నటుడి హఠాన్మరణం; వీడియో వైరల్‌ | Bollywood Actor Inder Kumar Suicide Video Viral | Sakshi
Sakshi News home page

నటుడి హఠాన్మరణం; వీడియో వైరల్‌

Published Mon, May 14 2018 3:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood Actor Inder Kumar Suicide Video Viral - Sakshi

అనేక చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌కు సహ నటుడిగా నటించిన బాలీవుడ్‌ నటుడు ‘ఇందర్‌ కుమార్‌’ గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇందర్‌ కుమార్‌ మరణానికి ముందు తీసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌ చల్‌ చేయడమే కాక పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ వీడియోలో ఇందర్‌ కుమార్‌ బాగా తాగిన మత్తులో ఉండి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వివరించాడు. నటుడు కావాలనే ఉద్ధేశంతో ముంబై వచ్చానని, కానీ చెడు అలవాట్లతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నానని తెలిపాడు. తాను చేసిన పొరపాట్ల వల్లే చివరికిలా జీవితాన్ని ముగించాల్సి వస్తుందన్నాడు. వీడియో చివరికి వచ్చేసరికి ఏడుస్తూ తన తల్లిదండ్రులను క్షమించమని కోరాడు.

ఈ వీడియో చూసిన అనంతరం ఇందర్‌ కుమార్‌ గుండె పోటుతో అకాల మరణం చెందాడని భావిస్తున్న వారి మదిలో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇందర్‌ తానే స్వయంగా ఈ వీడియో తీసుకున్నట్లు తెలుస్తుందని కొన్ని వెబ్‌సైట్లు ప్రకటించాయి. కొందరు మాత్రం అది నమ్మశక్యంగా లేదని అంటున్నారు. అంతేకాకుండా ఇందర్‌ భార్య పల్లవి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవాలను తెలియజేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. 1996లో ఇందర్‌ కుమార్‌ తన తొలి చిత్రం మసూమ్‌తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. తర్వాత దాదాపు విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ‘ఖిలాడియోం కా ఖిలాడి’, ‘కహిన్‌ ప్యార్‌ నా హో జాయే’ వంటివి అందులో కొన్ని.

అయితే 2014లో జూనియర్‌ ఆర్టిస్టుపై అత్యాచారం చేశాడనే నేరంలో దాదాపు 45 రోజులపాటు జైలులో గడిపాడు. బెయిల్‌ మీద బయటకు వచ్చినప్పటికి అవకాశాలు తగ్గడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. దాంతో డిప్రెషన్‌కు, గుండెపోటుతో మరణించాడని వార్తలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement