cardiac attack
-
అందుబాటులోకి ఆధునిక వైద్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గుండె జబ్బులకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు, కాకినాడ జీజీహెచ్‌లలో క్యాథ్‌ల్యాబ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఒక్కోచోట రూ.6 కోట్ల చొప్పున నిధులను వెచ్చిస్తోంది. కర్నూలు జీజీహెచ్‌లో ఇప్పటికే క్యాథ్ ల్యాబ్ యంత్రాలు అమర్చడం పూర్తయింది. ఈ వారంలోనే ట్రయల్ రన్‌ను ప్రారంభించబోతున్నారు. కాకినాడ జీజీహెచ్‌లో యంత్రాలు అమర్చే ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి కానుంది. గుండె వైద్య సేవల విస్తరణ మారిన జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా చిన్న వయసు వారు సైతం గుండె జబ్బుల బారినపడుతున్నారు. గుండెపోటు బాధితులకు అత్యంత వేగంగా చికిత్స అందించడం ద్వారా మరణాల నియంత్రణపై సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనికోసం ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని కర్నూలు, గుంటూరు, తిరుపతి, విశాఖ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తోంది. మరోవైపు పాత 11 జీజీహెచ్‌లలో అన్నిచోట్ల కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ వాసు్కలర్ సర్జరీ (సీటీవీఎస్) సేవలు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 11 పాత వైద్య కళాశాలలు ఉండగా.. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు కళాశాలలకు అనుబంధంగా పనిచేస్తున్న జీజీహెచ్‌లలో కార్డియాక్, సీటీవీఎస్ విభాగాలు సేవలందిస్తున్నాయి. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జీజీహెచ్‌లలో కార్డియాలజీ, సీటీవీఎస్ విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆయా విభాగాల ఏర్పాటు, సేవలు అందుబాటులోకి తేవడానికి వీలుగా 9 ఫ్రొఫెసర్, 9 అసోసియేట్, 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కలిపి.. పర్ఫ్యూజనిస్ట్, క్యాథల్యాబ్, ఈసీజీ టెక్నీషియన్ ఇలా 94 పోస్టులను ఇప్పటికే మంజూరు చేశారు. ఈ ఐదు చోట్ల క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు ఇప్పటికే డీఎంఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సమస్య నిర్ధారణ.. చికిత్సలో కీలకం రక్తనాళాలు, హృదయ సంబంధిత సమస్యలను నిర్ధారించి.. చికిత్స నిర్వహించడంలో క్యాథ్ ల్యాబ్‌లదే ముఖ్య పాత్ర. గుండెపోటు సంబంధిత లక్షణాలున్న వారికి యాంజియోగ్రామ్ పరీక్షచేసి స్టెంట్ వేయడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలున్న వారికి పేస్‌మేకర్ అమర్చడం క్యాథ్ ల్యాబ్ ద్వారానే చేపడతారు. ప్రభుత్వం హబ్ అండ్ స్పోక్ విధానంలో అమలు చేస్తున్న ఈసీసీ కార్యక్రమంలో క్యాథ్ ల్యాబ్ సౌకర్యం ఉన్న బోధనాస్పత్రులు హబ్‌లుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఏపీవీవీపీ ఆస్పత్రులను అనుసంధానం చేసి గుండెపోటు లక్షణాలతో వచ్చే వారికి గోల్డెన్ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో కార్డియాక్ కేర్ క్యాథ్ ల్యాబ్ ఏర్పాటుతో పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ఆస్పత్రిగా కర్నూలు జీజీహెచ్ రూపాంతరం చెందింది. గుండెకు సంబంధించిన అన్నిరకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. రాయలసీమ వాసులకు వైద్యపరంగా పెద్దన్నగా వ్యవహరిస్తున్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో క్యాథ్‌ల్యాబ్ కూడా అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, సీటీవీఎస్ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
Healthy Heart: మీ గుండె ఆగిపోకూడదనుకుంటే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు. మీడియా.. సోషల్ మీడియా వల్ల ప్రతీ ఒక్కరికీ అలాంటి ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇవేవీ లేకుండా ఆగిపోయే గుండె మీది కాకూదదనుకుంటే.. దానికి బలం అవసరం. మరి ఆ బలం ఎలా అందించాలో వైద్య నిపుణుల సూచనల మేరకు ఈ కథనం. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్.. ఈ రెండూ వేర్వేరు. గుండె పోటు.. ఉబకాయం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి, ఇతర అనారోగ్య సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. గుండె రక్తనాళాలు అకస్మాత్తుగా మూసుకుపోడం, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల గుండె పోటు వస్తుంది. ఇక సడెన్ కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఎదురయ్యే స్థితి. దీనికి వయసుతో సంబంధం ఉండదు. పైగా దీనిని అంచనా వేయడమూ కష్టం. అందుకే.. ఈ పరిస్థితులను ఎదుర్కొగలిగే గుండె ఉంటే.. సమస్యనేది ఉత్పన్నం కాదు కదా!. ► కాబట్టి, గుండె ఆరోగ్యంగా ఉంటే.. ప్రాణాల మీదకు రాదు. ఆ ఆరోగ్యం కోసం గుండెకూ ఎక్సర్సైజులు అవసరం!. అయితే మనిషి జీవితం ఇప్పుడు యాంత్రికమైపోయింది. దానికి తగ్గట్లే శారీరక శ్రమకు దూరమైపోతున్నాం. కాబట్టి.. రోజులో కాసేపైనా అలసిపోవడం అవసరం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా.. వాహనాలు, లిఫ్ట్‌లు వచ్చిన తరువాత శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. అందుకే వీలుచిక్కినప్పుడల్లా నడవడం, మెట్లు ఎక్కడం లాంటి వాటి ద్వారా గుండెను పదిలంగా చూసుకోవచ్చు. ఇక.. అధిక బరువు అనే ప్రధాన సమస్య, గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల గుండె కొట్టుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. కనుక ఆహార, వ్యాయామంతో బరువు పెరగకుండా చూసుకోవాలి. ► అనారోగ్యమే కాదు.. అలసట, ఒత్తిడిల వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటోంది. కాబట్టి, మనసుకు విశ్రాంతి అవసరం. అది ప్రశాంతతతోనే లభిస్తుంది కూడా. ఈరోజుల్లో ఒత్తిడి.. దాని నుంచి ఏర్పడే ఆందోళన, ఉద్వేగం లాంటివి ప్రతీ ఒక్కరికీ సాధారణం అయ్యాయి. ప్రశాంతత అనేది మనసుకు రిలీఫ్ ఇస్తుంది. అందుకోసం రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. ఉపశమనం కలగొచ్చు. నవ్వడం వలన రక్తనాళాలు విప్పారి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన సమయం దొరికినప్పుడల్లా జోక్స్ చదవండి. నవ్వు తెప్పించే కంటెంట్‌వైపు మళ్లండి. ఇక కార్టిజోల్ వంటి హార్మోన్స్ గుండె ఆరోగ్యం దెబ్బతినేలా చేస్తాయి. అందువలన వ్యాయామం చేసి ఇలాంటి హార్మోన్స్ స్థాయిలు ఉద్ధృతం కాకుండా చేసుకోవచ్చు. ► నిద్రలేమి కారణంగా కూడా రక్తపోటు ప్రమాదం ఉంది. ఇది గుండె జబ్బుకు దారితీస్తుంది. కనుక రాత్రివేళ నిద్ర.. అదీ 7-8 గంటలు హాయిగా నిద్రపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ► ఫలానా వాటికి ఫలానాది ఓ గుండెకాయ.. అని అనేక సందర్భాల్లో వర్ణిస్తాం. మరి అంతటి ముఖ్యమైన అవయవానికి సరైన ఆహారం అందాల్సిందే కదా!. గుండెకు మంచి ఆహారం అవసరం. అదీ వైద్యనిపుణులను, నిపుణులైన డైటీషియన్లను సంప్రదించి తీసుకోవడం ఇంకా ఉత్తమం. ► గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనేది వైద్యులు మొదటి మాట. రెండో మాటగా.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటారు. అలాగే.. ఈరోజుల్లో మూడో మాటగా మాంసాహారం ఎక్కువగా తీసుకునేవాళ్లు.. దానిని తగ్గించి తీసుకోవడం మంచిదని చెప్తున్నారు. ► మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కొవ్వులు తక్కువగా ఉండే వేరుశెనగ, బాదం, పిస్తా.. వంటి నట్స్‌ను రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ► అవిసె గింజలు, ఆలీవ్ ఆయిల్, అవకాడో,చియా గింజలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్నట్స్, బ్రొకోలి, కొత్తిమీర, పిస్తా వంటి వాటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెడ్ తదితర మైదా ఉత్పత్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలంటారు. ► తక్కువ ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ తక్కువ ఉండే వాటితో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఏమీ ఉండవని వైద్యులు అంటున్నారు. అతిగా వేపుళ్లు, మసాలాలు-కారం దట్టించిన ఫుడ్ కూడా అస్సలు మంచిది కాదు. ► మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే. ఇష్టమొచ్చింది తింటే అధిక చెడు కొలెస్ట్రాల్, అధిక బరువుకు దారితీస్తుంది. గుండెకే కాదు.. ఇతర అవయవాలనూ ప్రభావితం చేసి ఇతరత్ర జబ్బులు పలకరించే ప్రమాదం ఉంటుంది. ► ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే తీరు ప్రభావితమవుతుంది. అంటే గతితప్పుతుంది. కార్డియో మయోపతి అంటే గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గడం. ఆల్కహాల్ తీసుకున్న సమయంలో ట్ల్యాబ్లెట్లు వేసుకోకూడదు. ► స్మోకింగ్ చేసేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువ. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్‌కు దూరంగా ఉండటం మంచిది. ► అట్రియల్ ఫిబ్రిల్లేషన్ (గుండె అతి వేగంగా కొట్టుకోవడం) రిస్క్ ను పెంచుతుంది. దీనికి నిద్ర తగ్గితే మరింత ముప్పు ఎదురవుతుంది. నిద్ర తగ్గి, గుండె అతి వేగంగా కొట్టుకుంటే అతి హార్ట్ ఫెయిల్యూర్ లేదా స్ట్రోక్ కు దారితీయవచ్చు. ► మంచి గాఢ నిద్ర, సరిపడా ఉండేలా చూసుకుంటే రోగ నిరోధక శక్తి పునరుజ్జీవం అవుతుంది. అలాగే, గుండె ఆరోగ్యం కూడా పటిష్టమవుతుంది. అర్ధరాత్రి తర్వాత కూడా మేల్కొని ఉంటే అది అనారోగ్య సమస్యలకు దగ్గరి దారి అవుతుంది. ఇది ఇప్పటి యువతరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. సెల్ఫోన్లు, ఇతర అలవాట్లతో చేజేతులారా ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. ► గుండె సమస్యల్ని గుర్తించడం చాలా కష్టం. రెగ్యులర్ చెకప్‌ల ద్వారానే సమస్యలను నిర్ధారించుకోవచ్చు. అయితే కొన్ని సంకేతాలు మాత్రం రాబోయే ముప్పును అంచనా వేయొచ్చని చెప్తున్నారు వైద్య నిపుణులు. కడుపులో తీవ్రమైన నొప్పి. పొత్తి కడుపు ఉబ్బినట్లుగా అనిపించడం. కడుపులో గ్యాస్ పెరిగినట్లు అసిడిటీగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం, పుల్లటి తేన్పులు.. ఛాతీలో నొప్పి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. వైద్యులు దగ్గరికి వెళ్లాలి. ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కార్డియాక్ అరెస్ట్‌ను అంచనా వేయడం వీలుకాని పని. అందుకే.. గుండెను బలంగా ఉంచుకోవడం మరీ ముఖ్యం. ఇంటి వైద్యం-సొంత వైద్యం కాదు.. గుండెను కాపాడుకోవాలంటే ఆస్పత్రులకు, వైద్యుల వద్దకు వెళ్లాల్సిందే!. Sitting in some position Chewing ginger garlic dhaniya Mirch Coughing sneezing laughing None of these will help in heart attack Reach a hospital with Cardiac facilities as soon as possible to get appropriate treatment in #Heartattack to save life https://t.co/3Aa6cT0cCS pic.twitter.com/ELjEyAW6ne — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) February 24, 2023 -
ఫిట్‌గా ఉన్నా..జిమ్ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు?
ప్రముఖ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటారు. అందునా ఆయన వయసు కేవలం 46 ఏళ్లు మాత్రమే. ఇలాంటి వయసులో, ఇంత ఫిట్‌గా ఉన్నవారికి గుండెపోటు రావడం కొంత విస్మయం, మరికొంత ఆందోళన కలిగించే అంశమే. అంత ఫిట్‌గా ఉన్నవారికే వస్తే మరి ఎలాంటి జాగ్రత్తలూ పాటించనివారి పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక్క పునీత్ ఘటనే కాదు.. ఇలాంటివి మరికొన్ని ఇటీవల చోటుచేసుకున్నాయి. సిద్ధార్థ శుక్లా (హిందీ బిగ్‌బాస్ ఫేమ్), మరొకవ్యక్తి గుండెనొప్పితో బాధపడుతూ జిమ్ మెట్ల మీద కూర్చుని అక్కడే కుప్పకూలిపోయారు. చాలామంది యువత ఎస్ఐ పరీక్షకు శిక్షణ పొందే క్రమంలో రన్నింగ్ చేస్తూ గుండెపోటుకు గురికావడం చూస్తూనే ఉన్నాం. మరిలాంటి గుండెపోట్లకు కారణాలేమిటి? నివారించడమెలా? గడ్డలు, అడ్డంకులు లేకపోయినా.. పునీత్ రాజ్‌కుమార్, సిద్ధార్థ శుక్లా లాంటి పూర్తి ఫిట్నెస్తో ఉన్న యువకులకు యాంజియోగ్రామ్ వంటి పరీక్షలు నిర్వహిస్తే... వారి రక్తనాళాల్లో ఎలాంటి రక్తపు గడ్డలు (క్లాట్), మరెలాంటి అడ్డంకులు (బ్లాక్స్) కనిపించకపోవచ్చు. అంతా నార్మల్‌గా ఉంటుంది. అయినా అలాంటివారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు ఇదమిత్థంగా ఇదే కారణమని చెప్పలేకపోయినా.. ఇలాంటివారిలో ఆ సమస్య వచ్చేందుకు దోహదం చేసే అంశాలను తెలుసుకుంటే ఫిట్నెస్, ఆరోగ్యం కోసం కఠిన వ్యాయామం చేసే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. కఠిన వ్యాయామం చేస్తున్నారా? గుండె రక్తనాళపు గోడల్లో చీలిక ఏర్పడితే అది గుండెపోటు లాంటి ప్రమాదానికి దారితీయవచ్చు. దీన్నే డిఫెక్షన్ అంటారు. గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో చెప్పుకోదగ్గ బ్లాక్స్ లేకపోయినా.. కొవ్వుకణాలతో ఏర్పడిన ‘ప్లాక్’పైన పగుళ్లు ఏర్పడటం వల్ల రక్తం గడ్డకట్టి, అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటుకు కారణం కావచ్చు. పునీత్ లాంటి బాగా ఎక్సర్సైజ్ చేసే వారి రక్తనాళాల్లో ఎలాంటి ప్లాక్స్ / బ్లాక్ లేకపోయినా అక్కడ అకస్మాత్తుగా రక్తపు గడ్డలు ఏర్పడటం వల్ల కూడా గుండెపోటు రావచ్చు. ∙కొంతమందిలో సహజంగా రక్తంలో గడ్డలు (క్లాట్స్) ఏర్పడే తత్వం ఉంటుంది. ఉదాహరణకు ప్రొటీన్–సి, ప్రొటీన్–ఎస్, యాంటీ థ్రాంబిన్– 3 డెఫీషియెన్సీల వంటి లోపాలున్నవారిలో ఈ తత్వం ఉంటుంది. అలాగే హోమోసిస్టిన్ అనే జీవరసాయనం రక్తంలో ఎక్కువగా ఉన్నవారిలోనూ ఈ క్లాట్ ఏర్పడే గుణం ఎక్కువ. ఇలా రక్తం త్వరగా గడ్డ కట్టడానికి అవకాశం ఉన్న ధోరణిని ‘బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ’ (హైపర్కోయాగులబుల్ స్టేట్స్)గా చెబుతారు. ఇది ఉన్నవారిలో రక్తంలో క్లాట్ త్వరగా ఏర్పడి అది రక్తప్రవాహానికి అడ్డంకిగా మారి గుండెపోటును తెచ్చిపెట్టవచ్చు. ఇవిగాక జన్యుపరమైన కారణాలతో ఓ వ్యక్తి ఎంత ఫిట్‌గా ఉన్నప్పటికీ ఒక్కోసారి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. కుటుంబంలో (ఫ్యామిలీ హిస్టరీలో) గతంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన దాఖాలాలు ఉంటే.. అలాంటి కుటుంబాల్లోని కొందరికి ఎంత ఫిట్‌గా ఉన్నా ఒక్కోసారి అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. కోవిడ్ వచ్చిన వారిలో.. కోవిడ్ వచ్చి తగ్గిన కొందరిలో క్లాట్స్ ఏర్పడే తత్వం పెరిగిపోయింది. కొందరికి తమకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతే తెలియకపోవచ్చు. కానీ అనంతర పరిణామంగా రక్తపుగడ్డలు (క్లాట్స్) ఏర్పడటం వల్ల హఠాత్తుగా గుండెపోటు వచ్చి అది ఆకస్మిక మరణానికి దారితీయవచ్చు. మరికొన్ని సాధారణ కారణాలు ► సాధారణంగా చాలా మృదువుగా, సాగే గుణంతో (ఫ్లెక్సిబుల్‌గా) ఉండే రక్తనాళాలు వయసు పెరుగుతున్న కొద్దీ గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్కిల్రోసిస్ అని అంటారు. కొందరిలో అథెరో స్కిల్రోసిస్ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు రావచ్చు. గతంలో 50 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవించేది. ఇటీవల చాలా చిన్నవయసులోనే అంటే 21 – 40 ఏళ్ల వారిలోనూ రక్తనాళాలు గట్టిబారడం కనిపిస్తోంది. దీనికి ఇదీ కారణం అని చెప్పలేకపోయినా.. కొందరిలో కొలెస్ట్రాల్ నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరడం వల్ల, ప్లాక్స్గా పిలిచేవి క్లాట్స్ (అడ్డంకులు)గా మారడం వల్ల ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. ► అథెరోస్కిల్రోసిస్కూ తద్వారా గుండెపోటుకు పొగాకును ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ► ఇక జెండర్ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వారికి గుండెపోటు నుంచి రక్షణ కల్పిస్తుంది. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు (మయోకార్డియల్ ఇన్పార్క్షన్) నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలతో పాటు ఏ జెండర్‌కు చెందినవారికైనా గుండెపోటు అవకాశాలు సమానం. ► జంక్‌ఫుడ్ తీసుకోవడం వల్ల గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం, హాని చేకూర్చే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), చెడు కొవ్వులైన ట్రైగ్లిసరైడ్స్ పెరగడం కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే. ► పొట్ట దగ్గర కొవ్వు విపరీతంగా చేరడంతో వచ్చే సెంట్రల్ ఒబెసిటీ, తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా హఠాత్తుగా గుండెపోటును తెచ్చేవే. ► అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహద పడుతుంది. గుండెపోటు లేకుండానే ఆగిపోవచ్చు కొంతమందికి గుండెపోటు రాకుండానే ఆకస్మికంగా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. వీటిల్లో బ్రుగాడా సిండ్రోమ్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్ క్యూటీ సిండ్రోమ్, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వంటి కారణాలతో గుండెపోటు లేకుండానే అకస్మాత్తుగా ‘కార్డియాక్ అరెస్ట్’ అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఇలా జాగ్రత్త పడాలి ► కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్న మెడికల్ హిస్టరీ ఉన్నట్టైతే చిన్నవయసులోనే పరీక్షలు చేయిస్తుండాలి. 40 ఏళ్లు దాటిన ప్రతివారూ తరచూ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్ కోసం సాధారణ పరీక్షలు చేయించుకోవాలి. అవసరాన్ని బట్టి ఆ పరిస్థితిని నియంత్రించుకోవడం / సరిదిద్దుకోవడం కోసం తగిన మందులు వాడుతూ ఉండాలి. ► వ్యాయామం చాలా మంచిదే. అయితే గుండెమీద భారం పడుతున్నట్లుగా గానీ లేదా తీవ్రమైన ఆయాసానికి గురి చేస్తున్నట్లుగా అనిపించగానే ఆపేయాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా వ్యాయామ ప్రక్రియ ఏదైనా అది తీవ్రమైన శ్రమ కలిగించనిదిగా ఉండాలి. అందుకే వ్యాయామ ప్రక్రియలన్నింటి కంటే నడక మంచి వ్యాయామం. ► వైద్య, పారామెడికల్ సిబ్బందితో పాటు పోలీసులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలకు ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్) పరికరాన్ని ఉపయోగించే శిక్షణ ఇప్పించడంతో పాటుగా ‘బేసిక్ లైఫ్ సపోర్ట్’ శిక్షణ ఇప్పించి, వాటి సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లేలోపే రోగిని స్థిమితపరిస్తే... వారిని మరణం బారినుంచి రక్షించే అవకాశాలుంటాయి. ఇలాంటి ఉపకరణాలను ‘పబ్లిక్ ప్రదేశాల్లో’ అందుబాటులో ఉంచితే హఠాన్మరణాలను నివారించవచ్చు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం: నటుడు కన్నుమూత
చెన్నె: తమిళ సినీ పరిశ్రమలో ఆకస్మిక మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రముఖ హాస్య నటుడు నెల్లె శివ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. నెల్లె జిల్లాకు చెందిన ఈయన నడిగర్ తిలగం శివాజీ గణేశన్‌కు వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినీ రంగానికి వచ్చారు. 1985లో ‘అన్భావం’ సినిమా ద్వారా శివ నటుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 500కు పైగా సినిమాల్లో నెల్లె శివ నటించి ప్రేక్షకులను మెప్పించారు. నెల్లె శివ ఆకస్మిక మృతిపై తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు మారన్ కూడా కరోనాతో మంగళవారం చెంగల్పట్టులో మృతి చెందారు. పలు చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధంగా వరుస విషాద ఘటనలతో తమిళ సినీ పరిశ్రమ క్రుంగిపోతుంది. చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య -
బాలీవుడ్ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత
ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ తల్లి షౌకత్ కైఫీ ముంబయిలోని తన నివాసంలోనే కన్నుమూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు షబానా అజ్మీ భర్త జావేద్ అక్తర్ వెల్లడించారు. 93 ఏళ్ల షౌకత్ కైఫీ డ్రామా ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈమె ఉర్థూ కవి, పాటల రచయిత అయిన కైఫీ అజ్మీని వివాహం చేసుకున్నారు. వీరికి షబానా అజ్మీతో సినిమాటోగ్రఫర్ బాబా అజ్మీలు సంతానం. షౌకత్ కైఫీ గత కొంతకాలంగా గుండెసంబంధింత వ్యాధితో బాధపడుతున్నారని, ముంబయిలోని దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స తీసుకుంటున్నారని జావేద్ అక్తర్ వెల్లడించారు. వయసు మీద పడడంతో ఆమె శరీరీం చికిత్సకు సహకరించకపోవడంతో ముంబయిలోని తన నివాసానికి తీసుకువచ్చామని తెలిపారు. షౌకత్ కైఫీ తన తుదిశ్వాసను తన రూంలోనే విడవాలనుకుంటున్నట్లు మాకు చేస్సిందని తెలిపారు. అయితే శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో షౌకత్ కైఫీ తన గదిలోనే తుది శ్వాస విడిచారని పేర్కొన్నారు. కాగా, షౌకత్ కైఫీ మరణించారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ట్విటర్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. Rest In Peace #ShaukatKaifi aapa 🙏 The old world of poetry,theatre and integrity coming to a closure bit by bit. pic.twitter.com/ak3Q38kEMh — Rajiv B Menon (@crypticrajiv) November 23, 2019 Love conquers all ❤#ShaukatKaifi 🌸 pic.twitter.com/4ASZ86jrle — Sheba Ghildyal(शैबा) (@ShebaGhildyal) November 23, 2019 -
రాజకుటుంబ వీరాభిమాని ‘కోహినూర్’ మృతి
ముంబై: బ్రిటన్ రాజవంశానికి వీరాభిమాని, బ్రిటానియా&కో రెస్టారెంట్ ఓనర్ అయిన బోమన్ కోహినూర్(93) బుధవారం మృతి చెందాడు. గుండెపోటుతో నిన్న సాయంత్రం 4.45గంటలకు కన్ను మూసినట్లు పార్సీ జనరల్ ఆస్పత్రి అధికారి తెలిపారు. బ్రిటానియా రెస్టారెంట్ ఓనర్‌గా కొద్ది మందికి మాత్రమే తెలిసిన బోమన్ కోహినూర్.. 2016లో ఆకస్మాత్తుగా దేశం అంతటా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ఇండియా-భూటాన్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన ప్రిన్స్ విలియమ్స్ దంపతులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి బోమన్‌ని కలుసుకున్నారు. ఈ సంఘటనతో బోమన్‌కు ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసింది. బోమన్ కోహినూర్ తండ్రి 1923లో ముంబైలో బ్రిటానియా&కో రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. ఊహ తెలిసిన నాటి నుంచి కోహినూర్ జీవితం ఆ రెస్టారెంట్‌కు అంకితమయ్యింది. చిన్ననాటి నుంచి కోహినూర్ బ్రిటన్ రాజవంశం పట్ల వల్లమాలిన అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే బోమన్ రెస్టారెంట్లోకి అడుగుపెట్టిన వారికి ముందుగా క్వీన్ ఎలిజబెత్ II, మహాత్మగాంధీ నిలువెత్తు ఫోటోలు దర్శనమిస్తాయి. అంతేకాక కోహినూర్ ప్రతి ఏడాది క్వీన్ ఎలిజబెత్ IIకు ప్రత్యేక సందర్భాల్లో ఉత్తరాలు రాస్తుంటాడు. రాజ ప్రసాదం నుంచి క్వీన్ ప్రతినిధులు ఆమె తరఫున ప్రత్యుత్తరం కూడా పంపుతారు. కోహినూర్‌కు రాజ కుటుంబం అంటే ఎంత అభిమానం అంటే.. తన మనవరాలికి ఏకంగా ప్రిన్స్ విలియమ్స్ తల్లి డయానా పేరు పెట్టాడు. కోహినూర్ మరణం పట్ల నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రియమైన బొంబాయి వాసి ఇక లేరని తెలిసి బాధగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. -
మణిరత్నంకు మరోసారి గుండెపోటు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. దీంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మణిరత్నంకు తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి కశ్మీర్లో గుండెపోటుకు గురయ్యారు. కశ్మీర్ నుంచి వెంటనే ఢిల్లీకి తరలించి చికిత్సను అందించడంతో ఆయన కోలుకొన్నారు. 2015 తర్వాత ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2018లో మళ్లీ గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా నాలుగోసారి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చారిత్రాత్మక చిత్రంపై పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో భారీ రేంజ్లో అగ్రనటులను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించడానికి ఒకే చెప్పారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. -
యజమానిని కాపాడిన మూగజీవి
పూణె : విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఈ ప్రపంచంలో మరోటి ఉండదు. దీన్ని రుజువు చేసే సంఘటన మరొకటి జరిగింది. చావు అంచుల వరకూ వెళ్లిన యజమానిని బతికించుకుంది కుక్క. వివరాలు.. పూణెకు చెందిన రమేష్ సంచేటి (65) అనే వైద్యుడు ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు బ్రౌనీ. ఈ కుక్క కోసం ప్రత్యేకంగా అమిత్ షా అనే నౌకర్ని కూడా నియమించాడు రమేష్. బ్రౌనీకి సంబంధించిన విధులన్నింటిని అమిత్ చూసుకునేవాడు. ఈ క్రమంలో ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బ్రౌనీకి భోజనం పెట్టడానికి వచ్చాడు అమిత్. అయితే అది భోజనం చేయడానికి నిరాకరించి.. రమేష్ గది ముందు పచార్లు చేయసాగింది. అనుమానం వచ్చిన అమిత్.. రమేష్ గదిలోకి తొంగి చూడగా.. అతను నేల మీద పడిపోయి ఉన్నాడు. ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన అమిత్ గది తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించాడు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాడు. రమేష్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి కార్డియాక్ అరెస్ట్ అయ్యిందని.. ఏం మాత్రం ఆలస్యం చేసి ఉన్నా రమేష్ మరణించేవాడని తెలిపారు. ఈ విషయం గురించి అమిత్ మాట్లాడుతూ.. ‘బ్రౌనీ సమయానికి నన్ను అప్రమత్తం చేయబట్టి సరిపోయింది. ఈ రోజు రమేష్ ప్రాణాలతో ఉన్నారంటే అందుకు బ్రౌనీనే కారణం’ అని తెలిపాడు. -
పెళ్లి చేసుకుంటేనే.. గుండె పదిలం
పారిస్ : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ పాడుకునే బ్యాచిలర్లు ఇక ఆ ధోరణి నుంచి బయటపడాలంటున్నారు పరిశోధకులు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే... పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశాలను రాయల్ స్ట్రోక్ ఆస్పత్రి కార్డియాలజి విభాగం పరిశోధకులు చున్ వాయ్ వాంగ్ నేతృత్వంలోని బృందం.. మెడికల్ జర్నల్ హర్ట్ నివేదికలో పొందుపరిచారు. రెండు దశాబ్దాల పాటు వివిధ వ్యక్తులపై తాము జరిపిన పరిశోధనల్లో... పెళ్లైన వారితో పోలిస్తే పెళ్లికాని వారు హార్ట్ ఎటాక్‌తో మరణించే అవకాశం 42 నుంచి 55 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని తెలిపారు. యూరోప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకు తాము జరిపిన పరిశోధనల్లో.. పెళ్లై జీవిత భాగస్వామితో కలిసి జీవించే వారు తమ జీవితానికి భద్రత ఉందన్న భరోసాతో ఎక్కువగా ఒత్తిడికి లోనుకామని తెలిపారన్నారు. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే తోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్న కారణంగానే స్ట్రోక్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే సహజీవనం చేసే వారిలో పెళ్లి అనే బంధం లేని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. -
దత్తాత్రేయకు రోహిత్ వేముల తల్లి సానుభూతి
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్(21) హఠార్మణం పట్ల రోహిత్ వేముల తల్లి రాధిక వేముల సంతాపం ప్రకటించారు. దత్తాత్రేయకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కొడుకును కోల్పోయిన వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. జరిగిన విషాదానికి చింతిస్తున్నాను. మీరు త్వరగా ఈ ఘటన నుంచి కోలుకోవాలని ఆశిస్తున్నాను...జై భీమ్’ అంటూ తన ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దత్తాత్రేయ కుమారుడు వైష్టవ్ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. హెచ్‌సీయూ విద్యార్ధి రోహిత్ వేముల 2016, జనవరి 17న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో రోహిత్‌ను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన వారిలో దత్తాత్రేయ కూడా ఉన్నాడరనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో రోహిత్ వేములతోపాటు మరో నలుగురు విద్యార్థులను వీసీ యూనివర్సిటీ నుంచి బహిష్కరించారు. దాంతో మనస్తాపం చెందిన రోహిత్ వేముల హస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయారు. అయితే ఈ వ్యవహారంలో అప్పట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న దత్తాత్రేయపై కూడా ఆరోపణలు వచ్చాయి. హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ అప్పటి హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దీనికి స్పందనగా వీసీ అప్పారావుతో రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్ధులను బహిష్కరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఆందోళనలు రేగాయి. దీంతో ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే రూపన్వాల్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని వేసింది. ఈ కమిటీ దత్తాత్రేయను నిర్ధోషిగా ప్రకటించి క్లీన్ చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నటుడి హఠాన్మరణం; వీడియో వైరల్
అనేక చిత్రాల్లో సల్మాన్ ఖాన్‌కు సహ నటుడిగా నటించిన బాలీవుడ్ నటుడు ‘ఇందర్ కుమార్’ గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇందర్ కుమార్ మరణానికి ముందు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడమే కాక పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ వీడియోలో ఇందర్ కుమార్ బాగా తాగిన మత్తులో ఉండి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వివరించాడు. నటుడు కావాలనే ఉద్ధేశంతో ముంబై వచ్చానని, కానీ చెడు అలవాట్లతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని తెలిపాడు. తాను చేసిన పొరపాట్ల వల్లే చివరికిలా జీవితాన్ని ముగించాల్సి వస్తుందన్నాడు. వీడియో చివరికి వచ్చేసరికి ఏడుస్తూ తన తల్లిదండ్రులను క్షమించమని కోరాడు. ఈ వీడియో చూసిన అనంతరం ఇందర్ కుమార్ గుండె పోటుతో అకాల మరణం చెందాడని భావిస్తున్న వారి మదిలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇందర్ తానే స్వయంగా ఈ వీడియో తీసుకున్నట్లు తెలుస్తుందని కొన్ని వెబ్సైట్లు ప్రకటించాయి. కొందరు మాత్రం అది నమ్మశక్యంగా లేదని అంటున్నారు. అంతేకాకుండా ఇందర్ భార్య పల్లవి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవాలను తెలియజేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. 1996లో ఇందర్ కుమార్ తన తొలి చిత్రం మసూమ్‌తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తర్వాత దాదాపు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ‘ఖిలాడియోం కా ఖిలాడి’, ‘కహిన్ ప్యార్ నా హో జాయే’ వంటివి అందులో కొన్ని. అయితే 2014లో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేశాడనే నేరంలో దాదాపు 45 రోజులపాటు జైలులో గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికి అవకాశాలు తగ్గడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. దాంతో డిప్రెషన్‌కు, గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి. -
మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంకు మంగళవారం రాత్రి ఛాతినొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మణిరత్నంకు గతంలో కూడా ఓ సారి ఛాతినొప్పి రావడంతో చికిత్స పొందారు. మణిరత్నం పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. రోజా, దళపతి, ముంబై వంటి చిత్రాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. 1995లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. మణిరత్నం నటి సుహాసినిని వివాహం చేసుకున్నారు. -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ : గుండెపోటుతో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరు పట్టణం శివాజీ చౌక్‌కు చెందిన నర్సింలు (45) హెడ్ కానిస్టేబుల్. ఆయన వికారాబాద్‌లో ఏఎస్పీ వెంకటస్వామి సీసీగా పనిచేస్తూ స్థానిక క్వార్టర్స్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన విధులు ముగించుకొని క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఛాతీలో నొప్పి వచ్చింది. ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబీకులకు విషయం చెప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి, సీఐ రవి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, హౌజింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహాస్వామి తదితరులు మృతుడి కుటుంబీకులను ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.