అఖ్తర్ కుటుంబంలో ముగ్గురికి సాహిత్య అకాడమీ పురస్కారం | Javed aktar gets central Literature academy award | Sakshi
Sakshi News home page

అఖ్తర్ కుటుంబంలో ముగ్గురికి సాహిత్య అకాడమీ పురస్కారం

Published Sat, Dec 21 2013 12:09 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Javed aktar gets central Literature academy award

ముంబై: సుప్రసిద్ధ కవి,రచయిత, గేయ రచయిత జావేద్ అఖ్తర్ సాహెబ్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఇటీవలే తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్న జావేద్‌కు అకాడమీ అవార్డు రావ డం ఆయన జీవితంలో ఒక ఆనందపు తెమ్మెర అంటూ పలువురు కొనియాడారు. జావేద్ అఖ్తర్ కవితా సంకలనం లావాకు కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డు ప్రకటిం చడం సంతోషం వచ్చి ఆయన పా దాల ముందు మోకరిల్లినట్లయిందని సాహితీ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు.
 
 ఈ సందర్భంగా జావేద్‌ను పలకరించగా ‘‘ఒకే కుటుం బంలో ముగ్గురు వ్యక్తులకు సాహితీ అకాడమీ అవార్డు రావడం అరుదైన, ఆనందదాయకమైన విషయం, మా కుటుంబంలో ఈ అవార్డు అందుకుంటున్న వ్యక్తుల్లో నేను మూడోవాడిని. అకాడమీ ఆవార్డు 1976 తొలుత మా తండ్రి జన్ నిసార్ అఖ్తర్‌కు దక్కింది. ఆయన రచించిన ‘ఖాక్-ఎ-దిల్’ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఇచ్చి సత్కరించారు. 1973 మా మామ కైఫీ అజ్మీని వరించింది. ఆయన రచించిన ‘ఆవారా సజ్దే’కు ఈ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇప్పుడు మూడోరుసలో నేను నా కవితా సంకలనం లావాకు ఈ పురస్కారం అందుకుంటున్నాను’’ చిరునవ్వుతో వివరించారు. ‘‘బహుశా కవి తండ్రి, అతని మామ అత్యున్నత పురస్కారం అందుకోవడం సాధ్యమైతే కావచ్చు. అదే వరుసలో మూడో వ్యక్తిగా వారి పుత్రుడికి అదే గౌరవం లభించడం మాత్రం అరుదైన విషయం’’ అని తెలిపారు. ఆయనను వెంటాడుతున్న వెన్నునొప్పిని గురించి గురించి ప్రశ్నించగా ‘‘ఇప్పటికీ వెన్ను కొంత బిగదీసినట్లుగా ఉంది. ఇప్పుడు ఈ ఆనందంతో అది ఎగిరిపోయింది. దేవుడు దయగలవాడు. ఆయన నాకు అన్నీ ఇచ్చాడు. ఈ కొద్ది రోజులు అనుభవిస్తున్న నొప్పి, కదలిక లేనితనం గురించి ఫిర్యాదు చేయలేను’’ అని చిరునవ్వు నవ్వారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement