ఆంజనేయ స్వామి, వినాయక ఆలయాలను ప్రారంభించిన సీఎం జగన్. శంకుస్థాపనలు ► దుర్గగుడిలో రూ.30 కోట్లతో అన్నప్రసాద భవనం ► రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణాలు ► రూ.13 కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ► రూ.15 కోట్లతో రాజగోపురం ముందుభాగం వద్ద మెట్ల నిర్మాణం ► రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్ ► రూ.7.75 కోట్లతో కనకదుర్గ ప్రవేశ మార్గం వద్ద మహారాజద్వార నిర్మాణం ► రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం ► రూ.18.30 కోట్లతో మల్లిఖార్జున మహా మండపం క్యూకాంప్లెక్స్‌గా మార్పు ► రూ.19 కోట్లతో నూతన కేశ ఖండనశాల ► కొండ దిగువన ఉన్న గోశాల భవనం రూ.10 కోట్లతో బహుళ ప్రయోజన సౌకర్య సముదాయంగా మార్పు ► దాతల సహకారంతో రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్ రాతి యాగశాల నిర్మాణం ► దేవస్థానం–ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.33 కోట్లతో కనక దుర్గానగర్ వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ నిర్మాణం పనులు. -
నేడు చంద్రగ్రహణం.. తిరుమల సహా ఆలయాలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో, నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులను మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,404. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,659. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. తిరుమలలో ఇలా.. ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత గ్రహణం కారణంగా నేడు రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత. విజయవాడలో ఇలా... పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత నేటి సాయంత్రం 6:30 గంటలకు దుర్గగుడితో పాటు ఉపాలయాల కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) గ్రహణ మోక్షకాలం అనంతరం రేపు తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు తెరుస్తారు స్నపనాభిషేకాల అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం తెలంగాణలో ఇలా.. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల మూసివేత ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాల వరకూ ఆలయాల మూసివేత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారుల ప్రకటన రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు సంప్రోక్షణతో ప్రాత:కాల పూజ చేసి తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. పూరీ క్షేత్రంలో భిన్నంగా.. గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయి. ►అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేయనున్నారు. ►చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయాలు మూసివేత ►తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు. ►నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యదేవుని ఆలయం మూసివేత. ►తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు. ►అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభం -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా
-
దుర్గమ్మ సేవలో సీఎం జగన్
-
దుర్గమ్మ సేవలో సీఎం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మ వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సంప్రదాయ పట్టు పంచె, తెల్ల చొక్కా ధరించి ఆలయ దర్శనానికి వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డికి వేద పండితులు, ఆలయ పూజార్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ సీఎం తలకు పరివట్టం (పట్టువస్త్రంతో తలపాగా) చుట్టారు. దుర్గమ్మకు తెచ్చిన పట్టువస్త్రాలను ఆలయ ఈవో భ్రమరాంబకు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను వైఎస్ జగన్ తన తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి అంతరాలయంలోకి వెళ్లి శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో వేద పండితులు సీఎం జగన్‌కు వేద ఆశీర్వచనం.. ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈవో భ్రమరాంబలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, ఎంపీలు నందిగం సురేష్, వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కె.అనిల్‌కుమార్, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
దసరా నవరాత్రులకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి
-
దైవదర్శనానికి వెళితే ఇల్లు దోచారు
సాక్షి, సఖినేటిపల్లి (తూర్పుగోదావరి) : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకొని ఆ కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంటిని దొంగలు దోచేశారు. వివరాల్లోకి వెళితే.. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులు గల్ఫ్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇద్దరు కోడళ్లు వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కుమార్తె అత్తవారింట్లో ఉంది. నాగేశ్వరరావు దంపతులు తొలి ఏకాదశి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకొనేందుకు శుక్రవారం వేకువజామున విజయవాడ వెళ్లారు. వారు తిరిగి శనివారం రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండడం గమనించిన నాగేశ్వరరావు ఇంట్లోకి వెళ్లకుండా కిటికీలోంచి చూసేసరికి బీరువాలో బంగారం దాచుకున్న బ్యాగ్ మంచంపై ఖాళీగా కనిపించింది. దాంతో దొంగలు పడ్డారని గ్రహించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు తీసుకునేంతవరకు నాగేశ్వరరావు దంపతులు బయటే ఉన్నారు. రాజోలు సీఐ కేఎన్ మోహన్‌రెడ్డి ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించి సంఘటన జరిగిన తీరుపై నాగేశ్వరరావును ఆరా తీశారు. కాకినాడ నుంచి ఆదివారం వచ్చిన క్లూస్ టీమ్‌తో పాటుగా నాగేశ్వరరావు దంపతులు ఇంట్లోకి వెళ్లారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించింది. దొంగలు ఇనుప బీరువాలను బద్దలుకొట్టి వాటిలోని బట్టలు, ఆభరణాలు దాచుకున్న సొరుగులు మంచంపై పడేశారు. రూ. 2 లక్షలు విలువ చేసే 70 గ్రాముల బంగారు ఆభరణాలు, పది తులాల వెండి ఆభరణాలు, నగదు రూ. లక్ష, ఎలక్ట్రికల్ సామగ్రి పోయినట్టు నాగేశ్వరరావు పోలీసులకు తెలిపారు. నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పీవీఎస్‌ఎస్‌ఎన్ సురేష్ తెలిపారు. -
దేవుడి ఆశీస్సులతో..
సాక్షి, తిరుపతి/తిరుమల/కడప/గన్నవరం/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజంతా దైవార్చన, ప్రార్థనల్లో పాల్గొన్నారు. తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కడప పెద్ద దర్గా, పులివెందుల సీఎస్ఐ చర్చి లో ప్రార్థనలు జరిపారు. తరువాత ఇడుపులపాయ చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకుని పూజలు జరిపారు. సామాన్య భక్తుడిలా తిరుమలకు.. సంప్రదాయ దుస్తులు, నుదుటిన తిరునామం ధరించి సామా న్య భక్తుడిలా తిరుమల శ్రీవారిని వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠం–1 నుంచి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభానికి నమస్కరించి.. వెండివాకిలి దాటుకుని బంగారు వాకిలి మీదు గా గర్భాలయంలోకి ప్రవేశించారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా మేలు చేయాలని.. ప్రజారంజక, సుపరిపాలన అందిం చేలా తనను ఆశీర్వదించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నారు. అనంతరం వకుళామాతను, ఆలయ ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వరస్వామిని, సబేరా, భాష్యకార్ల సన్నిధి, యో గ నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమ ర్పించుకున్నారు. శ్రీవారి సేవలో గడిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచ నం అందించారు. శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని అందించారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమి రెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బియ్యపు మధు సూదన్‌రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్‌గౌడ్, నవాజ్ బాషా, ఎంఎస్ బాబు, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఉన్నారు. ఏ కార్యక్రమమైనా చేపట్టేముందు భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం వైఎస్ జగన్‌కు ఆనవా యితీ. పాదయాత్రకు ముందు, ముగిసిన తర్వాత కూడా ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందుగా శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం రోడ్డు మార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో వైఎస్సార్ కడప పయనమయ్యారు. కడప పెద్ద దర్గాలో ప్రార్థన చేస్తున్న వైఎస్ జగన్ కడప పెద్ద దర్గాలో.. ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లా వైఎస్సార్ కడపకు వచ్చారు. కడప ఎయిర్ పోర్టు నుంచి 11.55 గంటలకు పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ వైఎస్ జగన్‌ను సాదరంగా ఆహ్వానించి.. సంప్రదాయాన్ని పాటిస్తూ తలపాగా చు ట్టారు. అనంతరం ఆయన హజరత్ పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకుని చాదర్, పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత దర్గా ఆవరణలోని ఇతర గురువులు, మజార్లను కూడా దర్శించి ఫాతెహా చేశారు. దర్గా పీఠాధిపతి వైఎస్ జగన్‌కి గురువుల విశిష్టతను తెలియజేసి, జ్ఞాపికతో సత్కరించారు. పీఠాధిపతితో సమావేశమై ఆశీస్సులు తీసుకున్నారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో జగన్‌ను దీవిస్తున్న పాస్టర్లు సీఎస్ఐ చర్చిలో.. పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కల సి సీఎస్ఐ చర్చిలో బిషప్ వరప్రసాద్‌బాబు, పాస్టర్ జెనహర్బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇడుపులపాయలో.. అక్కడి నుంచి ఇడుపులపాయ చేరుకుని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు విజయసా«యిరెడ్డి, కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్బీ అంజాద్‌బాషా, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ గూడూరు రవి, వైఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నేతలు అంజద్‌బాషా, అవినాశ్‌రెడ్డి, రాచమల్లు, రఘురామిరెడ్డి, ఆకేపాటి, విజయసాయిరెడ్డి, కొరుముట్ల తదితరులు ఆప్యాయంగా పలకరిస్తూ.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీటీడీ అధికారులు, అర్చకులను పేరుపేరునా ‘బాగున్నారా’అంటూ ఆప్యాయంగా పలకరించారు. కడప, పులివెందుల, ఇడుపులపాయలోనూ తనను చూడటానికి వచ్చిన వారందరినీ పలకరించారు. ‘ఏమన్నా ఎలా ఉన్నావ్... చిన్నాన్నా బాగున్నావా.. మామయ్యా ఆరోగ్యం ఎలా ఉంది.. పెద్దనాన్నా బాగున్నావా.. ఆరోగ్యం జాగ్రత్త’అంటూ అందరి యోగక్షేమాలను ఆరా తీశారు. తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పోటెత్తగా.. మరోవైపు రక్త సంబంధీకులు, ఆత్మబంధువులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి ఆశీర్వాదాలు అందుకుని విజయవాడకు బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కడప జిల్లాల్లో రెండు రోజుల పర్యటనను పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పలువురు అధికారులు స్వాగతం పలికారు. రన్‌వే నుంచి కాన్వాయ్‌లో బయటకు వచ్చిన ఆయన స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లారు. బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు పట్టువస్త్రాలు తీసుకువస్తున్న నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దుర్గమ్మకు చీర, పసుపు–కుంకుమ సమర్పణ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ ఈ వో వి.కోటేశ్వరమ్మ, ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్, స్థానాచార్య వి.శివప్రసాద్ ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అర్చకులు వైఎస్ జగన్ శిరస్సుకు పరివట్టం ధరింపచేశారు. మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ పూ ర్ణకుంభంతో ఆలయంలోకి తీసుకువెళ్లారు. అమ్మవారిని ద ర్శించుకున్న జగన్మోహన్రెడ్డి అమ్మవారికి పట్టుచీర, పసు పు, కుంకుమ, పండ్లు, పూలు సమర్పించారు. ఆయన గోత్రనామాలతో అమ్మవారికి ఖడ్గమాల స్తోత్ర పూజలు చేసిన అర్చకులు కోటా ప్రసాద్, కోటా రవి, రంగావఝల శ్రీనివాసశాస్త్రి హారతులు ఇచ్చారు. ఆలయం తరఫున అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలతోపాటు పంచ ప్రసాదాలను దేవాదా య కమిషనర్ ఎం.పద్మ అందజేశారు. పుస్తక రూపంలో ముద్రించిన సుప్రభాత సేవ స్తోత్రాలను జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ ఉన్నారు. -
ఆయన నా ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తున్ని: నటుడు
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి! ప్రాణాలు అడిగినా ఇచ్చేంత భక్తుడినని సినీనటుడు పృధ్వీరాజ్ అన్నారు. గురువారం ఆయన విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తున్నానని అన్నారు. అమ్మకొండపై అధికారుల అత్యుత్సాహం తగదని, రాజను, భటుడును ఒకేలా చూడాలని సూచించారు. అధికార పార్టీల నేతల సిఫార్సులు ఉంటేనే గౌరవిస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ వస్తే అధికారుల దౌర్జన్యాలు ఉండవని అన్నారు. ‘రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి జగనే. రాబోయే ఎన్నికల అనంతరం రెడ్ లైట్ పెట్టుకొని టెంపుల్ రావాలని కోరుతున్నా. అధికారుల కన్నా వాలంటీర్ల సేవలే అమోఘం, అమ్మవారు వారినే దీవిస్తుంది.’ -
దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు
విజయవాడ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం సింధు తన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వెళ్లింది. అధికారులు ఆలయ మర్యాదలతో సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సింధు కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఫొటోను బహూకరించారు. సింధు వెంట తల్లిదండ్రులు విజయ, రమణ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. -
ఆలయ అధికారులపై భక్తుల ఆగ్రహం
-
ఏం తమాషా చేస్తున్నావా?
-
ఏం తమాషా చేస్తున్నావా?
విజయవాడ: బెజవాడ కనకదుర్గ దేవాలయం ఈవో నర్సింగరావుపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. దాదాపు రూ. 25 లక్షల విలువైన బంగారు పాదుకలు కనకదుర్గ అమ్మవారికి సమర్పించేందుకు శ్రీ మిత్ర హౌసింగ్ చైర్మన్ ఎం వి చౌదరి ఆదివారం దుర్గమ్మ గుడికి విచ్చేశారు. ఆయనతోపాటు టాలీవుడ్ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు మంత్రి ప్రతిపాటి పుల్లారావు కూడా వచ్చారు. అయితే అదే సమయానికి ఈవో నర్సింగరావు ఆలయంలో అందుబాటులో లేరు. దాంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీఐపీలు వస్తున్నారని సమాచారం అందించిన ఈవో ఎక్కడికెళ్లాడంటూ మంత్రి పుల్లారావు దేవాలయం సిబ్బందిపై మండిపడ్డారు. మంత్రి దేవాలయానికి వచ్చారన్న వార్త తెలుసుకున్న ఈవో వెంటనే దేవాలయానికి వచ్చారు. ఆయన్ని చూస్తూ పుల్లారావు ఆగ్రహంతో ఊగిపోయారు. వీఐపీలు వస్తున్నారని సమాచరం ఉండి కూడా నీవు బయటకు ఎలా వెళ్లావంటూ ప్రశ్నించారు. ఏం తమాషాలు చేస్తున్నావా అంటూ ఈవో నర్సింగరావుపై మండిపడ్డారు.