శ్రీయ
‘‘కెరీర్ విషయంలో నేను రెండు బ్లండర్స్ చేశాను. తొందరపాటు వల్ల చేసిన తప్పిదాలవి. వాటి ప్రతిఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నా’’ అంటూ ఓ నిట్టూర్పును విడిచారు అందాలభామ శ్రీయ. కెరీర్ దాదాపు చరమాంకానికి చేరుకోవడంతో ఓ విధమైన నిర్వేదానికి గురయ్యారామె. ఇటీవల ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవానికి విశాఖ చేరుకున్న శ్రీయ.. మీడియాతో ముచ్చటించారు. ‘‘కెరీర్ మంచి పీక్‌లో ఉన్న టైమ్‌లో నేను చేసిన పెద్ద తప్పు ఐటమ్‌సాంగ్ చేయడం. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లందరూ ఐటమ్ నంబర్స్ చేస్తున్నారు. పైగా ఆ ఒక్కపాట వారి కెరీర్‌కి ఎంతో హైట్స్‌కి తీసుకెళ్తోంది.
ఆ ట్రెండ్‌ని మనమెందుకు ఇక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో ‘మున్నా’లో ఐటమ్‌సాంగ్ చేశాను. ఏ ముహూర్తాన ఆ పాట చేశానో... వరుసగా ఐటమ్‌సాంగులే రావడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా... అవి నా కెరీర్‌కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అలాగే... ‘కాల్‌గాళ్’ పాత్ర చేస్తే... కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని ఆశించాను. బాలీవుడ్‌లో ఈ ఫీట్ చేసిన హీరోయిన్లందరూ మంచి హిట్స్ అందుకున్నారు. అలాగే... నాక్కూడా ఆ పాత్ర హిట్ ఇస్తుందని ఆశించి ‘పవిత్ర’ చేశాను. ఆ సినిమా నా కెరీర్‌పై ఏర్పడిన గాయాన్ని మరింత పెంచింది. ఈ రెండు తప్పులు చేయకపోతే నా కెరీర్ వేరేలా ఉండేది’’ అని గత స్మృతుల్ని నెమరువేసుకున్నారు శ్రీయ.