Indian star
-
హాలీవుడ్ థ్రిల్లర్
తెలుగు నటుడు వెంకట్ సాయి గుండ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ది డిజర్వింగ్’. ఎస్ఎస్ అరోరా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ స్టార్స్‌తో పాటు ఇండియన్ స్టార్స్ నటిస్తున్నారని యూనిట్ పేర్కొంది. విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్ ఇతర నిర్మాతలు. ‘‘హాలీవుడ్లో ప్రధాన పాత్రధారుడిగా ఒక తెలుగు కుర్రాడు నటించడం ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. విదేశీ యాక్టర్లు సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎన్జీఏ వెంగ్ చియా, సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా. -
డైమండ్ లీగ్ ఫైనల్స్ బరిలో నీరజ్
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్లో పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనున్నాడు. జ్యూరిక్‌లో ఈరోజు డైమండ్ లీగ్ ఫైనల్స్ జరగనుంది. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్‌తో కలిపి మొత్తం ఆరుగురు పోటీపడనున్నారు. 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. -
సెమీస్‌లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు. -
సెమీస్‌లో పంకజ్
బెంగళూరు: ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ 150 అప్ ఫార్మాట్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ 5-2 (150-0, 150-0, 150-5, 89-150, 107-150, 150-69, 150-128) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించాడు. భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారి, అలోక్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోగా... మరో ప్లేయర్ ధ్వజ్ హరియా 5-3తో చిట్ కూ కూ (మయన్మార్)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్)తో ధ్వజ్ హరియా; ఆంగ్ హెచ్‌టే (మయన్మార్)తో పంకజ్ అద్వానీ తలపడతారు. -
ఐఎస్ఎల్ వేలానికి చెత్రి
ముంబై : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రితో పాటు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు.. ఐఎస్ఎల్ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. జూలై 10న ఈ వేలం జరగనుంది. చెత్రి కనీస విలువ రూ. 80 లక్షలు కాగా గోల్ కీపర్ కరణ్‌జీత్ సింగ్ కనీస ధర రూ. 60 లక్షలు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. గతేడాది ఐ-లీగ్ క్లబ్స్‌తో ఉన్న వ్యక్తిగత ఒప్పందం మేరకు చెత్రి వేలానికి అందుబాటులో ఉండలేదు. అయితే ఈసారి వేలంపై ఈ యువ స్ట్రయికర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. రాబిన్ సింగ్, ఆర్తజా ఇజుమి, అనాస్‌లు రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో; తోయ్ సింగ్ రూ. 39 లక్షలు, ఎగున్సెన్ లింగ్డో రూ. 27.50 లక్షల కనీస ధరతో వేలానికి వస్తున్నారు. -
యోగేశ్వర్ దత్‌కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం సాధించాడు. యోగేశ్వర్‌తోపాటు అమిత్ దహియా (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందించారు. -
సైనా మా జట్టుకు బలం
- ఉబెర్ కప్‌లో రాణిస్తాం - పీవీ సింధు వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత స్టార్ సైనా నెహ్వాల్‌తో కలిసి ఉబెర్ కప్‌లో రాణిస్తానని ఏపీ రైజింగ్ స్టార్ పీవీ సింధు తెలిపింది. త్వరలో జరిగే ఈ టీమ్ ఈవెంట్లో హైదరాబాదీలిద్దరు కలిసి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుండటం ఇదే తొలిసారి. దీనిపై ఈ తెలుగమ్మాయి మాట్లాడుతూ జట్టుకు సైనా నెహ్వాల్ బలమని చెప్పింది. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్ఖేల్త్న్ర’కు తనను నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్, మహిళల విభాగంలో ఉబెర్ కప్ టీమ్ టోర్నీలు ఈ నెల 18 నుంచి 25 వరకు ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్‌లో జరుగనున్నాయి. ‘ఉబెర్ కప్‌లో భారత బృందం పటిష్టంగా ఉంది. సైనా తొలి సింగిల్స్‌లో శుభారంభమిస్తే... నేను రెండో సింగిల్స్‌లో సత్తాచాటుతా. అప్పుడు జట్టుకు ఫలితాలు కలిసి వస్తాయి. డబుల్స్‌లోనూ భారత క్రీడాకారిణులు రాణించేందుకు చక్కని అవకాశాలుంటాయి’ అని సింధు విశ్లేషించింది. టీమ్ టోర్నమెంట్ దృష్టా ప్రస్తుతం భారత పురుషుల, మహిళల జట్లకు ఆతిథ్య వేదిక వద్దే వారం పాటు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరంలో భారత కోచ్ పుల్లెల గోపీచంద్, విమల్ కుమార్, మధుమిత బిస్త్‌లు తమ ఆటతీరుకు మెరుగులు దిద్దుతున్నారని సింధు చెప్పింది. తాము తరచూ చేసే తప్పులను సరిదిద్దుతున్నారని 19 ఏళ్ల టీనేజ్ సంచలనం పేర్కొంది. మిగతా టోర్నీలకు ఈ టీమ్ చాంపియన్‌షిప్ భిన్నమైనదని తెలిపింది. ఆయా టోర్నీల్లో తమకు తాము వ్యక్తిగతంగా గెలిస్తే చాలనుకుంటామని... ఇక్కడ (ఉబెర్) మాత్రం సమష్టిగా గెలవాలనే కసితో బరిలోకి దిగుతామంది. సొంతగడ్డపై టోర్నీ జరగనుండటం తమకు కలిసివస్తుందని, ప్రేక్షకుల మద్దతుతో ముందంజ వేస్తామని సింధు చెప్పింది.