తిమ్మాపూర్, ముస్తాబాద్(సిరిసిల్ల), నర్సాపూర్ రూరల్: సోదరీ సోదరుల ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి ప్రతీక అయిన రక్షా బంధన్ రోజున గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు, ప్రమాదాల్లో ముగ్గురు సోదరులు దుర్మరణం పాలయ్యారు. రాఖీ కడదామని ఆనందంగా పుట్టింటికి వచ్చిన చెల్లెళ్లకు అన్నల మృతి తీరని శోకాన్ని మిగల్చగా.. అంతటి విషాదంలోనూ చివరిగా మృతదేహాలకు రాఖీ కట్టి సోదరులపై తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు.
రాఖీ కట్టేందుకు తన ఇద్దరు చెల్లెళ్లు వస్తున్నారని తెలిసి పొలం నుంచి స్కూటీపై ఇంటికి బయలుదేరిన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన పోచమల్లు యాదవ్ (43)ను రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి కరీంనగర్ వస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న మరణవార్త విని చెల్లెళ్లు బోరున విలపిస్తూ ఇంటికి వచ్చి శవానికి చివరిసారిగా రాఖీ కట్టారు.
చివరిసారి రాఖీ కడుతున్నా.. లేరా తమ్మీ..
‘లేరా తమ్మీ.. రాఖీ కట్టేందుకు వచ్చిన.. ఒక్కసారి చూడురా.. ఇది నీకు కట్టే చివరి రాఖీరా తమ్మీ..’అంటూ తమ్ముడి మృతదేహంపై పడి సోదరి గుండెలవిసేలా రోదించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కౌలురైతు అనమేని నర్సింలు(37) బుధవారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.
గురువారం మధ్యాహ్నం తరువాత బావిలో పడ్డట్లు గుర్తించి మృతదేహాన్ని బయటికి తీశారు. గంభీరావుపేట మండలం నర్మాలలో ఉండే సోదరి రాజవ్వకు ఈ విషయం తెలియక తన తమ్ముడు నర్సింలుకు రాఖీ కట్టేందుకు గురువారం ఉదయమే ముస్తాబాద్‌కు వచ్చింది. నర్సింలు బావిలో గల్లంతయ్యాడని తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది.
రాఖీ కడదామని వచ్చి అంత్యక్రియల్లో..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచ గ్రామానికి చెందిన కొండి జగన్(45)కు నర్సమ్మ, అంబిక ఇద్దరు చెల్లెళ్లు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరూ పుట్టింటికి వచ్చారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ గురువారమే మృతి చెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. రాఖీ కడదామని వస్తే అన్న అంత్యక్రియలు చే
Comments
Please login to add a commentAdd a comment