న్యూఢిల్లీ: విశాఖపట్నం ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనపై భారత క్రికెటు జట్టు సారథి విరాట్ కోహ్లి, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విరాట్ స్పందిస్తూ.. ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిలు వెంటనే కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఇక టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా స్పందిస్తూ.. ‘‘వైజాగ్‌లో గురువారం ఉదయంచోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమైనది. ఈ ఘటన బాధితుల పరిస్థితి ఎలా ఉందో తలచుకుంటే చాలా బాధగా ఉంది. వారు త్వరలోనే కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులలో ఆ దేవుడు ఆత్మస్థైర్యం నింపాలని పార్థిస్తున్నాను.. #prayforvizag’’ అంటూ ట్వీట్ చేశారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)
ఇక మహిళ క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ హర్మన్ ప్రీత్‌కౌర్ గురువారం ఉదయం వైజాగ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ ఘటనపై పలు భారత క్రికెట్ దిగ్గజాలలు హార్దిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఇక భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ‘‘వైజాగ్ గ్యాస్ ఘటన వీడియోలు చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది. వారు త్వరలోనే ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అని సంతాపం వ్యక్తం చేశారు. (ఏంటిదా గ్యాస్.. పీల్చితే ఏమవుతుంది?)
కాగా గురువారం ఉదయం విశాఖలో చోటుచేసుకున్న ఎల్‌జీ పాలిమర్ కర్మాగారం నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 11 మంది మృతి చెందగా... ఈ కర్మాగారం చూట్టుపక్కల సమీపంలో నివస్తిస్తున్న సుమారు 1000 మంది అస్వస్థతకు గురియ్యారు. ఇక 3 కిమీ వ్యాసార్థంలో ఉన్న సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment