
శింబు హీరోగా, తమన్నా, శ్రియ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అఅఅ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుసుమ ఆర్ట్స్ పతాకంపై యాళ్ళ కీర్తి నిర్మాణ సారథ్యంలో యాళ్ళ వెంకటేశ్వరరావు (కృపావరం) తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా యాళ్ళ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. శింబు మూడు పాత్రల్లో కనిపిస్తారు. తమన్నా, శ్రియల పాత్రలు బాగుంటాయి.
తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అన్ని హంగులు ఉంటాయి. డైలాగ్స్, పాటలు ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. అందరూ మా సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో జక్కుల నాగేశ్వరరావు, బాలాజీ నాగలింగం, బొప్పన గోపీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జక్కుల నాగేశ్వరరావు, సహ నిర్మాతలు: యాళ్ళ మేరీ కుమారి, యాళ్ళ రాహుల్.
Comments
Please login to add a commentAdd a comment