బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత | Shabana Azmi Mother Shaukat Kaifi Passed Away Due To Cardiac Attack In Mumbai | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత

Published Sat, Nov 23 2019 4:09 PM | Last Updated on Sat, Nov 23 2019 4:09 PM

Shabana Azmi Mother Shaukat Kaifi Passed Away Due To Cardiac Attack In Mumbai - Sakshi

ముంబయి : బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ కైఫీ  ముంబయిలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు షబానా అజ్మీ భర్త జావేద్‌ అక్తర్‌ వెల్లడించారు. 93 ఏళ్ల షౌకత్‌ కైఫీ డ్రామా ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు పలు బాలీవుడ్‌ సినిమాలలో కూడా నటించారు. ఈమె ఉర్థూ కవి, పాటల రచయిత అయిన కైఫీ అజ్మీని వివాహం చేసుకున్నారు. వీరికి షబానా అజ్మీతో సినిమాటోగ్రఫర్‌ బాబా అజ్మీలు సంతానం.

షౌకత్‌ కైఫీ గత కొంతకాలంగా గుండెసంబంధింత వ్యాధితో బాధపడుతున్నారని, ముంబయిలోని దీరుబాయ్‌ అంబానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారని జావేద్‌ అక్తర్‌ వెల్లడించారు. వయసు మీద పడడంతో ఆమె శరీరీం చికిత్సకు సహకరించకపోవడంతో ముంబయిలోని తన నివాసానికి తీసుకువచ్చామని తెలిపారు. షౌకత్‌ కైఫీ తన తుదిశ్వాసను తన రూంలోనే విడవాలనుకుంటున్నట్లు మాకు చేస్సిందని తెలిపారు. అయితే  శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో షౌకత్‌ కైఫీ తన గదిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. కాగా, షౌకత్‌ కైఫీ మరణించారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ట్విటర్‌ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తూ ట్వీట్‌లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement