
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ముంబై- పూణే హైవే పై జరిగింది. షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు... వెనుక నుంచి ఓ ట్రక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ కూడా ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే గత రాత్రే షబానా తన భర్త 75వ జన్మదినాన్ని ముంబైలో జరిపారు. మరోవైపు వారితో ప్రయాణిస్తున్న వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. కారు డ్రైవర్ స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే షబానా అజ్మీని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment