హాలీవుడ్‌ థ్రిల్లర్‌ | Telugu Actor Venkata Sai Gunda Debuts In Hollywood | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ థ్రిల్లర్‌

Published Sun, Sep 17 2023 6:18 AM | Last Updated on Sun, Sep 17 2023 6:18 AM

Telugu Actor Venkata Sai Gunda Debuts In Hollywood - Sakshi

తెలుగు నటుడు వెంకట్‌ సాయి గుండ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం హాలీవుడ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ది డిజర్వింగ్‌’. ఎస్‌ఎస్‌ అరోరా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు ఇండియన్‌ స్టార్స్‌ నటిస్తున్నారని యూనిట్‌ పేర్కొంది.

విస్మయ్‌ కుమార్, తిరుమలేష్‌ గుండ్రాత్‌ ఇతర నిర్మాతలు. ‘‘హాలీవుడ్‌లో ప్రధాన పాత్రధారుడిగా ఒక తెలుగు కుర్రాడు నటించడం ఇదే మొదటిసారి కావొచ్చు. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. విదేశీ యాక్టర్లు సిమోన్‌ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్‌ కీలక పాత్రలు ΄ోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎన్‌జీఏ వెంగ్‌ చియా, సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement