ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్‌లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.
టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.
ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment