గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి | constable died due to cardiac attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Published Thu, Apr 23 2015 12:07 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable died due to cardiac attack

హైదరాబాద్ : గుండెపోటుతో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరు పట్టణం శివాజీ చౌక్‌కు చెందిన నర్సింలు (45) హెడ్‌ కానిస్టేబుల్. ఆయన వికారాబాద్‌లో ఏఎస్పీ వెంకటస్వామి సీసీగా పనిచేస్తూ స్థానిక క్వార్టర్స్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన విధులు ముగించుకొని క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఛాతీలో నొప్పి వచ్చింది. ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబీకులకు విషయం చెప్పి కుప్పకూలిపోయాడు.

వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి, సీఐ రవి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, హౌజింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహాస్వామి తదితరులు మృతుడి కుటుంబీకులను ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement