సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ అకృత్యాలపై ఆయన మరదలు ప్రియ ఇన్‌స్టాగామ్‌లో మరో వీడియో విడుదల చేశారు. నారాయణ ఆయన పరువు కోసం తనను అణచివేశారని ఆమె ఆరోపించారు. ‘నేను 29 ఏళ్లు భరించాను. ఇక భరించే శక్తి నాకు లేదు. సీతాదేవి కూడా 16 సంవత్సరాలు అరణ్యవాసం చేసింది. మరో 11 సంవత్సరాలు బిడ్డల్ని పెంచింది. మొత్తం 27 ఏళ్లు కష్టపడింది. నేను 29 ఏళ్లు నరకం అనుభవించాను. ఇప్పుడు కూడా ఇంటి విషయాలు మాట్లాడొద్దని అంటున్నారు.ఇంటి విషయాలైనా, పబ్లిక్ విషయాలైనా, నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయాలపైనా బయట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను.
నా కళ్ల ముందు చెడు జరుగుతోంది కాబట్టి బయటపెట్టేందుకు సిద్ధమయ్యాను. ముందు నా విషయం వెలుగులోకి తెస్తాను. తర్వాత విద్యా సంస్థల విషయాలు బయటపెడతా. పరువు అంటున్నారు. మహా అంటే పది మంది ఫోన్ చేస్తారు. అంతే కదా. ఇది నా జీవితం. 29 ఏళ్లు కష్టపడ్డా. నాకు క్యాన్సర్ వస్తే పలకరించే దిక్కు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను మాట్లాడతా. విద్యా సంస్థల్లో పిల్లల ఆత్మ హత్యల విషయం క్లియర్‌గా మాట్లాడతా. నేను ఫిజి కల్‌గా క్యాన్సర్ పేషంట్‌ను కావచ్చు. మెంటల్‌గా వీక్ కాను. ఒక స్త్రీ తలచుకుంటే శక్తి అవుతుందని నారాయణకు తెలియజేస్తా. నేను బతుకుతానో లేదో తెలియదు. నాకు డబ్బులివ్వరు. అయినా నా ఆస్తులమ్మైనా ట్రీట్‌మెంట్ చేయించుకుంటా. నేను చనిపోయే లోపు వాస్తవాలు బయటపెడతా’అని ప్రియ ఆ వీడియోలో చెప్పారు.
సంచలనంగా ప్రియ వీడియోలు
రెండు రోజుల క్రితం ప్రియ సోషల్ మీడియాలో మొదటి వీడియో రిలీజ్ చేశారు. బావ అయిన మాజీ మంత్రి నారాయణ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇది రెండు తెలుగురాష్ట్రాల్లో, రాజకీయ వర్గాల్లో, నారాయణ విద్యాసంస్థల్లో చర్చనీయాంశమైంది. దీంతో నారా యణ తన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దింపారు. ప్రియతో రాజీకి ప్రయత్నించారు. అయితే గంటా ప్రయత్నా లు విఫలమయ్యాయి. ప్రియ మరో వీడియో విడు దల చేసి, అందులో మరిన్ని విషయాలు వెల్లడించారు. ఇది మరింత సంచలనమైంది. సోదరుడి సతీమణినే నారాయణ లైంగికంగా వేధించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రియ జనసేన వీరమహిళ
పొంగూరు ప్రియ జనసేన సభ్యురాలు. ఆ పార్టీ వీరమహిళగా గుర్తింపు పొందింది. తన బావ టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ అభిమానిని అని ఆమె వీడియోలో వెల్లడించింది. తన కుమారుడు పుట్టిన రోజున పవన్‌తో దిగిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఓటు కూడా జనసేనకే వేశానని తెలిపింది. తన పార్టీ వీర మహిళగా ఉన్న ప్రియ లైంగిక వేధింపులతో నరకం చూశానంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసినా జనసేన పార్టీ నుంచి స్పందన లేకపోవడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అక్రమ రవాణాలపై మాట్లాడుతున్న వవన్ కళ్యాణ్ సొంత పార్టీలోని మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు నోరు మెదపడంలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఓ వైపు కేసులు.. మరో వైపు పరువు
ఓ వైపు పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ కేసు, మరో వైపు అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాల కేసుల్లో ఉన్న నారాయణకు తాజాగా సొంత మరదలు ప్రియ చేస్తున్న ఆరోపణలు మరింత ఇబ్బందిగా మారాయి. తన విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక ఉన్న చీకటి కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తానని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment