Kidambi Srikanth: హైలో ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–11, 12–21, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలుపొందాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో శ్రీకాంత్ ఆడతాడు.
ఆకాశ్‌కు కాంస్యం
బెల్‌గ్రేడ్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. 54 కేజీల విభాగం సెమీఫైనల్లో 21 ఏళ్ల ఆకాశ్ 0–5తో మక్మూద్ సబీర్‌ఖాన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన ఆకాశ్‌కు 25 వేల డాలర్ల (రూ. 18 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. హరియాణాలోని భివాని జిల్లాకు చెందిన ఆకాశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం నెగ్గిన ఏడో భారత బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధూరి (2017), మనీశ్ కౌశిక్ (2019) కాంస్యాలు నెగ్గగా... అమిత్ పంఘాల్ (2019) రజతం సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment