బ్యాంకాక్: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్ 500 టోర్నీ థాయిలాండ్ ఓపెన్‌లో భారత టాప్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–13 స్కోరుతో సిమ్ యు జిన్ (కొరియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో సింధు ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది.
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ మ్యాచ్ ఆడకుండానే ‘వాకోవర్’ ఇవ్వడంతో అతని ప్రత్యర్థి ఎన్‌హట్ గుహెన్ (ఐర్లాండ్) ముందంజ వేశాడు. శ్రీకాంత్ పొత్తి కండరాలు పట్టేయడంతో కోర్టులోకి దిగక ముందే తప్పుకున్నాడు. లెవెర్డెజ్‌తో జరిగిన తొలి రౌండ్‌లోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నా...ఎలాగోలా మ్యాచ్‌ను ముగించగలిగాడు. ఇతర మ్యాచ్‌లలో భారత షట్లర్ల ఆట ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్, మహిళల డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ జోడి, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్, తనీషా క్రస్టో జంట ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment