Indonesian Masters
-
Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్‌పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్‌లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు. -
ఇండోనేసియా గ్రాండ్ ప్రీ విజేత ప్రణయ్
పాలెంబంగ్ (ఇండోనేసియా): భారత యువ షట్లర్ ప్రణయ్ ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రణయ్ 21-11, 22-20 స్కోరుతో స్థానిక ఆటగాడు ఫిర్మన్ అబ్దుల్ ఖిలిక్పై విజయం సాధించాడు. 43 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేమ్‌ల్లో మ్యాచ్ నెగ్గాడు. ప్రణయ్ కెరీర్లో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.