మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు | Mani Ratnam suffers cardiac attack, hospitalized | Sakshi
Sakshi News home page

మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు

Published Wed, May 6 2015 8:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు

మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు

న్యూఢిల్లీ: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంకు మంగళవారం రాత్రి ఛాతినొప్పి వచ్చింది.  వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మణిరత్నంకు గతంలో కూడా ఓ సారి ఛాతినొప్పి రావడంతో చికిత్స పొందారు.

మణిరత్నం పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. రోజా, దళపతి, ముంబై వంటి చిత్రాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. 1995లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. మణిరత్నం నటి సుహాసినిని వివాహం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement