narsimlu
-
విషాదాల్లోనూ వీడని రాఖీ బంధం
తిమ్మాపూర్, ముస్తాబాద్(సిరిసిల్ల), నర్సాపూర్ రూరల్: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్ (43)ను రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు. చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ.. ‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే -
పేద కుటుంబానికి ఆపన్న హస్తం
స్పందించిన మంత్రి హరీష్‌రావు ఎంపీపీ, ఓఎస్డీల ద్వారా ఆర్థిక సాయం చిన్నకోడూరు : రామంచ గ్రామానికి చెందిన నిరుపేద జంగపల్లి నర్సింలు కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో భార్య అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న వైనంపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు. వెంటనే ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డిలను ఆ కుటుంబ పరిస్థితులను పరిశీలించమని ఆదేశించారు. వారు బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి నర్సింలు భార్య పద్మకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. నర్సింలుకు వైద్యం అందించడం తోపాటు మందులు ఉచింతంగా అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ఉన్నత చదువుకు సహకరిస్తామన్నారు. -
నువ్వా.. నేనా!
మత్స్యశాఖ సహకార సంఘం జిల్లా ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ ముఖాముఖి కావడంతో నువ్వా..నేనా అన్నట్టుగా ఎవరికి వారు జోరుగా ప్రచారాన్ని సాగించి ముగించారు. మాజీలు తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ రెండు ప్యానళ్లుగా ఏర్పడ్డారు. తమ మద్దతుదారులతో శిబిరాలను నిర్వహిస్తూ గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. రసవత్తర పోరు ⇒ నేడు మత్స్యశాఖ సహకార సంఘం ఎన్నికలు ⇒ 11 డెరైక్టర్ల పదవులకు బరిలో 22 మంది ⇒ చైర్మన్ రేసులో బాల్‌నర్సయ్య, నర్సింలు ⇒ మాజీల మధ్యే ప్రధాన పోటీ ⇒ శిబిరాల్లో మద్దతుదారులు ⇒ నేరుగా పోలింగ్ బూత్‌లకు వచ్చేలా ప్రణాళికలు మెదక్: జిల్లా మత్స్య శాఖ సహకార సంఘం ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ అభ్యర్థులు తమ మద్దతుదారులను శిబిరాలకు తరలించారు. క్యాంపులకు వెళ్లిన వారంతా బుధవారం జరిగే పోలింగ్‌కు నేరుగా రానున్నారు. మెదక్ పట్టణంలోని మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల అధికారి పోమ్సింగ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయి. గురువారం చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 11 మంది డెరైక్టర్ల పదవులకు 22 మంది పోటీపడుతున్నారు. అన్ని పదవులకు ముఖాముఖి పోటీ నెలకొంది. 322 మంది ఓటర్లు... జిల్లాలో 686 చెరువులు ఉండగా, 509 ప్రాథమిక మత్స్య సహకార సంఘాలున్నాయి. 322 మంది సొసైటీ అధ్యక్షులకు మాత్రమే జిల్లా సంఘంలో ఓటు హక్కు ఉంది. ఈ మేరకు ఒక్కో అధ్యక్షుడు 11 మంది డెరైక్టర్లకు ఓటు వేయాలి. బుధవారం జరిగే జిల్లా ఎన్నికల కోసం మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటికీ చివరకు 22 మంది బరిలో మిగిలారు. రెండు ప్యానళ్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐదోసారి బరిలో ‘మంతూరి’ - మాజీ చైర్మన్ మంతూరి బాల్‌నర్సయ్య, తాజా మాజీ చైర్మన్ గున్నాల నర్సింలు మరోసారి చైర్మన్ పదవిపై కన్నేశారు. వీరిద్దరూ చెరో ప్యానల్‌ను ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. - దుబ్బాక మండలం చిట్టాపూర్ మత్స్య సహకార సంఘం చైర్మన్‌గా ఉన్న మంతూరి బాల్ నర్సయ్య జిల్లా చైర్మన్ పదవే లక్ష ్యంగా తన మద్దతుదారులతో కూడవెళ్లి ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. గతంలో ఈయన నాలుగు పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా పనిచేసి ప్రస్తుతం ఐదోసారి తలపడుతున్నారు. రెండోసారి ‘గున్నాల’ .. హత్నూర మండలం చింతల్‌చెరువు సొసైటీ చైర్మన్‌గా ఉన్న గున్నాల నర్సింలు కూడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో బాల్నర్సయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గున్నాల నర్సింలు చైర్మన్‌గా ఎన్నికై 2012 వరకు పదవిలో కొనసాగారు. ఈ సారి తిరిగి చైర్మన్ పదవిని ఆశిస్తూ తన మద్దతుదారులతో కలిసి మెదక్ మండలం మాచవరం ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో రాజకీయ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు శిబిరాలకు చెందిన వారు బుధవారం ఉదయం 8లోగా నేరుగా పోలింగ్ బూత్‌కు చేరుకోనున్నారు. -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ : గుండెపోటుతో ఓ హెడ్‌కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరు పట్టణం శివాజీ చౌక్‌కు చెందిన నర్సింలు (45) హెడ్ కానిస్టేబుల్. ఆయన వికారాబాద్‌లో ఏఎస్పీ వెంకటస్వామి సీసీగా పనిచేస్తూ స్థానిక క్వార్టర్స్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఆయన విధులు ముగించుకొని క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఛాతీలో నొప్పి వచ్చింది. ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబీకులకు విషయం చెప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి, సీఐ రవి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్, హౌజింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు నర్సింహాస్వామి తదితరులు మృతుడి కుటుంబీకులను ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుడికి భార్య, ఓ కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.