Javed aktar
-
అవును ఫర్హాన్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వధువు: తండ్రి క్లారిటీ
Javed Akhtar Confirms Actor Farhan Akhtar Second Marriage: బాలీవుడ్ విలక్షణ నటుడు ఫర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి సిద్దమవుతున్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016లో తన భార్య అధునా బబానీకి విడాకులు ఇచ్చిన ఫర్హాన్ అప్పటి నుంచి సింగర్ శిబానీ దండేకర్‌తో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 21న వీళ్లు పెళ్లి పీటలెక్కబోతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఫర్హాన్ స్పందించలేదు. అంతేకాదు రెండో పెళ్లిపై కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. చదవండి: హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న, తీవ్రంగా స్పందించిన హీరో.. పోస్ట్ వైరల్ దీంతో ఈ వార్తలో నిజం ఉందా? లేదా? అని అందరిలో సందేహం మొదలైంది. ఈ నేపథ్యంలో ఫర్హాన్ రెండో పెళ్లిపై ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ క్వారిటీఇ ఇచ్చాడు. ఇటీవలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు ఫర్హాన్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. అవును ఫర్హాన్ పెళ్లి చేసుకోబోతున్నాడని స్పష్టం చేశాడు. ‘అందరూ అనుకుంటున్నట్లుగానే ఫిబ్రవరి 21వ తేదీన పెళ్లి ముహుర్తానికి డేట్ ఫిక్సైయింది. ఈ పెళ్లికి పెద్దగా ఎవరిని ఆహ్వానించడం లేదు. కొద్దిమంది సన్నిహితులు, బంధువులను మాత్రమే పిలిచాం. కరోనా పరిస్థితులు నేపథ్యంలో వారి పెళ్లిని నిరాండబరంగా ప్లాన్ చేసుకున్నారు’ అని జావేద్ అక్తర్ తెలిపాడు. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇక తన కాబోయే కోడలు శిబానీపై జావేద్ ప్రశంసలు కురిపించాడు. ‘ఈ మేరకు ఆయన శిబాని చాలా మంచి అమ్మాయి. మా కుటుంబ సభ్యులకు కూడా తను బాగా నచ్చింది. వారిద్దరికి ఎంతో కాలంగా పరిచయం ఉంది, వారిద్దరి రిలేషన్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కాగా ఫర్హాన్, శిబానిలకు 2018లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ అక్తర్ 2000 సంవత్సరంలో అధునా బబానీని పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పదహారేళ్లు కలిసి మెలిసి ఉన్న ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. -
భారత సినీ చరిత్రలో ‘థప్పడ్’ మైలురాయి
అనుభవ సిన్హా దర్శకత్వంలో హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘థప్పడ్’ చిత్రం ఈనెల 28న విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలైనప్పటీ నుంచి బాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు అనుభవ్ సిన్హా, తాప్సీలపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా చూసిన ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ‘థప్పడ్’ను ప్రశంసిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. ‘ఈ రోజు నేను సామాజిక అంశాల పట్ల సున్నితమైన భావాలను చూపించిన ‘థప్పడ్’ చూశాను. భారత సినీ చరిత్రలో ఈ సినిమాను ఓ మైలు రాయిగా చెప్పుకోవచ్చు. ఇంతటి విజయాన్ని సాధించిన దర్శకుడికి, నటీనటులకు నా అభినందనలు’ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. తొలితాప్సీ అనొచ్చు కదా నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహీర్ కశ్యప్ కూడా ఈ సినిమాను, తాప్సీని ప్రశంసించారు. ‘థప్పడ్ అద్బుతమైన చిత్రం. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలన్నింటిలో ‘థప్పడ్’ ప్రత్యేకమైనది. ఈ సినిమా చూసిన అన్ని రకాల ప్రేక్షకులకు ‘థప్పడ్’ కథ ఉద్దేశమెంటో అర్థమవుతుంది. తాప్సీ గృహిణిగా అమృత పాత్రలో ఒదిగిపోయారు. ఆమె నటన నన్ను ఆకట్టుకుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో అమృత(తాప్సీ) భర్తగా పావైల్ గులాటి నటించారు. కాగా దియా మీర్జా, రత్న పాథక్ షా, కుముద్ మిశ్రా, తన్వి అజ్మీలు ప్రముఖ పాత్రల్లో కనిపించారు. Today I saw one of the most sensitive , sensible and socially relevant film of recent times Thappad is an extremely well told and well performed movie . My congratulations to the writers director performers and the whole crew for this Mile stone of Indian cinema . — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 -
బాలీవుడ్ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత
ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ కైఫీ ముంబయిలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ వెల్లడించారు. 93 ఏళ్ల షౌకత్ కైఫీ డ్రామా ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈమె ఉర్థూ కవి, పాటల రచయిత అయిన కైఫీ అజ్మీని వివాహం చేసుకున్నారు. వీరికి షబానా అజ్మీతో సినిమాటోగ్రఫర్ బాబా అజ్మీలు సంతానం. షౌకత్ కైఫీ గత కొంతకాలంగా గుండెసంబంధింత వ్యాధితో బాధపడుతున్నారని, ముంబయిలోని దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారని జావేద్ అక్తర్ వెల్లడించారు. వయసు మీద పడడంతో ఆమె శరీరీం చికిత్సకు సహకరించకపోవడంతో ముంబయిలోని తన నివాసానికి తీసుకువచ్చామని తెలిపారు. షౌకత్ కైఫీ తన తుదిశ్వాసను తన రూంలోనే విడవాలనుకుంటున్నట్లు మాకు చేస్సిందని తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో షౌకత్ కైఫీ తన గదిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. కాగా, షౌకత్ కైఫీ మరణించారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ట్విటర్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. Rest In Peace #ShaukatKaifi aapa 🙏 The old world of poetry,theatre and integrity coming to a closure bit by bit. pic.twitter.com/ak3Q38kEMh — Rajiv B Menon (@crypticrajiv) November 23, 2019 Love conquers all ❤#ShaukatKaifi 🌸 pic.twitter.com/4ASZ86jrle — Sheba Ghildyal(शैबा) (@ShebaGhildyal) November 23, 2019 -
అఖ్తర్ కుటుంబంలో ముగ్గురికి సాహిత్య అకాడమీ పురస్కారం
ముంబై: సుప్రసిద్ధ కవి,రచయిత, గేయ రచయిత జావేద్ అఖ్తర్ సాహెబ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఇటీవలే తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్న జావేద్‌కు అకాడమీ అవార్డు రావ డం ఆయన జీవితంలో ఒక ఆనందపు తెమ్మెర అంటూ పలువురు కొనియాడారు. జావేద్ అఖ్తర్ కవితా సంకలనం లావాకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డు ప్రకటిం చడం సంతోషం వచ్చి ఆయన పా దాల ముందు మోకరిల్లినట్లయిందని సాహితీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జావేద్‌ను పలకరించగా ‘‘ఒకే కుటుం బంలో ముగ్గురు వ్యక్తులకు సాహితీ అకాడమీ అవార్డు రావడం అరుదైన, ఆనందదాయకమైన విషయం, మా కుటుంబంలో ఈ అవార్డు అందుకుంటున్న వ్యక్తుల్లో నేను మూడోవాడిని. అకాడమీ ఆవార్డు 1976 తొలుత మా తండ్రి జన్ నిసార్ అఖ్తర్‌కు దక్కింది. ఆయన రచించిన ‘ఖాక్-ఎ-దిల్’ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చి సత్కరించారు. 1973 మా మామ కైఫీ అజ్మీని వరించింది. ఆయన రచించిన ‘ఆవారా సజ్దే’కు ఈ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇప్పుడు మూడోరుసలో నేను నా కవితా సంకలనం లావాకు ఈ పురస్కారం అందుకుంటున్నాను’’ చిరునవ్వుతో వివరించారు. ‘‘బహుశా కవి తండ్రి, అతని మామ అత్యున్నత పురస్కారం అందుకోవడం సాధ్యమైతే కావచ్చు. అదే వరుసలో మూడో వ్యక్తిగా వారి పుత్రుడికి అదే గౌరవం లభించడం మాత్రం అరుదైన విషయం’’ అని తెలిపారు. ఆయనను వెంటాడుతున్న వెన్నునొప్పిని గురించి గురించి ప్రశ్నించగా ‘‘ఇప్పటికీ వెన్ను కొంత బిగదీసినట్లుగా ఉంది. ఇప్పుడు ఈ ఆనందంతో అది ఎగిరిపోయింది. దేవుడు దయగలవాడు. ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. ఈ కొద్ది రోజులు అనుభవిస్తున్న నొప్పి, కదలిక లేనితనం గురించి ఫిర్యాదు చేయలేను’’ అని చిరునవ్వు నవ్వారు.