ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment