Shabhana Azmi
-
నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలు
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ముంబై- పూణే హైవే పై జరిగింది. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు... వెనుక నుంచి ఓ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ కూడా ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే గత రాత్రే షబానా తన భర్త 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు. మరోవైపు వారితో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. కారు డ్రైవర్ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బాలీవుడ్ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత
ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ కైఫీ ముంబయిలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ వెల్లడించారు. 93 ఏళ్ల షౌకత్ కైఫీ డ్రామా ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈమె ఉర్థూ కవి, పాటల రచయిత అయిన కైఫీ అజ్మీని వివాహం చేసుకున్నారు. వీరికి షబానా అజ్మీతో సినిమాటోగ్రఫర్ బాబా అజ్మీలు సంతానం. షౌకత్ కైఫీ గత కొంతకాలంగా గుండెసంబంధింత వ్యాధితో బాధపడుతున్నారని, ముంబయిలోని దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారని జావేద్ అక్తర్ వెల్లడించారు. వయసు మీద పడడంతో ఆమె శరీరీం చికిత్సకు సహకరించకపోవడంతో ముంబయిలోని తన నివాసానికి తీసుకువచ్చామని తెలిపారు. షౌకత్ కైఫీ తన తుదిశ్వాసను తన రూంలోనే విడవాలనుకుంటున్నట్లు మాకు చేస్సిందని తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో షౌకత్ కైఫీ తన గదిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. కాగా, షౌకత్ కైఫీ మరణించారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ట్విటర్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. Rest In Peace #ShaukatKaifi aapa 🙏 The old world of poetry,theatre and integrity coming to a closure bit by bit. pic.twitter.com/ak3Q38kEMh — Rajiv B Menon (@crypticrajiv) November 23, 2019 Love conquers all ❤#ShaukatKaifi 🌸 pic.twitter.com/4ASZ86jrle — Sheba Ghildyal(शैबा) (@ShebaGhildyal) November 23, 2019 -
మంత్రికి వీడియో ట్యాగ్.. నటి క్షమాపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కారణంగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రైల్వే మంత్రిత్వ శాఖకు క్షమాపణలు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్ గోయల్‌కు ట్యాగ్ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు. షబానా ట్వీట్‌కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్ ఈ వీడియో ఒక మలేషియన్ రెస్టారెంట్లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్ చేశారు. Mam, video is of Malaysian eatery which faces closure after video shows workers washing dishes in puddle of murky water: Link News is https://t.co/n6U2f9fMP0 — Ministry of Railways (@RailMinIndia) June 5, 2018 -
సమానం అంటే సగమని కాదు
షబానా అజ్మీ.. బాలీవుడ్ నటి మాత్రమే కాదు.. సామాజిక రుగ్మతలపై తనదైన గొంతును వినిపించే సోషల్ యాక్టివిస్ట్. మహిళా సమస్యలపై, ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలపై నిరసన గళం వినిపించే రెబల్‌స్టార్. నలభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఏకంగా ఐదు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరు. ఇటీవల ఓ చర్చావేదికలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన షబానా ‘సిటీప్లస్’తో తన మనోభావాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. శ్రావణ్ జయ ప్రస్తుతం మన దేశంలో స్త్రీలపై అత్యాచారం జరగని రాష్ట్రాన్ని చూపించగలరా? ఎప్పుడో ఒకప్పుడు కాదు. ప్రతిరోజూ.. ఇంకా చెప్పాలంటే ప్రతి గంటకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ, మానవ హక్కుల కోసం గతంలో పోరాడాను. నేటి మహిళ స్థితి ఇంకా దీనావస్థలో ఉంది. గతంలో స్త్రీలపై అత్యాచారం జరిగితే పోలీసుల రికార్డుల్లో మాత్రమే నమోదయ్యేది. నేరం చేసినవారికి శిక్ష పడిన దాఖలాలు కూడా చాలా తక్కువ. అయితే నిర్భయ చట్టం వచ్చాక పెద్ద సంఖ్యలో యువత వీధుల్లోకి రావడం, స్త్రీల ర క్షణ గురించి కొంతమేరకైనా మాట్లాడటం హ ర్షించదగ్గ విషయం. కాని ‘నిర్భయ’, ‘బేటీ బచావో’ లాంటి చట్టాలు వచ్చాక కూడా అకృత్యాలు జరగడం విచారకరం. చట్టాలు చేసినంత మాత్రాన నేరాలు అదుపులోకి రావు. స్త్రీని గౌరవంగా చూడాలన్న నైతిక ప్రేరణ కలిగించడం ముఖ్యం. అది ప్రతి ఒక్కరూ అనివార్యంగా తెలుసుకోవాలి. నేటికీ బాల్య వివాహాలు.. స్త్రీ, పురుష విభేదాలు అతి ఎక్కువగా ఉన్న మనదేశంలో సమానత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదమైన అంశం. నా తల్లిదండ్రులిద్దరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. నాన్న (కైఫీ అజ్మీ), అమ్మ (షౌకత్ అజ్మీ).. వారిద్దరి భావోద్వేగాలు నాలోనూ ఉన్నాయి. అందుకే నటిగా బిజీగా ఉన్నా కూడా సామాజిక రుగ్మతలపై పోరాటం చేశా. నేటికీ 12 ఏళ్ల బాలికలకు పెళ్లి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా ఆడపిలల్ని కనడంలో అయిష్టత చూపిస్తున్నారు. ఒకవైపు పురిటిలోనే చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆడశిశువు అని తెలియగానే గర్భంలోనే బిడ్డను చంపేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. సమానత్వం అంటే జనాభాలో సగం మహిళలు ఉండటం కాదు.. హక్కుల్లో, అన్నింటా మహిళలకు సగ భాగం ఉండాలి కదా! ప్రాధాన్యమివ్వని సినిమా... సినిమాల్లో ఆడవాళ్లను ఆటబొమ్మలుగా చూపించే దౌర్భాగ్యం నుంచి దర్శకనిర్మాతలు బయటికి రావాలి. మన చిత్రాల్లో రానురాను మహిళలకు ఇంపార్టెన్స్ తగ్గుతోంది. ఏదో ఒకటి, రెండు తప్ప అన్ని సినిమాల స్క్రిప్టులు హీరోలను దృష్టిలో పెట్టుకుని రాసేవే. నే ను దాదాపు 120 సినిమాల్లో నటించాను. ప్రతి సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటా. ప్రస్తుతం ‘జబా’్జ అనే సినిమాలో నటిస్తున్నాను. మన సినిమాలు ప్రాక్టికల్‌గా, రియాలిటీ కి దగ్గరగా ఉండాలి. ఇండియన్ సినిమాలో సెన్సారింగ్ అంటే మాటల్ని, దృశ్యాల్ని కట్ చేయడమే. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఇప్పటికీ బ్రిటిష్ సెన్సారింగ్ విధానాన్ని అనుసరిస్తోంది. కాని సెన్సార్ చేయడం అంటే ‘కట్’ చేయడం మాత్రమే కాదు. ఏదైనా దృశ్యం అభ్యంతరకరంగా కాని, నిబంధనలను ఉల్లఘించే విధంగా కాని ఉంటే కట్ చేయాలి. అలాకాక ప్రేక్షకుల వయసు, విచక్షణ జ్ఞానానికి సంబంధించిన దృశ్యాలు ఉంటే వాటిని కట్ చేయడం కంటే ఆ చిత్రానికి రేటింగ్ మార్చి ఇవ్వాలి. అమెరికాలో చిత్రాలకు ఇదే తరహాలో సెన్సార్ విధానాన్ని పాటిస్తున్నారు. -
హఠాత్తుగా ఒక రోజు... ఏక్ దిన్ అచానక్....
బడబడమని కురుస్తున్న వర్షం. దడదడమని మెరుపులు. అర్ధరాత్రి అవుతోంది. ఆ ఇంట్లోని తల్లి, పెద్ద కూతురు, కొడుకు, చిన్న కూతురు అందరూ కారిడార్‌లో నిలబడి వీధి వైపు చూస్తూ ఉన్నారు. కాని వాళ్లు ఎదురు చూస్తున్న ఆ ఇంటి పెద్ద రాలేదు. సాయంత్రం వెళ్లాడు- ఇప్పుడే వస్తానని. కాని రాలేదు. ఎక్కడ వెతికినా లేడు. ఎవరిని అడిగినా తెలియదు. పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పత్తా లేడు. అతనేం పిచ్చివాడా? రిటైర్డ్ ప్రొఫెసర్. ఇల్లు ఉంది. వాకిలి ఉంది. భార్య... పిల్లలు... కాని వెళ్లిపోయాడు. ముసలి వయసులో. ఎందుకు వెళ్లిపోయి ఉంటాడు? అతనికి బాధ్యత లేదు అని కొడుకు అన్నాడు. అతడికి ఇల్లు పట్టలేదు అని భార్య అంది. అతడు ఒక మామూలు మనిషి... కాని మనం ఒక మేధావి అనుకున్నాం అని పెద్ద కూతురు అంది. అతడొక అహంకారి అని చిన్న కూతురు భావించింది. రోజులు గడిచాయి. మళ్లీ వానాకాలం వచ్చింది. తండ్రి ఆచూకీ లేదు. అతడు ఉండగా బాధ్యతగానే ఉండేవాడు అని కొడుక్కి అనిపించింది. అతడు ఉండగా ఇంటిని పట్టించుకునేవాడు అని భార్యకు అనిపించింది. అతడు మేధావి అని పెద్ద కూతురికి అనిపించింది. అతడు నిగర్వి అని చిన్న కూతురికి అనిపించింది. కాని అతడు ఏమిటి? ఏమో ఇవన్నీ కావచ్చు. అసలేమీ కాకపోవచ్చు. మరి అతడు ఎందుకు వెళ్లిపోయాడు? మనందరి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఒక మీడియోక్రసీ ఉంటుంది. అసలైనదేదో చేయకుండా ఒక నాటకంలో పాత్రధారిలాగా మారిపోతూ ఉంటాం. కాని ఏం చేయగలం? మనకుండేది ఒకే జీవితం. ఒకలాంటి జీవితం. ఇంకోలా జీవించాలంటే వీలుండదు. ఆ సంగతి తెలిసి ఇంకోలాంటి జీవితాన్ని వెతుక్కుంటూ అతడు వెళ్లిపోయాడా? మళ్లీ రానున్నాడా? ‘ఏక్ దిన్ అచానక్’ మృణాల్‌సేన్ తీసిన గొప్ప సినిమాల్లో ఒకటి. ఊపిరి బిగపట్టి చూసేలా కేవలం ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య అతడు ఈ సినిమా (1989లో) తీశాడంటే అద్భుతం. శ్రీరామ్ లాగూ, షబానా ఆజ్మీ... వీళ్లను చూస్తుంటే మనుషులు పాత్రలుగా మారడం... స్టన్నింగ్. ఇది బెంగాలీలో రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే నవల. హిందీలో ఒక మరపురాని సినిమా. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయ్. Ek Din Achanak అని కొట్టి చూడండి.