ఆ నటితో సినిమా చే​యాలని ఉంది : విల్‌ స్మిత్‌ | Will Smith Wants To Do A Film With This Bollywood Actress | Sakshi
Sakshi News home page

ఆ నటితో సినిమా చే​యాలని ఉంది : విల్‌ స్మిత్‌

Oct 6 2018 6:42 PM | Updated on Oct 6 2018 6:44 PM

Will Smith Wants To Do A Film With This Bollywood Actress - Sakshi

హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : హాలీవుడ్‌ ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ యాక్టర్‌’ ఎవరూ అంటే ఠక్కున విల్‌ స్మిత్‌ అని చెప్పేస్తాం. నటుడిగా, నిర్మాతగా, కమెడియన్‌గా, గేయ రచయితగా స్మిత్‌ హాలీవుడ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ నటుడికి, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌తో సినిమా చేయాలని ఉందట. హిందూస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమిట్‌లో నటుడు-మ్యూజిషియన్‌ ఫర్హాన్‌ అక్తర్‌తో మాట్లాడుతూ.. తన ఇష్టాన్ని విల్‌ స్మిత్‌ బయటికి చెప్పారు.

దాదాపు 15 ఏళ్ల క్రిందట విల్‌ స్మిత్‌, ఐశ్వర్యను కలిశారట. ఆ సమయంలోనే ఇద్దరం కలిసి ఏదైనా చేద్దామని అనుకున్నమని, కానీ అది ఇప్పటి వరకు జరుగలేదని, బహుశా ఆమెతో కలిసి తాను సినిమా చేస్తానేమో అని తన మనసులోన మాటను బయటపెట్టారు. ఇలా ఐశ్వర్య రాయ్‌తో సినిమా చేయాలని ఉందనే ఇష్టాన్ని తెలియజేశారు. ఈ సమయంలోనే విల్‌ స్మిత్‌తో ఫర్హాన్‌ అక్తర్‌, భాంగ్రా స్టెపులను వేయించారు‌.  విల్‌ స్మిత్‌తో సంభాషించడం చాలా సంతోషభరితంగా ఉందని, విత్‌ స్మిత్‌ వేసిన భాంగ్రా స్టెపుల వీడియోను ఫర్హాన్‌ అక్తర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

మహమ్మద్‌ అలీ బయోపిక్‌లో విల్‌ స్మిత్‌, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ ఆన్‌స్క్రీన్‌లో బాక్సింగ్‌ ఛాంపియన్‌ క్యారెక్టర్‌లో నటించడం, నా కెరీర్‌లోనే ఎంతో నిర్మాణాత్మక సమయం. ఇది నన్ను పూర్తిగా మార్చేస్తుంది’ అని తెలిపారు. ఐయామ్‌ లెజెండ్‌, ఐ, రోబోట్‌, ఇండిపెండెన్స్‌ డే, మెన్‌ ఇన్‌ బ్లాక్‌ వంటి సినిమాల్లో విల్‌ స్మిత్‌ అద్భుతంగా నటించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement