
వారిలో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది - శ్రీయ
నేను ఢిల్లీలోని డీపీయస్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు అక్కడ ఓ అంధుల పాఠ శాల ఉండేది. ప్రతివారం నేను ఆ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని.
‘‘నేను ఢిల్లీలోని డీపీయస్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు అక్కడ ఓ అంధుల పాఠ శాల ఉండేది. ప్రతివారం నేను ఆ స్కూలుకి వెళ్లి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడేదాన్ని. నాకు వీలైనంత వరకూ వారికి సమయం కేటాయిస్తుంటాను. కల్మషంలేని మనస్తత్వంతో పాటు, అద్భుతమైన ప్రతిభ వారిలో ఉంటుంది. ‘మిణుగురులు’ చిత్రం అద్భుతంగా ఉంది. అంధుల సమస్యను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇలాంటి చిత్రాల్ని ప్రోత్సహించాలి’’ అని శ్రీయ చెప్పారు.
అంధుల సమస్యలపై అయోధ్యకుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మిణుగురులు’ చిత్రాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శ్రీయ పలువురు అంధ విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు.