అవును ఫర్హాన్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ | Javed Akhtar Clarity On His Son And Actor Farhan Akhtar Second Marriage | Sakshi
Sakshi News home page

Farhan Akhtar- Javed Akhtar: అవును ఫర్హాన్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు: జావేద్‌ అక్తర్‌ క్లారిటీ

Published Fri, Feb 4 2022 4:10 PM | Last Updated on Fri, Feb 4 2022 4:47 PM

Javed Akhtar Clarity On His Son And Actor Farhan Akhtar Second Marriage - Sakshi

Javed Akhtar Confirms Actor Farhan Akhtar Second Marriage: బాలీవుడ్ విలక్షణ న‌టుడు ఫ‌ర్హాన్ అక్త‌ర్‌ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016లో తన భార్య అధునా బ‌బానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్‌ అప్పటి నుంచి సింగ‌ర్‌ శిబానీ దండేక‌ర్‌తో సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నాడు.  ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న‌ వీళ్లు పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఫర్హాన్‌ స్పందించలేదు. అంతేకాదు రెండో పెళ్లిపై కూడా ఎలాంటి ప్రకటన ఇ‍వ్వలేదు.

చదవండి: హీరోయిన్‌ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్‌ వైరల్‌

దీంతో ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అని అందరిలో సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో ఫర్హాన్‌ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌ క్వారిటీఇ ఇచ్చాడు. ఇటీవలో ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఫర్హాన్‌ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అవును ఫర్హాన్‌ పెళ్లి చేసుకోబోతున్నాడని స్పష్టం చేశాడు. ‘అందరూ అనుకుంటున్నట్లుగానే ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ముహుర్తానికి డేట్‌ ఫిక్సైయింది. ఈ పెళ్లికి పెద్దగా ఎవరిని ఆహ్వానించడం లేదు. కొద్దిమంది సన్నిహితులు, బంధువులను మాత్రమే పిలిచాం. కరోనా పరిస్థితులు నేపథ్యంలో వారి పెళ్లిని నిరాండబరంగా ప్లాన్‌ చేసుకున్నారు’ అని జావేద్‌ అక్తర్‌ తెలిపాడు. 

చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..

ఇక తన కాబోయే కోడలు శిబానీపై జావేద్‌ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ మేరకు ఆయన శిబాని చాలా మంచి అమ్మాయి. మా కుటుంబ సభ్యులకు కూడా తను బాగా నచ్చింది. వారిద్దరికి ఎంతో కాలంగా పరిచయం ఉంది, వారిద్దరి రిలేషన్‌ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఫర్హాన్‌, శిబానిలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్‌లో ఉ‍న్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవ‌త్స‌రంలో అధునా బ‌బానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ‌న్మించారు. ప‌ద‌హారేళ్లు క‌లిసి మెలిసి ఉన్న ఈ దంప‌తుల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో 2016లో విడాకులు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement