
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన కిడాంబి శ్రీకాంత్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నజరానా ప్రకటించింది. ‘శ్రీకాంత్ సాధిస్తున్న విజయాలకు మేమెంతో గర్విస్తున్నాం.
భవిష్యత్‌లో భారత్ నుంచి మరింత మంది ఆటగాళ్లు అంతర్జాతీయస్థాయిలో టైటిల్స్ గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాం’ అని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మంగళవారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ప్రణయ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment