డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్‌ను మంగళవారం ప్రారంభిస్తున్న డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని క్రాస్‌చెక్ చేసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9071666667ను అందుబాటులోకి తెచ్చింది. సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఈ వాట్సాప్ నంబర్‌ను డీజీపీ గౌతం సవాంగ్, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తదితరులు బుధవారం పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ వీడియో ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవి శేషు, సామాజిక కార్యకర్త కొండవీటి సత్యవతిలు ఆన్‌లైన్‌లో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
► సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వాట్సాప్ చేస్తే ...ఆయా వర్గాల వివరణ తీసుకొని వాస్తవ సమాచారం అందిస్తాం.
► నిజాలను ప్రచారం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తాం. సమాచారంలో నాణ్యత కావాల్సిన సమయం ఇది.
► చాలా మంది కావాలని తప్పుడు ప్రచారం చేసేవారు తప్పించుకోలేరు. ఆలస్యమైనా శిక్ష తప్పకుండా పడుతుంది.
► లాక్‌డౌన్ సమయంలో మహిళా బాధితులకు అండగా ఉంటాం.
ఎంతో మందికి ఉపయోగం
కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేసేందుకు పోలీసు శాఖ వాట్సాప్ నంబర్ తీసుకరావడం ఎంతో మందికి ఉపయోగం.
–పీవీ సింధు, బాడ్మింటన్ క్రీడాకారిణి
వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
సెలబ్రిటీలు, మహిళలపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ పరిజ్ఞానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంట్లో కుటుంబ పెద్దలు కూడా చాలా సార్లు తప్పుడు ప్రచారాన్ని నమ్ముతుంటారు. వీటిని అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
– అడవి శేష్, సినీ నటుడు
Comments
Please login to add a commentAdd a comment