
ప్రశ్న: ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ వంటి పెద్ద పెద్ద పోటీల ఫైనల్స్‌లో మీరు గెలవలేకపోతున్నారు! ఇకముందైనా ఓడిపోకుండా ఉండేందుకు మీరేం చేయబోతున్నారు?
పి.వి.సింధు : నేను చాలా ఆకలిగా ఉన్నాను. బిగ్ టైటిల్స్ కొట్టాలని రగిలిపోతున్నాను. అలాగని బాధలో ఏం లేను. నాకు తెలుసు.. ఏదో ఒక రోజు నేను గెలిచి తీరుతాను. ఓడినా, గెలిచినా వంద శాతం గెలిచి తీరేందుకే నేను ఆడతాను. మిగతా ప్లేయర్లు తక్కువేం కాదు. అవతలి వైపుకు మనం కొట్టే స్ట్రోక్స్ బట్టి విజయావకాశాలు ఉంటాయి. అనూహ్యంగా జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మిస్సింగ్స్ కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. చైనాలోని నంజింగ్‌లో సోమవారం ప్రారంభం అవుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్న వరల్డ్ నం.3, గతేడాది రన్నరప్ అయిన పి.వి.సింధు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానం.
►స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో గత ఏడాది జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఉమెన్స్ సింగిల్స్ పోటీలలో పి.వి.సింధు రన్నరప్‌గా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment