జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment