shreya
-
అదొక పెద్ద స్కామ్.. అయినా అదే కోరుకుంటున్నా: జోష్ నటి
మన దేశంలో ఎక్కువమంది కలగనేది సొంతింటి గురించే! ఎంతోమంది రూపాయిరూపాయి కూడబెట్టి ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. కానీ ఈ రోజుల్లో ఇల్లు కట్టడమనేది స్థోమతకు మించిన భారంగా మారింది. జీవితాంతం కష్టపడినా ఇల్లు కట్టే లేదా కొనే పరిస్థితులు కనిపించడం లేదు.అదొక స్కామ్నటి శ్రేయ ధన్వంతరి కూడా ఇదే అంటోంది. ముంబైలో ఇల్లు కొనడమనేది ఒక స్కామ్.. ఎందుకంటే ఇంత లగ్జరీ కలను నెరవేర్చుకోవడమనేది నిజంగా తెలివితక్కువ పని. అయినా సరే నా మనసు ఇప్పటికీ ఆ పని చేయాలనే కోరుకుంటుంది అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. ఆ ట్రాప్‌లో చిక్కుకోకుఇది చూసిన జనాలు.. నిజంగానే ఎన్నో లక్షల మంది ఈ స్కామ్‌లో చేరుతున్నారు. అనవసరంగా ఇల్లు కొని జీవితాంతం ఈఎమ్ఐలు కడుతూ ఆ ట్రాప్‌లో చిక్కుకోకు.. అద్దెకు ఉంటేనే లైఫ్ ఏ బాధ లేకుండా ఈజీగా సాగిపోతుందంటూ పలువురు రకరకాలుగా సలహా ఇస్తున్నారు. జోష్ సినిమాలో..మరికొందరేమో.. సామాన్య జనాలే అపసోపాలు పడి ఇల్లు కొంటున్నప్పుడు నీవంటి సెలబ్రిటీలకు ఇది పెద్ద విషయమేమీ కాదే! అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రేయ.. 2009లో వచ్చిన జోష్ సినిమాలో నటించింది. వై చాట్(2019) చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.2020లో వచ్చిన స్కామ్ 1992తో ాపులర్ అయింది. ప్రస్తుతం అద్భుత్, నౌశిఖియే చిత్రాలు చేస్తోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క రాఖీకి వస్తానంది: శ్రేయ సోదరుడు
ఢిల్లీలోని ఒక కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబ సభ్యులు తమవారిని తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐఏఎస్ కావాలనే కలతో ఆ కోచింగ్ సెంటర్లో చేరిన శ్రేయ యాదవ్ కూడా ప్రమాదం బారినపడి ప్రాణాలు కోల్పోయింది.టీవీలో వస్తున్న వార్తలు చూశాకనే తమ శ్రేయ ఈ లోకంలో ఇక లేదని తెలిసిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ మీడియాకు తెలిపారు. మీడియాతో మాట్లాడిన శ్రేయ సోదరుడు.. అక్క రాబోయే రక్షాబంధన్‌కు వస్తానని హామీ ఇచ్చిందని చెబుతూ కంటనీరు పెట్టుకున్నాడు. ఇంటిలోని పెద్ద సంతానం మృతి చెందడంలో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యంకావడం లేదు.ఘజియాబాద్‌లో ఉంటున్న శ్రేయ మామ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన వార్త టీవీలో చూడగానే శ్రేయకు ఫోన్ చేశాను. ఎటువంటి సమాధానం రాలేదు. వెంటనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ సిబ్బందితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. చివరికి కోచింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లగా, అక్కడి సిబ్బంది శ్రేయ మృతిచెందిందని చెప్పారుగానీ, ఆమె ముఖం చూపించలేదు. ఎందుకని అడిగితే ఇది పోలీసు కేసు అని చెప్పారని ధర్మేంద్ర తెలిపారు. -
శ్రేయరాగ రాక్‌స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు. పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి.... ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్‌గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్‌గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది. వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు. ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్‌గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి. కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది. తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా... ‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’ -
వేదికపై రచ్చ.. అందరూ చూస్తుండగా నటుడికి ముద్దు పెట్టిన శ్రియ!
టాలీవుడ్ హీరో తరుణ్, శ్రియ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'నువ్వే నువ్వే '. ఈ సినిమా విడుదలై సోమవారం(అక్టోబర్ 10)నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, హీరోయిన్ శ్రియ ,దర్శకుడు త్రివిక్రమ్, నటుడు ప్రకాష్‌రాజ్‌తో పాటు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రియ మాట్లాడుతూ.. 'ఇంత అందమైన స్టోరీ రాసిన త్రివిక్రమ్ సార్‌కు నా ధన్యవాదాలు. ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మీరు తండ్రిలాంటి వారు. మా పేరెంట్స్‌లాగే నాకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా తన కో స్టార్ తరుణ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది. అమేజింగ్ కో స్టార్ అంటూ ఆకాశానికెత్తేసింది. తరుణ్‌ను పొగుడుతూనే వేదికపైనే అందరూ చూస్తూండగా ముద్దు పెట్టేసింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.' ఈ సినిమా ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సభ్యులంతా ఎమోషనల్‌గా ఫీలయ్యారు. -
ISSF World Cup: అమ్మాయిలు అదరగొట్టారు.. పసిడి పతకంతో..
బాకు(అజర్బైజాన్): ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్ బంగారు బోనీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల టీమ్ ఈవెంట్లో ఇలవేనిల్ వలరివన్, రమిత, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో టీమిండియా 12-5 పాయింట్ల తేడాతో అనా నీల్సన్, ఎమ్మా కోచ్, రిక్కీ మెంగ్ ఇస్బెన్లతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. ఇదిలా ఉంటే.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత జట్టుకు నిరాశ ఎదురైంది. తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, రుద్రాక్ష్, పార్థ్‌లతో కూడిన భారత జట్టు కాంస్య పతక పోరులో 10-16తో క్రొయేషియా జట్టు చేతిలో ఓడిపోయింది. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1కు ఘోర పరాజయం -
చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించింది.. కానీ హీరోయిన్గా మాత్రం..
చైల్ట్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారనే గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ శ్రేయా గుప్తా. సినిమాల్లో రాణించలేకపోయినా, వెబ్ సిరీస్‌లలో తన ప్రతిభను నిరూపించుకుంటోంది. అలా స్క్రీన్ లైఫ్‌ను రీస్టార్ట్ చేసిన ఈ వెబ్‌స్టార్ గురించి కొన్ని మాటలు.. ►శ్రేయా పుట్టి, పెరిగింది చెన్నైలో ► క్రిస్ట్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేసింది. అనంతరం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరింది. కొంతకాలం థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది. ► ఒకవైపు థియేటర్ షోలు, యాడ్ షూట్లు చేస్తూనే సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నించింది. ► ‘పల్లికూడమ్’తో తనను చైల్ట్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీనే ఆర్టిస్ట్‌గానూ మళ్లీ ఆమెకు అవకాశాన్నిచ్చింది. ► సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పాటు ‘ఆరంభం’, ‘రోమియో జూలియట్’ తమిళ సినిమాల్లో నటించింది. ► అయినా రావాల్సిన గుర్తింపు రాలేదు. దాంతో మళ్లీ థియేటర్ షోలు చేద్దామనుకొని ముంబై వెళ్లింది. ► మంచినీళ్లు అడిగితే, మజ్జిగ ఇచ్చినట్లు స్టేజ్ షోల కోసం వెళ్లిన ఆమెకు అవధుల్లేని వెబ్ తెర మీద జీవించే చాన్స్ దొరికింది. ► 2017లో ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్’ సిరీస్‌తో వెబ్‌దునియాలోకి ఎంట్రీ ఇచ్చి, వరుస సిరీస్‌లలో నటిస్తూ వెబ్‌స్టార్‌గా ఎదిగింది. వాటిల్లో ‘దిల్’, ‘దోస్తీ ఔర్ కరోనా ’, ‘కపుల్స్ ఇన్ లాక్డౌన్’, ’ది ఫర్ఫెక్ట్ డేటా’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. పలు షార్ట్ మూవీస్‌లోనూ కనిపించింది. నా కంఫర్ట్ జోన్.. కెమెరా ముందు నిలబడటం. దాని ఫ్రేమ్‌లో నటిస్తూ నన్ను నేను మర్చిపోతా. నాకు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. – శ్రేయా గుప్తా -
త్రిబుల్ ధమాకా
శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి. తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్. -
తొలి సిరీస్‌తోనే పాన్ ఇండియా అభిమానులు
శ్రేయ చౌదరి.. ఓటీటీ వీక్షకులు పలవరిస్తున్న పేరు. కారణం బందిష్ బాండిట్ వెబ్‌సిరీస్. అమెజాన్ ‘ప్రైమ్ వీడియో’లో ప్రసారం అవుతోంది. అందులో కథానాయిక పాప్ సింగర్ తమన్నా శర్మనే శ్రేయ చౌదరి. తొలి సిరీస్‌తోనే పాన్ ఇండియా అభిమానులను సంపాదించుకుని ఇక్కడ పరిచయానికి మేకప్ చేసుకుంది. పుట్టింది కోల్‌కతాలో. పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. కంచన్ చౌదరి, రోహిత్ చౌదరి. శ్రేయకు ఒక అన్న... కరణ్ చౌదరి. ముంబై.. నర్సీ మోన్జీ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చదివింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు టీవీ కమర్షియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. 2014లో ‘ఫెమినా మిస్ ఇండియా కోల్కత్తా’ అందాల పోటీలో పాల్గొంది. ఎఫ్‌బీబీ మిస్ ఫ్యాషన్ ఐకాన్’, ఫెమినా మిస్ బాడీ బ్యూటిఫుల్, టైమ్స్ మిస్ సుడోకు.. టైటిల్స్‌ను గెలుచుకుంది. డియర్ మాయా.. శ్రేయ తొలి సినిమా. 2017లో వచ్చింది. మనీషా కోయిరాలా, పాకిస్తానీ నటి మదీనా ఇమామ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ది అదర్ వే.. శ్రేయ నటించిన షార్ట్ ఫిల్మ్. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పాతిక లక్షల వ్యూస్ వచ్చాయి. ఇందులో ఆమెది తలపొగరు పెళ్లికూతురి పాత్ర. దర్శకుడు ఇమ్తియాజ్ అలీ. బందిష్ బాండిట్తో ఓటీటీ ప్రవేశం చేసింది శ్రేయ. సంగీతం, ప్రేమ జుగల్ బందీగా సాగిన ఆ సిరీస్ అశేష వీక్షకాదరణ పొందుతోంది. ఇప్పుడు ఓటీటీ అభిమానుల చాటింగ్ టాపిక్స్ రెండే రెండు.. బందిష్ బాండిట్ అండ్ శ్రేయ చౌదురి. సంగీతం వినడం, గుర్రపు స్వారీ, ప్రయాణాలతోపాటు తన రాయల్ ఎన్ఫీల్డ్ మీద లాంగ్ డ్రైవ్‌లు.. ఏ కొంచెం సమయం దొరికినా శ్రేయ ఆస్వాదించే అభిరుచులు. ఆమె బాక్సర్ కూడా. -
తండ్రి చెంతకు చేరిన చిన్నారి శ్రేయ
రాజమండ్రి క్రైం :బెంగళూరు సమీపంలోని బెల్గాంలోని విజయపురి టౌన్ నుంచి అపహరణకు గురైన శ్రేయ చివరకు తన తండ్రి వద్దకు చేరుకుంది. సెల్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ చందప్పను గుర్తించిన రాజమండ్రి టూ టౌన్ క్రైం పోలీసులు శ్రేయను సోమవారం రక్షించిన విషయం తెలిసిందే. ఆ చిన్నారిని రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లా ఎస్పీ హరికృష్ణ పర్యవేక్షణలో కేవీ స్టేట్ హోమ్‌లో ఉంచారు. శ్రేయ తండ్రి ఉమేష్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. తండ్రిని చూడగానే చిన్నారి శ్రేయ కన్నీటితో ‘పప్పా’ అంటూ హత్తుకుపోయింది. కన్నబిడ్డ ఎనిమిది రోజులుగా కనిపించకపోవడంతో తల్లడిల్లిన ఉమేష్.. ఎట్టకేలకు తన కుమార్తెను చూసి ఉద్విగ్నతకు గురయ్యారు. ఇదీ కిడ్నాప్ నేపథ్యం బెంగళూరు విజయపురి టౌన్ సీఐ ఎస్.మహేష్‌కుమార్ కథనం ప్రకారం.. తన భార్య ఆస్తిని తనకు తెలియకుండా విక్రయించారని ఉమేష్‌పై చందప్ప కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 15న ఉమేష్, ఆయన భార్య యథావిధిగా ఉద్యోగాలకు వెళ్లారు. కుమార్తె శ్రేయను ఉమేష్ తల్లి చూసుకుంటున్నారు. ఆ సమయంలో ఉమేష్ ఇంటికి చందప్ప వెళ్లాడు. ఉమేష్ తల్లి నుంచి శ్రేయను తీసుకొని, చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకువెళ్లాడు. ఉమేష్ దంపతులు ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తె గురించి ఆరా తీయగా చందప్ప తీసుకెళ్లిన విషయం తెలిసింది. ఎంతసేపటికీ శ్రేయను తీసుకురాకపోవడం, అదే సమయంలో ఉమేష్‌కు చందప్ప ఫోన్ చేసి, తన ఆస్తి తిరిగి ఇవ్వాలని లేదా పరిష్కారం చూపాలని లేకుంటే శ్రేయను వదలనని బెదిరించాడు. దీనిపై ఉమేష్ విజయపురి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ శ్రేయను పలు ప్రాంతాల్లో తిప్పిన చందప్ప సోమవారం రాజమండ్రి చేరుకున్నాడు. స్థానిక కుమారి థియేటర్ సమీపంలో అతడి సెల్ సిగ్నల్ ట్రేస్ కావడంతో బెంగళూరు పోలీసులు రాజమండ్రి ఎస్పీ హరికృష్ణకు విషయం తెలిపి, సహకరించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎస్పీ పోలీసులను అప్రమత్తం చేసి, కిడ్నాపర్ చందప్పను అదుపులోకి తీసుకుని, శ్రేయను కాపాడారు. కిడ్నాపర్ చందప్పను బెంగళూరు పోలీసులకు అప్పగించారు. వారు అతడిని తమవెంట తీసుకువెళ్లారు. పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటా : ఉమేష్ తన కుమార్తెను రక్షించడంలో కృషి చేసిన బెంగళూరు, ఆంధ్ర పోలీసులు చాలా సహకరించారని శ్రేయ తండ్రి ఉమేష్ అన్నారు. పోలీసులకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చందప్పకు సంబంధించిన ఆస్తి విలువ రూ.6 లక్షలుంటుందని, అది కుటుంబ తగాదా అని తెలిపారు. పాపను ఏమైనా చేస్తారేమోనని భయపడ్డామని, శ్రేయను చూడగానే ప్రాణం లేచి వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. -
రిహార్సల్స్ లో.. మేముసైతం
హుద్‌హుద్ తుఫాన్ అందాల విశాఖను కకావికలం చేసింది. పగబట్టిన సుడిగాలి స్టీల్ సిటీ గుండె నిబ్బరాన్ని కొన్ని గంటలు పరీక్షించింది. తుపాను ధాటికి తల్లడిల్లిన విశాఖకు తనువెల్లా తూట్లు పడ్డాయి. లక్ష కోట్లు నష్టపోయింది. పెను విషాదంలో మునిగిన విశాఖ నగరాన్ని ఊరడించడానికి టాలీవుడ్ నడుం బిగించింది. ఆ తరం నుంచి నేటి తరం వరకూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ‘మేముసైతం’ అంటూ రంగంలోకి దిగారు. జూనియర్ ఆర్టిస్ట్స్ నుంచి బడా స్టార్స్ వరకూ.. లైట్‌మెన్ నుంచి కెమెరామెన్ వరకూ.. అందరూ తమ కళతో.. తుఫాను సృష్టించిన ‘అల’జడిని జయిస్తామంటున్నారు. జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా.. చేతనైన సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ఈ నెల 30న మేముసైతం అంటూ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆటపాటలు, డ్యాన్స్‌లు, స్కిట్స్‌తో అందరినీ అలరిస్తూనే.. వైజాగ్‌వాసులను ఓదారుస్తామంటున్నారు. ఇండస్ట్రీ తరఫున రూ.35 కోట్లు సాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఈవెంట్‌ను సకె ్సస్ చేయడానికి ప్రాక్టీస్‌లో మునిగిపోయిన నటీనటులను ‘సిటీప్లస్’ పలకరించింది. ..:: శిరీష చల్లపల్లి మారథాన్ పెర్ఫార్మెన్స్.. బిజీ షెడ్యూల్‌తో రెస్ట్‌లెస్‌గా ఉంది. అయితే హుద్‌హుద్ ధాటికి విశాఖలో నిలువ నీడ లేకుండా ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. వారికి చేయూతనివ్వడానికి నేనుసైతం మేముసైతంతో పాలుపంచుకుంటున్నాను. 12 నిమిషాల నిడివున్న సాంగ్‌పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. - శ్రేయ అందుకే అందరం.. విపత్కర పరిస్థితుల్లో ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే. మా తరఫున భారీగా నిధులు సేకరించాలని భావిస్తున్నాం. ఒకే వేదికపై ఇందరిని చూడటం జరగని పని. కానీ, ప్రకృతి వైపరీత్యానికి సర్వం కోల్పోయిన వారి కోసం అందరం చేతులు కలిపి.. బాధితులకు భరోసానిస్తున్నాం. -అలీ కమల్ వస్తున్నారు.. ఈ బిగ్ ఈవెంట్లో ఇండస్ట్రీ మొత్తం పాల్గొంటుంది. భారీనిధుల సేకరణే లక్ష్యంగా ఇంత పెద్ద ఈవెంట్‌ను డిజైన్ చేశాం. టాలీవుడ్ స్టార్స్ అందరితో పాటు కమల్‌హాసన్ కూడా వస్తున్నారు. స్టార్స్ ఆటపాటలతోపాటు ర్యాంప్‌వాక్ కూడా నిర్వహిస్తున్నాం. విశాఖ విలయం తర్వాత సిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన వ్యక్తుల గురించి అందరికీ తెలియజేస్తాం. - తమ్మారెడ్డి భరద్వాజ మీకోసం మేము.. విశాఖ బాధితుల కోసం నేను, డెరైక్టర్ మారుతి, నటి మధు, నటుడు సాయి కలసి స్పెషల్ షూట్ చేస్తున్నాం. ఇది హుద్‌హుద్ బాధితులకు మనోధైర్యాన్నిచ్చేలా ఉంటుంది. మనమంతా ఒక్కటై ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొందాం. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. కానీ, మీకు మేమున్నాం మనోధైర్యాన్ని కోల్పోకండి. - హీరో నందు గుడ్ కాజ్.. నేను అక్ష, సంజన కలసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం. ఎనిమిదిన్నర నిమిషాల పాటు సాగే మాస్ సాంగ్ కోసం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక గుడ్ కాజ్లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. - మానస్ (కాయ్ రాజా కాయ్ హీరో) చారిటీ.. యూనిటీ.. విశాఖ వైపరీత్యానికి బాధగా ఉన్నా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ప్రజలకు ఆనందం పంచుతూనే విశాఖవాసులకు చారిటీ చేయడం నాలుగు రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నా. స్టీల్ సిటీగా పేరొందిన వైజాగ్ అంతే నిబ్బరంగా ఉండాలని కోరుకుంటున్నాను. - అక్ష (కందిరీగ ఫేమ్) ఆనాటి నుంచే.. మమ్మల్ని బాగా ఉంచుతున్న ప్రేక్షకులు బాగుండాలని ఇండస్ట్రీ ఎప్పుడూ కోరుకుంటుంది. మేముసైతం ఈవెంట్లో టాలీవుడ్ టాప్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ పాల్గొంటున్నారు. మా పెద్దమ్మాయి చేతన తొందర్లోనే వెండితెరకు పరిచయం కాబోతుంది. తను కూడా ఇందులో పాల్గొంటోంది. - ఉత్తేజ్ ఓపెన్ హార్టెడ్‌గా.. మూడు రోజులుగా రిహార్సల్స్ సాగుతున్నాయి. అందరూ సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. తమన్నా, ఇషాచావ్లా, కావ్యలకు మెడ్లీ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నాను. ఒక కాజ్ గురించి ఇండస్ట్రీ అంతా కలసి వర్క్ చేయడం గొప్ప ఫీలింగ్. అందరూ ఓపెన్ హార్టెడ్‌గా పని చేస్తున్నారు. - రఘు మాస్టర్ (కొరియోగ్రాఫర్) నాలుగు రోజులుగా.. నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాం. ఓ కన్నడ సినిమా షూటింగ్ ఉంది. దాన్ని స్కిప్ చేసి మరీ ఇందులో పాల్గొంటున్నా. మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం దీన్ని ఓ బాధ్యతగా స్వీకరించాం. - సంజన మా తరఫున ఎందరో.. విశాఖ బాధితులకు మేం సాయం చేయడమే కాదు.. మా తరఫున ఎందరినో కదిలించి ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. ఈవెంట్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి మా నట కుటుంబం అంతా సీరియస్‌గా రిహార్సల్స్‌లో మునిగిపోయింది. - కామ్నా జెఠ్మలానీ సాయంకాలం విశాఖ విలయంలో పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కానీ మా ఈవెంట్ ద్వారా విశాఖవాసులకు కొంత సాంత్వన కలుగుతుందని ఆశిస్తున్నాం. మేముసైతం 12 గంటలపాటు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో క్రికెట్, అంత్యాక్షరి, ఖోఖో, కబడ్డీ, తంబోలా, సాంగ్, డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్స్ ఇలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. 29 నైట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో స్టార్ డిన్నర్ నిర్వహిస్తున్నాం. స్టార్స్‌తో భోజనం చేసేందుకు జంటకు రూ.లక్ష టికెట్ ధరగా నిర్ణయించాం. టికెట్ తీసుకున్నవారు స్టార్స్‌తో భోజనం చేయొచ్చు. 30న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఉంది. దీని టికెట్ ధర రూ.3 వేలు. ఈ టికెట్లు బిగ్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ రోజు సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాయి. స్టార్ ఈవెంట్స్ చూడాలనుకునే వారు ముందుగా రూ.500 టికెట్స్ కొనాలి. వీటిని కొన్నవారిలో లక్కీ డ్రా ద్వారా 104 మందిని ఎంపిక చేస్తాం. వీరికి మాత్రమే స్టార్ సెలబ్రేషన్స్‌ను దగ్గరుండి చూసే చాన్స్ లభిస్తుంది. స్టేడియంలో తంబోలా గేమ్ టికెట్ ధర రూ.15 వేలు. ఇందులో గెలిచిన వారికి భారీ బహుమతి కూడా ఉంటుంది. - దగ్గుబాటి సురేష్ -
ఓ మై గాడ్ రీమేక్ లో వెంకటేశ్
-
శ్రీయ అవుట్ వరలక్ష్మి ఇన్
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్న మహాకవి రాసిన పాటలోని పల్లవిని గుర్తు చేసుకునేలా చేస్తున్నారు దర్శకుడు బాల. ఈ జాతీయ ఉత్తమ నటుడు పరదేశి చిత్రం తరువాత తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శశికుమార్‌ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. హీరోయిన్ పాత్రకే నటీమణుల్లో ఆశలు రేకెత్తించి నిరాశ పరుస్తున్నారు. వైవిధ్యంతో కూడిన కథలను తెరకెక్కించే బాలా ఈసారి గరగాట్టాన్ని నేపథ్యంగా ఎంచుకుని చిత్రాన్ని రూపొందించనున్నారు. దీంతో గరగాట్ట నృత్యం బాగా ఆడే హీరోయిన్ బాలాకు అవసరం అయ్యారు. దీంతో నృత్యంలో ప్రావీణ్యం ఉన్న నటి శ్రీయను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా శ్రీయను కాదని ఆ పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారని తెలిసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కల్సా నృత్యంలో శిక్షణ పొంది పలు నృత్య రూపకాలను ఆడారన్నది గమనార్హం. పోడాపొడి చిత్రం నిరాశ పరచడం, రెండవ చిత్రం మదగజరాజా చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కాకపోవడంతో అలిగి కన్నడ చిత్ర పరిశ్రమ వైపు పరిగెత్తిన వరలక్ష్మి శరత్‌కుమార్‌కు బాలా అవకాశం ఇవ్వడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందట. ఈ చిత్రం కోసం ఇళయరాజా ఆరు రోజుల్లో 12 పాటలను సిద్ధం చేశారు. ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుందని సమాచారం. -
వారిలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది - శ్రీయ
‘‘నేను ఢిల్లీలోని డీపీయస్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ ఓ అంధుల పాఠ శాల ఉండేది. ప్రతివారం నేను ఆ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని. నాకు వీలైనంత వరకూ వారికి సమయం కేటాయిస్తుంటాను. కల్మషంలేని మనస్తత్వంతో పాటు, అద్భుతమైన ప్రతిభ వారిలో ఉంటుంది. ‘మిణుగురులు’ చిత్రం అద్భుతంగా ఉంది. అంధుల సమస్యను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి చిత్రాల్ని ప్రోత్సహించాలి’’ అని శ్రీయ చెప్పారు. అంధుల సమస్యలపై అయోధ్యకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మిణుగురులు’ చిత్రాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శ్రీయ పలువురు అంధ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. -
ఆ తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది
‘‘కెరీర్ విషయంలో నేను రెండు బ్లండర్స్ చేశాను. తొందరపాటు వల్ల చేసిన తప్పిదాలవి. వాటి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా’’ అంటూ ఓ నిట్టూర్పును విడిచారు అందాలభామ శ్రీయ. కెరీర్ దాదాపు చరమాంకానికి చేరుకోవడంతో ఓ విధమైన నిర్వేదానికి గురయ్యారామె. ఇటీవల ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవానికి విశాఖ చేరుకున్న శ్రీయ.. మీడియాతో ముచ్చటించారు. ‘‘కెరీర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో నేను చేసిన పెద్ద తప్పు ఐటమ్‌సాంగ్ చేయడం. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లందరూ ఐటమ్ నంబర్స్ చేస్తున్నారు. పైగా ఆ ఒక్కపాట వారి కెరీర్‌కి ఎంతో హైట్స్‌కి తీసుకెళ్తోంది. ఆ ట్రెండ్‌ని మనమెందుకు ఇక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో ‘మున్నా’లో ఐటమ్‌సాంగ్ చేశాను. ఏ ముహూర్తాన ఆ పాట చేశానో... వరుసగా ఐటమ్సాంగులే రావడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించినా... అవి నా కెరీర్‌కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అలాగే... ‘కాల్‌గాళ్’ పాత్ర చేస్తే... కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఆశించాను. బాలీవుడ్లో ఈ ఫీట్ చేసిన హీరోయిన్లందరూ మంచి హిట్స్ అందుకున్నారు. అలాగే... నాక్కూడా ఆ పాత్ర హిట్ ఇస్తుందని ఆశించి ‘పవిత్ర’ చేశాను. ఆ సినిమా నా కెరీర్‌పై ఏర్పడిన గాయాన్ని మరింత పెంచింది. ఈ రెండు తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది’’ అని గత స్మృతుల్ని నెమరువేసుకున్నారు శ్రీయ.